New
AROGYA SEVA KENDRA - Free Health Consultation -Click Here to Know More|BIMA BHAROSA - An Integrated Grievance Management System to facilitate the policyholders and complainants to file their grievances with IRDAI -Click here to know more|Click here to link your KYC|Policies where the risk commencement date is on or after 1st October 2024, all the policy servicing shall be as per the IRDAI (Insurance Products) Regulations, 2024 dated 20th March 2024 and Master Circular on Health Insurance Business dated 29th May 2024
DND Registration

ఆరోగ్య బీమా పథకాలు

ఆరోగ్యం ఒక గొప్ప వరం. దానిని చెక్కుచెదరకుండా ఉంచడానికి, మా సౌకర్యవంతమైన ఆరోగ్య బీమా పాలసీలతో మీ ఆరోగ్యం సురక్షితంగా ఉండేలా మేము నిర్ధారిస్తాము

India +91✓

  • 11149 కోట్లు+

    2024-25 ఆర్థిక సంవత్సరంలో చెల్లించినవి (రూ.)

  • 4.39/5

    రేటింగ్ కల ఇన్సూరెన్స్ కంపెనీ

  • 24.47లక్ష+

    2025 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన క్లెయిమ్‌లు

మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి ఉత్తమ ఇన్సూరెన్స్ ప్లాన్లు

Star Special Care

స్టార్ స్పెషల్ కేర్

స్పెషల్ కవర్: ఆటిజం స్పెక్ట్రం రుగ్మతతో రోగనిర్ధారణ చేయబడిన వారి కొరకు డిజైన్ చేయబడిన ఒక విశిష్ట పాలసీ
మెడికల్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ-ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ వసరం లేదు
ఆధునిక చికిత్స: నిర్దిష్ట పరిమితుల వరకు ఆధునిక చికిత్సకయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి

Young Star Extra Protect–Add on Cover

యంగ్ స్టార్ ఎక్స్ ట్రా ప్రొటెక్ట్- యాడ్ ఆన్ కవర్

అధికతరం చేయబడిన కవర్: మీ బేస్ పాలసీ యొక్క  కవరేజీ లిమిట్స్‌ను సరసమైన ప్రీమియంతో అధికతరం చేసుకోండి
నాన్-మెడికల్ ఐటెమ్స్ కవర్: మీ పాలసీ క్రింద ఏదైనా చేయదగిన క్లెయిమ్ ఉంటే వైద్యేతర అంశాలకు కవరేజీ పొందండి
ఆయుష్ చికిత్స: బేస్ పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ వరకు ఆయుష్ చికిత్సలకు కవర్ పొందండి

Just Launched
Super Star

సూపర్ స్టార్

No Limits, Just Benefits: Unlimited Restoration, Unlimited Renewal Bonus, Unlimited Sum Insured. Your protection never stops.

Freeze Your Age: Lock in your age and keep your premiums young until you make a claim.

Trusted Hospitals, Any Room: Choose from top-tier hospitals nationwide; you can pick any room at no extra cost.

Special Care Gold

స్పెషల్ కేర్ గోల్డ్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

యూనిక్ పాలసీ: వైకల్యం లేదా/ మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ కలిగి ఉన్న వ్యక్తులకు కవర్ అందించడం కోసం డిజైన్ చేయబడింది
ఆయుష్ కవర్: ఆయుష్ చికిత్సలకయ్యే హాస్పిటల్ ఖర్చులను సమ్ ఇన్సూర్డ్‌లో 50% వరకు కవర్ చేస్తుంది 
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
 

Star Extra Protect - Add on Cover

స్టార్ ఎక్స్‌ట్రా ప్రొటెక్ట్ - యాడ్ ఆన్ కవర్

యాడ్ ఆన్ కవర్: మీ బేస్ పాలసీ పరిమితులను సరసమైన ప్రీమియంతో విస్తృతం చేయండి
ఆధునిక చికిత్స: బేస్ పాలసీ క్రింద ఏదైనా చేయదగిన క్లెయిమ్ ఉంటే బేస్ పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ వరకు ఖర్చులు కవర్ చేయబడతాయి 
క్లెయిమ్ గార్డ్: బేస్ పాలసీ క్రింద ఏదైనా చేయదగిన క్లెయిమ్ ఉంటే మీ వైద్యేతర క్లెయిములకు కవర్ పొందండి
 

