పొడి దగ్గు నివారణకు 14 అద్భుతమైన చిట్కాలు

Health Insurance Plans starting at Rs.15/day*

Health Insurance Plans starting at Rs.15/day*

పరిచయం

దగ్గు ఏ సమయంలోనైనా ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల రోజువారీ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి. రాత్రిళ్లు విలువైన నిద్రను కోల్పోతాం. అదృష్టవశాత్తూ మందులు వాడకుండా దగ్గును ఆపడానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుసుకుందాం.

ఒక వ్యక్తికి ఏదైనా ముఖ్యమైన వైద్య పరిస్థితి లేదా ఇప్పటికే అనారోగ్య సమస్యలు.. దగ్గు నుంచి బయటపడటం కష్టమేమీ కాదు. సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సలు మరియు క్రింది సూచనలను పాటించడం ద్వారా దగ్గు యొక్క తీవ్రతను బాగా తగ్గించవచ్చు.

కింద ఉన్న చిట్కాలను పాటించడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి సాధారణ కారణాలతో ఏర్పడే దగ్గుకు వీడ్కోలు చెప్పవచ్చు.

పొడి దగ్గు యొక్క కారణాలు

దుమ్ము, ధూళి వల్ల ఏర్పడే అలెర్జీ

ధూమపానం

ఉబ్బసం

ఫ్లూ, జలుబు, లేదా కరోనా వంటి వైరల్ వ్యాధి

స్వరపేటిక యొక్క శోధము

కొన్ని కణాలను పీల్చడం

పోస్ట్ వైరల్ దగ్గు

పోస్ట్ నాసల్ డ్రిప్- ముక్కు లేదా సైనస్ నుంచి శ్లేష్మం ఉత్సర్గ, గొంతు వెనుక భాగంలో ప్రవహిస్తుంది

క్షయవ్యాధి

ఊపిరితిత్తుల వ్యాధి

మందులు వాడటం వల్ల వచ్చే దగ్గు

పొడి దగ్గు నివారణకు 14 ఇంటి నివారణలు

పొడి దగ్గు రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. రాత్రి నిద్రకు చాలా అంతరాయం కలిగిస్తుంది. అనేక సాంప్రదాయ పొడి దగ్గు ఇంటి నివారణలు కొన్ని తరాలుగా అందుబాటులో ఉన్నాయి. అవి స్వల్పకాలిక ఉపయోగం కోసం మాత్రమే సురక్షితమైనవిగా భావించబడుతున్నాయి.

హైడ్రేషన్

పొడి గొంతు దగ్గును మరింత తీవ్రతరం చేస్తుంది. టీ లేదా నిమ్మకాయతో నీరు వంటి ద్రవాలను తాగడం పొడి దగ్గు నివారణలో సహాయపడుతుంది. దగ్గును తగ్గించడానికి సులభమైన మరియు సురక్షితమైన మార్గాలలో ఇది ఒకటి.

హైడ్రేషన్ కారణంగా శ్లేష్మం సన్నగా మారి నోరు లేదా ముక్కు ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్తుంది. ఇది చెమట లేదా ముక్కు కారణం ద్వారా కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడంలో అనారోగ్య వ్యక్తులకు కూడా సహాయపడుతుంది.

ఉప్పునీరు పుక్కిలించు

గొంతు నొప్పిని తగ్గించడం, పొడి దగ్గు కోసం ఇంటి చిట్కాలు పాటిస్తున్నప్పుడు ఉప్పునీటిని నోటిలో పోసుకుని పుక్కిలించమని వైద్యులు రోగులను ప్రోత్సహిస్తారు. ఉప్పునీరు ద్రవాభిసరణ, ఇది ద్రవాల దిశను మారుస్తుంది కాబట్టి.. పొడి దగ్గు, వాపు మరియు చికాకును తగ్గిస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉప్పు కలపండి. ఈ మిశ్రమాన్ని పుక్కిలించడానికి ఉపయోగించండి. నీటిని ఉమ్మివేయడానికి ముందు గొంతులో కాసేపు ఉంచుకుండి. మంచి ఫలితం కోసం రోజులో అనేకసార్లు చేయండి.

దగ్గు తగ్గేవరకూ రోజూ చాలాసార్లు ఉప్పు నీటితో పుక్కిలించాలి.

వెచ్చని ద్రవాలు

దగ్గు మరియు జలుబు ఉన్న వారికి వెచ్చగా మరియు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. రోగి ఎప్పుడైనా వేడిగా ఏదైనా తాగితే.. లక్షణాలు వెంటనే తగ్గుతాయి.