 Star Women Care Insurance Policy

స్టార్ వుమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ

యూనిక్ కవర్: స్త్రీలకు బహుళ ప్రయోజనాలు అందించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన పాలసీ
ఆటోమేటిక్ పునరుద్ధరణ: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 100% సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది.
డెలివరీ ఖర్చులు: సాధారణ మరియు సి సెక్షన్ డెలివరీ ఖర్చులు కవర్ చేయబడతాయి (ప్రీ మరియు పోస్ట్ నాటల్ ఖర్చులతో సహా)
 

Star Comprehensive Insurance Policy

స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ

ఆటోమేటిక్ పునరుద్ధరణ: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 100% సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది
బయ్-బ్యాక్ పిఇడి: ఇదివరకే ఉన్న వ్యాధుల విషయంలో వెయిటింగ్ పిరియడ్‌ను తగ్గించడానికి ఐచ్ఛిక కవర్
మిడ్-టర్మ్ ఇంక్లూజన్: అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొత్తగా వివాహమైన భాగస్వామిని మరియు నవజాత శిశువులను పాలసీలో చేర్చవచ్చు
 

Senior Citizens Red Carpet Health Insurance Policy

సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

వృద్ధులకు కవర్: 60-75 సంవత్సరాలు కల వారికి జీవిత కాల రెన్యూవల్స్‌తో  రూపొందించబడింది
ఔట్‌పేషంట్ కవర్: నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఔట్ పేషంట్‌గా మెడికల్ కవర్ పొందండి
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
 

Trending
Family Health Optima Insurance Plan

ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్

ఆటోమేటిక్ పునరుద్ధరణ: ఒక పాలసీ సంవత్సరంలో 100% సమ్ ఇన్సూర్డ్ మూడు సార్లు పునరుద్ధరించబడుతుంది.
రోడ్ ప్రమాదానికి అదనపు సమ్ ఇన్సూర్డ్: కవరేజీ పరిమితి అయిపోయినప్పుడు ఒకవేళ రోడ్ ప్రమాదం జరిగితే సమ్ ఇన్సూర్డ్ పెంచబడుతుంది
రీఛార్జ్ ప్రయోజనం: ఒక పాలసీ సంవత్సరంలో కవరేజీ పరిమితి అయిపోయినప్పుడు ఒక్కసారికి అదనపు ఇండెమ్నిటీ పొందవచ్చు
 

Star Health Premier Insurance Policy

స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్సూరెన్స్ పాలసీ

స్పెషల్ పాలసీ: 50 సంవత్సరాలు లేదా అంతకనా ఎక్కువ వయసు కల వారికి ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేకుండా డిజైన్ చేయబడింది
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
హెల్త్-చెకప్ డిస్కౌంట్: పాలసీ ప్రారంభంలో జాబితా చేయబడిన హెల్త్-చెక్ప్ రిపోర్ట్‌లు సమర్పిస్తే అందులో బయటపడే అంశాల ఆధారంగా 10% ప్రీమియం డిస్కౌంట్ లభిస్తుంది
 

Super Surplus Insurance Policy

సూపర్ సర్‌ప్లస్ ఇన్సురెన్స్ పాలసీ

టాప్-అప్ ప్లాన్: సరసమైన ప్రీమియం‌తో ఎన్‌హాన్స్‌‌డ్ హెల్త్ కవరేజీని పొందండి
రీఛార్జ్ ప్రయోజనం: సమ్ ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు అదనపు ఖర్చు లేకుండా అదనపు ఇండెమ్నిటీ పొందవచ్చు
లాంగ్-టర్మ్ డిస్కౌంట్: పాలసీని 2 సంవత్సరాలకు ఎంచుకుంటే 5% ప్రీమియం డిస్కౌంట్ లభిస్తుంది
 

Medi Classic Insurance Policy

మెడి క్లాసిక్ ఇన్సూరెన్స్ పాలసీ (వ్యక్తిగతం)

పునరుద్ధరణ ప్రయోజనం: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 200% బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది
రోడ్ ప్రమాదం: కవరేజీ పరిమితి అయిపోయినప్పుడు ఒకవేళ రోడ్ ప్రమాదం జరిగితే సమ్ ఇన్సూర్డ్ పెంచబడుతుంది
లాంగ్-టర్మ్ డిస్కౌంట్: పాలసీని 2 లేదా 3 సంవత్సరాలకు ఎంచుకుంటే ప్రీమియంపై అదనపు డిస్కౌంట్ లభిస్తుంది
 