నీరు, పులుసులు, మూలికా టీలతో సహా వెచ్చని ద్రవాలు చలి మరియు గొంతు నొప్పి మరియు పొడి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తాయి. వేడి ద్రవాన్ని తాగిన తర్వాత ఈ ప్రభావాలు కొంతకాలం ఉంటాయి.

తేనె

దగ్గు వంటి శ్వాసకోశ సంక్రమణ లక్షణాల చికిత్సకు తేనె మంచి ప్రత్యామ్నాయం అని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

తేనే అధిక స్నిగ్ధతను కలిగి ఉంటుంది. దగ్గు చుక్కలకు సమానమైన ప్రభావం కలిగి ఉంది. దీన్ని మింగినప్పుడు గొంతు నొప్పి తగ్గుతుంది. డార్క్ బుక్‌వీట్ వంటి ముదురు తేనెను దగ్గు చికిత్సలో క్లోవర్ తేనె కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ప్రజలకు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.

వీటితో పాటు తేనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మరియు వ్యాధుల నివారణలో సహాయపడతాయి.

తేనెను విడిగా తినవచ్చు. వేడి టీతో కలిపి తాగడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ తేనె నీరు తయారుచేసుకోవడం కోసం మీకు ఏం కావాలంటే?

రెండు టేబుల్‌స్పూన్ల తేనె

ఒకటిన్నర టీస్పూన్ నిమ్మరసం

ఒక గ్లాసు నీరు

తయారు చేయువిధానం

వేడినీటిలో తేనెను బాగా కలపండి

అందులో నిమ్మరసం వేసి.. మళ్లీ కలిపి, తాగండి

ఈ పానీయాన్ని ఉదయం మరియు రాత్రి ఒక గ్లాసు తీసుకోండి. దాల్చిన చెక్క, పుదీనా మరియు అల్లంతో తేనె వంటి ఇతర కలయికలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

అల్లం

రోగనిరోధశ శక్తిని పెంచడం మరియు నొప్పిని తగ్గించడంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలను అల్లం కలిగి ఉంటుంది. శ్లేష్మాన్ని విడుదల చేసే మరియు దగ్గు ఫిట్స్ యొక్క తీవ్రతను తగ్గించే ఎక్స్‌ పెక్టరెంట్‌గా అల్లం పొడి దగ్గుకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

అల్లంతో కూడిన టీలను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ అల్లం పొడిని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు ఉన్న వ్యక్తికి అద్భుతంగా పనిచేస్తుంది.

ఒక స్పూన్ తేనె మరియు అల్లం రసాన్ని కలిపి రోజుకు రెండుసార్లు తినండి. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఆవిరి పీల్చడం

ఆవిరి పీల్చడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ఒక వ్యక్తి తన ముక్కు నుంచి శ్వాస పీల్చడం, వదలడంలో సులభంగా సహాయపడుతుంది. అలాగే గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని విడుదల చేస్తుంది. ఆవిరి గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

తక్షణ ఉపశమనం కోసం మరిగే నీటి కుండ నుంచి వచ్చే ఆవిరిని పీల్చడానికి ప్రయత్నించండి. ఒక గిన్నెలో నీటిని వేడి చేయండి. ఆ గిన్నెను ముందు ఉంచి.. మీరు సౌకర్యంగా కూర్చోండి. ఆవిరి బయటకు వెళ్లకుండా మీ తలపై ఒక గుడ్డను ఉంచండి. గిన్నెకు మీరు చాలా దగ్గరగా ఉండేలా చూసుకోండి. వేడి నీళ్లతో స్నానం చేసినా ఇదే ప్రభావం ఉంటుంది.

లైకోరైస్ రూట్

ఇవి నొప్పిని తగ్గించడానికి, శ్లేష్మాన్ని శుభ్రపరచడానికి మరియు దగ్గును ఉపశమింపజేసే సాధనాలుగా ఉపయోగపడతాయి. వీటితో తయారైన టీ తాగడం వల్ల గొంతులో అసౌకర్యం నుంచి ఉపశమనం పొందవచ్చు.

పసుపు

పసుపు, దాని కర్కుమిన్ కంటెంట్‌తో పొడి దగ్గుకు అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది.

ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున.. పొడి దగ్గు ఉన్నవారు వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. పురాతన ఆయుర్వేద నివారణగా, పసుపు శ్వాసకోశ వ్యాధుల నుంచి ఆర్థరైటిస్ వరకు ప్రతిదానికీ చికిత్స చేయగలదు.