Star Health Gain Insurance Policy

స్టార్ హెల్త్ గెయిన్ ఇన్సూరెన్స్ పాలసీ

పునరుద్ధరణ ప్రయోజనం: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 200% బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది
రోడ్ ప్రమాదం: కవరేజీ పరిమితి అయిపోయినప్పుడు ఒకవేళ రోడ్ ప్రమాదం జరిగితే సమ్ ఇన్సూర్డ్ పెంచబడుతుంది
లాంగ్-టర్మ్ డిస్కౌంట్: పాలసీని 2 లేదా 3 సంవత్సరాలకు ఎంచుకుంటే ప్రీమియంపై అదనపు డిస్కౌంట్ లభిస్తుంది
 

Star Micro Rural and Farmers Care

స్టార్ మైక్రో రూరల్ అండ్ ఫార్మర్స్ కేర్

గ్రామీణ కవర్: గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
తక్కువ వెయిటింగ్ పిరియడ్: కేవలం 6 నెలల తర్వాత నుండే పిఇడి మరియు నిర్దిష్ట వ్యాధులు కవర్ చేయబడతాయి
 

Star Hospital Cash Insurance Policy

స్టార్ హెల్త్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ

హాస్పిటలైజేషన్ సందర్భంలో ఏకమొత్త ప్రయోజనం: హాస్పిటలైజేషన్ సందర్భంలో అయ్యే ఖర్చులకు రోజువారీ క్యాష్ ప్రయోజనం అందించేందుకు డిజైన్ చేయబడింది
ఐసియు హాస్పిటల్ క్యాష్: ఐసియు హాస్పిటలైజేషన్ సందర్భంలో 200% క్యాష్ మొత్తాన్ని (రోజుకు) పొందండి
యాక్సిడెంట్ హాస్పిటల్ క్యాష్: ప్రమాదానికి లోనై  హాస్పిటలైజేషన్ సందర్భంలో ప్రతి 24 గంటలకు 150% వరకు హాస్పిటల్ క్యాష్ పొందండి

స్టార్ అవుట్ పేషెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ

స్టార్ అవుట్ పేషెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ

ఔట్ పేషంట్ కవర్: నెట్‌వర్క్ హాస్పిటల్స్ వద్ద ఔట్ పేషంట్ కన్సల్టేషన్ ఖర్చులు కవర్ చేయబడతాయి
డయాగ్నోస్టిక్ మరియు ఫార్మసీ: నెట్‌వర్క్ హాస్పిటల్స్ వద్ద ఖర్చులు కవర్ చేయబడతాయి
డెంటల్ మరియు ఆప్తాల్మిక్: నెట్‌వర్క్ హాస్పిటల్స్ వద్ద ఖర్చులు కవర్ చేయబడతాయి
 

Young Star Insurance Policy

యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ

ఆటోమేటిక్ పునరుద్ధరణ: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 100% సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది
మిడ్-టర్మ్ ఇంక్లూజన్: అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొత్తగా వివాహమైన భాగస్వామిని మరియు నవజాత శిశువులను పాలసీలో చేర్చవచ్చు
లాయల్టీ డిస్కౌంట్: పాలసీని 36 సంవత్సరాలకు ముందు ఎంచుకొని 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా రెన్యూ చేస్తూ ఉంటే 10% డిస్కౌంట్ లభిస్తుంది
 

Arogya Sanjeevani Policy

ఆరోగ్య సంజీవని పాలసీ, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్

గ్రామీణ కవర్: గ్రామీణ ప్రజలకు 20% డిస్కౌంట్
ఆధునిక చికిత్సలు: ఆధునిక చికిత్సలకు సమ్ ఇన్సూర్డ్‌లో 50% వరకు కవర్ పొందండి
ఆయుష్ కవర్: ఆయుష్ చికిత్సలకయ్యే హాస్పిటల్ ఖర్చులను కవర్ చేస్తుంది

Star Health Assure Insurance Policy

స్టార్ హెల్త్ ఎష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ

కుటుంబ పరిమాణం: సదరు వ్యక్తి, భాగస్వామి, తల్లిదండ్రులు, మరియు అత్తమామలను కలుపుకొని మొత్తం 6గురు పెద్దలు మరియు 3 పిల్లలకు కవరేజీ అందిస్తుంది
ఆటోమేటిక్ పునరుద్ధరణ: సమ్ ఇన్సూర్డ్ ఒక్క సారికి 100% చొప్పున అపరిమిత పర్యాయాలు పునరుద్ధరించబడుతుంది
లాంగ్-టర్మ్ డిస్కౌంట్: పాలసీని 2 లేదా 3 సంవత్సరాలకు ఎంచుకుంటే ప్రీమియంపై డిస్కౌంట్ లభిస్తుంది
 

Diabetes Safe Insurance Policy

డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ

మధుమేహ కవర్: టైప్1 మరియు టైప్2 అనే రెండు రకాల మధుమేహం కలిగి ఉన్న వారిని కవర్ చేయడానికి డిజైన్ చేయబడింది
కుటుంబ కవర్: ఈ పాలసీని భార్యాభర్తలలో(సదరు వ్యక్తి మరియు తన భాగస్వామి) ఎవరైనా ఒకరు మధుమేహాన్ని కలిగి ఉంటే  ఫ్లోటర్ ప్రాతిపదికన కూడా ఉపయోగించుకోవచ్చు 
ఆటోమేటిక్ పునరుద్ధరణ: ఇండివిడ్యువల్ ప్లాన్‌లో పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 100% సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణను పొందండి
 

Star Cardiac Care Insurance Policy

స్టార్ కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ

కార్డియాక్ కవర్: 10 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగి గుండె సంబంధిత వ్యాధులు కలిగి ఉన్న వ్యక్తిని కవర్ చేస్తుంది
నాన్-కార్డియాక్ కవర్: గుండె సంబంధితం కాని వ్యాధులను, ప్రమాదాలను కూడా కవర్ చేస్తుంది 
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు

Star Cardiac Care Insurance Policy-Platinum

స్టార్ కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ- ప్లాటినం

ఎక్స్‌క్లూజివ్ కవర్: హృద్రోగాలతో నిర్ధారించబడిన వారికొరకు ప్రత్యేకంగా డిజైన చేయబడిన పాలసీ
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
కార్డియాక్ పరికరాలు: కార్డియాక్ పరికరాల కొరకు సమ్ ఇన్సూర్డ్‌లో 50% వరకు పొందండి
 

Star Cancer Care Platinum Insurance Policy

స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్ పాలసీ

ఎక్స్‌క్లూజివ్ కవర్: కాన్సర్‌తో నిర్ధారించబడిన వారికొరకు ప్రత్యేకంగా డిజైన చేయబడిన పాలసీ
వైడ్ కవర్: క్యాన్సర్‌తో పాటు క్యాన్సర్‌కు సంబంధించని సాధారణ హాస్పిటలైజేషన్ సందర్భాలలో అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది
ఏకమొత్తం కవర్: ఆప్షనల్ కవర్‌గా, క్యాన్సర్ పునరావృతమయ్యే సందర్భంలో మెటాస్టాసిస్ మరియు మొదటి క్యాన్సర్‌కు సంబంధించని రెండవ ప్రమాదరహిత క్యాన్సర్‌కు ఏకమొత్తం అందించబడుతుంది
 

Star Critical Illness Multipay Insurance Policy

స్టార్ క్రిటికల్ ఇల్‌నెస్ మల్టీపే ఇన్సూరెన్స్ పాలసీ

యూనిక్ కవర్: ఈ పాలసీ 37 ప్రధాన క్రిటికల్ రుగ్మతలను కవర్ చేస్తుంది
స్టార్ వెల్‌నెస్ ప్రోగ్రాం: ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిగి ఉంటున్నందుకు ప్రీమియం డిస్కౌంట్లను ఉపయోగించుకోండి
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి 50 ఏళ్ళ వరకు ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
 

హెల్త్ ఇన్స్యూరెన్స్

హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అస్థిరత నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించే రక్షణ కవచం. మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వృద్ధులకు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులకు మాత్రమే అనే సాధారణ అపోహకు వ్యతిరేకంగా, దాని ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ ఎంతో ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ మెడికల్ బిల్లులను పట్టించుకోవడం ద్వారా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితుల్లో మనశ్శాంతిని అందిస్తుంది. 