కావాల్సిన పదార్థాలు

బియ్యం, బాదం లేదా కొబ్బరి పాలు-1 కప్పు

పసుపు పొడి-1/4 టీస్పూన్

తయారీ విధానం

ఒక గ్లాసు పాలలో పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి

దగ్గు తగ్గే వరకు రోజూ ఒక గ్లాసు పసుపు పాలు తాగండి

ఈ వెచ్చని పసుపు పాలు.. ఎండిపోయిన గొంతును హైడ్రేట్ చేయడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు ఛాతీ వద్ద ఇబ్బంది తగ్గిస్తుంది. కఫం తొలగించడంలో సహాయపడుతుంది. బ్యాక్టీరియాను నయం చేయడానికి మరియు పోరాడటానికి పసుపు యొక్క అద్భుతమైన సామర్థ్యం నిరంతరం వచ్చే దగ్గును తగ్గించడంలో కీలకంగా ఉంటుంది.

థైమ్

ఐరోపాలో థైమ్ ఔషధంగా ఉపయోగించబడింది. ఇది గొంతు కండరాలను శాంతపరచడంలో సహాయపడే యాంటిస్పాస్మోడిక్ పదార్థాన్ని కలిగి ఉంటుంది. థైమ్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మరియు పొడి దగ్గు మరియు గొంతు నొప్పికి సమర్థవంతమైన ఇంటి చికిత్సలా పనిచేస్తుంది.

థైమ్ టీని రోజుకు రెండుసార్లు తాగండి. దీనిలో నిమ్మరసం, తేనె కలిపి కూడా తాగవచ్చు.

మార్ష్ మల్లౌ రూట్

మార్ష్ మల్లౌ రూట్ అనేది ఒక పాత కాలపు మూలిక. ఇది పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. గొంతును శాంతపరచడంలో మరియు పొడి దగ్గు నుంచి చికాకును తగ్గించడంలో కొన్ని పరిశోధనలు దీని సామర్థ్యాన్ని సమర్థిస్తాయి.

అరోమాథెరపీ

వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిఫ్టస్ నూనెను వేసి.. ఫలితంగా వచ్చే ఆవిరిని పీల్చడం ద్వారా పొడి దగ్గుకు చికిత్స తీసుకుని ప్రయోజనం పొందవచ్చు.

యూకలిఫ్టస్ ఆయిల్ పొడి దగ్గుకు అద్భుతమైన సహజ నివారణ. ఎందుకంటే శ్వాసకోశ రుగ్మతలకు చికిత్స చేయడంలో ఇది ప్రభావవంతంగా పనిచేసినట్లు పలు పరిశోధనలు నిరూపించాయి.

హ్యుమిడిఫైయర్

పొడి ప్రదేశంలో లేదా చలికాలంలో నివసించే వ్యక్తులకు, సైనస్‌లను స్పష్టంగా ఉంచడానికి హ్యుమిడిఫైయర్ చాలా మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఆవిరి లేదా నీటి ఆవిరిని వెదజల్లడం ద్వారా హ్యుమిడిఫైయర్లు గాలికి తేమను అందిస్తాయి. ఒక వ్యక్తి ఎక్కువ సమయం గడిపే గదిలో హ్యుమిడిఫైయర్ ఉంచడం మంచిది. ఎందుకంటే అది గదికి కావాల్సిన తేమను అందిస్తుంది.

హ్యుమిడిఫైయర్‌ను ఉపయోగించినప్పుడు బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా క్రమం తప్పకుండా నీటిని మార్చుతూ ఉండాలి. దాన్ని కూడా నిత్యం శుభ్రంగా ఉంచాలి.

పుదీనా

పుదీనా సువాసనలో ఉండే మెంథాల్ కారణంగా శ్లేష్మం సులభంగా విడుదలవడంలో సహాయపడే ప్రత్యేకమైన లక్షణాన్ని ఈ ఆకులు కలిగి ఉంటాయి. ఫలితంగా నాసికా మార్గాలు తెరవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. గొంతు నొప్పి లేదా పొడి దగ్గు నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

పుదీనా ఆధారిత ఇన్‌హేలర్‌ను పీల్చడం వల్ల నాసికా బాగాలను స్పష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది.  మరియు గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. ఆకులను ఉడకబెట్టి.. ఆవిరి పీల్చడం వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

పిప్పర్‌మెంట్ ఆకుల యొక్క చికిత్సా లక్షణాలు చాలా గుర్తించబడ్డాయి. పుదీనా, సహజమైన డీకాంగెస్టెంట్ మెంతోల్‌ను కలిగి ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది మరియు అధిక శ్లేష్మం ఉత్పత్తిని తగ్గిస్తుంది.

పిప్పర్‌మెంట్ టీ, వేడి పానీయంగా తీసుకున్నప్పుడు మీరు మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

మసాలా చాయ్/టీ

దేశంలో మసాలా చాయ్ గొంతు నొప్పి మరియు పొడి దగ్గు వంటి పరిస్థితులకు చికిత్సలో ఉపయోగిస్తారు.

మసాలా చాయ్ అనేది లవంగాలు మరియు యాలకులతో సహా అనేక యాంటీఆక్సిడెంట్ పదార్థాలను కలిగి ఉన్న పానీయం. ఈ పదార్థాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మరియు గొంతునొప్పి తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

మసాలా చాయ్‌లో దాల్చిన చెక్క వంటి మసాలాలు కూడా ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

మసాలా చాయ్ తయారుచేయు విధానం

లవంగాలు-2

యాలకులు-2

తురుమిన అల్లం- 2 టేబుల్ స్పూన్లు

దాల్చిన చెక్క- ఒకటి

నీరు- అర కప్పు

పాలు- 2 కప్పులు

టీ పొడి- 2 స్పూన్లు

చక్కెర/తేనె- రుచికి తగినంత

తయారుచేసే విధానం

సుగంధ ద్రవ్యాలను కలిపి 5 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి

మసాలా వాసన మీ వంటగదిలో వచ్చే వరకు మరిగించండి. నీరు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది.

ఇప్పుడు మసాలా నీటిలో వేడి చేసిన పాలు పోయండి.

దీన్ని 3-4 నిమిషాల పాటు మరిగించి, వేడిగా తాగండి

డాక్టర్ను ఎప్పుడు కలవాలి?

నిరంతర దగ్గుతో పాటు ఈ కింది వాటిలో ఏమైనా లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి

దగ్గినప్పుడు రక్తం పడటం

ఆకలి తగ్గడం

నిరంతరం అధిక జ్వరం

శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది

శరీరం బలహీనతగా ఉండటం, అలసట అనిపించడం

ఛాతిలో నొప్పి

రాత్రిళ్లు చెమటలు పట్టడం

సాధారణంగా పైన ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కలయికలో సంభవించడం వల్ల మరింత సమస్య ఏర్పడుతుంది. అందుకే ఇంటి చిట్కాలు సహాయపడకపోతే.. వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

దగ్గును ఎలా నివారించాలి?

రోగి కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా క్రమేణా దగ్గును నివారించడానికి ప్రయత్నంచవచ్చు.

జీర్ణవ్యవస్థను మంచి స్థితిలో ఉంచండి. మంచి లక్షణాలు కలిగి ఉండే ప్రోబయోటిక్‌లతో కూడిన పెరుగు రోగనిరోధక వ్యవస్థను పెంచడం ద్వారా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.

ఆల్కహాల్, అధిక కొవ్వు, మసాలా ఆహారం, ఆలస్యంగా తినడం వంటి వాటిటో యాసిడ్ రిఫ్లక్స్ ద్వారా దగ్గు వంటివి తీవ్రతరం అవుతాయి.

తరచుగా చేతులు కడుక్కోవాలి. బ్యాక్టీరియాను నిర్మూలించడం వల్ల తరచుగా దగ్గు మరియు జలుబులకు కారణమయ్యే సాధారణ వైరస్‌లు మరియు బ్యాక్టీరియాల నుంచి అనారోగ్యానికి గురయ్యే అవకాశం తగ్గుతుంది.

చివరగా

సహజమైన పొడి దగ్గుకు ఇంటి చిట్కాలు అందించడం యొక్క ఉద్దేశ్యం.. చిన్న అనారోగ్యాలు, అలర్జీలు, ఉబ్బసం, రిఫ్లక్స్ నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడమే. మితమైన మరియు తీవ్రమైన దగ్గు లేదా నిరంతరం దగ్గులకు చికిత్స అవసరం. నిరంతర పొడి దగ్గుకు ఒక వైద్యుడు సరైన కారణాన్ని గుర్తించగలడు. మరియు చికిత్స అందించగలడు.


DISCLAIMER: THIS BLOG/WEBSITE DOES NOT PROVIDE MEDICAL ADVICE

The Information including but not limited to text, graphics, images and other material contained on this blog are intended for education and awareness only. No material on this blog is intended to be a substitute for professional medical help including diagnosis or treatment. It is always advisable to consult medical professional before relying on the content. Neither the Author nor Star Health and Allied Insurance Co. Ltd accepts any responsibility for any potential risk to any visitor/reader.

Scroll to Top