COVID-19 వంటి అనిశ్చిత పరిస్థితులు మనకు మెడికల్ ఇన్సూరెన్స్ ఆవశ్యకత తెలిసొచ్చేలా చేసాయి. మరోవైపు, వైద్య ద్రవ్యోల్బణంలో నిరంతర పెరుగుతుండటంతో, మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నగదు రహిత చికిత్సను అందించడం లేదా మెడికల్ ఖర్చులపై రీయింబర్స్‌మెంట్ అందించడం ద్వారా మీ ఖర్చును ఆదా చేస్తుంది. మా మెడికల్ ఇన్సూరెన్స్ యొక్క సౌలభ్యం ఏమిటంటే విస్తృత కవరేజీని పొందడానికి దీనిని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ప్రాతిపదికన పొందవచ్చు.

భీమా ప్రాముఖ్యత

నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు అవసరం?

పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు నానాటికీ పెరుగుతున్న వ్యాధుల సంఖ్య ఆరోగ్య బీమాను ఆవశ్యకంగా మార్చింది. ప్రస్తుత సమయంలో, మీ ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తున్నప్పుడు, మీ జాబితాకు ఆరోగ్య బీమాను జోడించడాన్ని ఎప్పటికీ విస్మరించ్కండి.

జీవనశైలి మార్పులు

పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు ప్రస్తుత జీవనశైలి మరియు పర్యావరణ కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి. ఇది మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుండి రక్షించగలిగే మెడిక్లెయిమ్ ప్లాన్‌తో సురక్షితంగా ఉండాల్సిన అవసరతను కలిగిస్తుంది.

వైద్య ద్రవ్యోల్బణం

ఆరోగ్య సంరక్షణ ఖర్చు గత కొన్ని సంవత్సరాలలో రెట్టింపు అయింది. మీ వైద్య అవసరాలను ఎదుర్కోడానికి మీ పొదుపులపై మాత్రమే ఆధారపడటం తెలివైన పని కాదు. అత్యుత్తమ ఆరోగ్య బీమాతో, నాణ్యమైన చికిత్సను పొందేందుకు మీరు వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అంబులెన్స్ ఖర్చులు

హాస్పిటలైజేషన్ కవర్ లాగా, ఆరోగ్య అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వ్యక్తి యొక్క రవాణా ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది అంబులెన్స్ ఛార్జీలను కవర్ చేసే మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క ఆవశ్యకతను సూచిస్తుంది.

ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్

ఆరోగ్య పరిస్థితుల విషయానికి వస్తే, ఆసుపత్రి ఖర్చుల గురించి మాత్రమే తరచుగా ఆలోచిస్తారు. అయితే ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తర్వాత అయ్యే ఖర్చుల సంగతేంటి? మెడిక్లెయిమ్ ప్లాన్ అటువంటి ఖర్చులను కవర్ చేస్తుంది, తద్వారా మీకు ఆర్థిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వార్షిక ఆరోగ్య పరీక్షలు

ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం వలన మీరు వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. చేసిన వైద్య ఖర్చులకు కవర్ అందించడంతో పాటు, ఆరోగ్య బీమా పాలసీలు మీ ఆరోగ్యాన్ని ట్రాక్‌లో ఉంచడంలో సహాయపడే వార్షిక ఆరోగ్య పరీక్షలను కూడా సులభతరం చేస్తాయి.

COVID-19 కవర్

COVID-19 వంటి మహమ్మారి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు వైద్య బీమా ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. కాబట్టి, అనిశ్చితి సమయంలో కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే, ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం తప్పనిసరి.

పన్ను ప్రయోజనాలు

మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ముఖ్యమైన పెట్టుబడి, దీని కోసం మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80D ప్రకారం, పన్ను చెల్లింపుదారు మెడిక్లెయిమ్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపులను పొందవచ్చు.

నగదు రహిత చికిత్స

బీమా కంపెనీతో ఒప్పందంలో పనిచేసే నెట్‌వర్క్ ఆఉపత్రుల వద్ద నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నగదు రహిత చికిత్స మీ వైద్య బిల్లుల గురించి చింతించకుండా మీరు కోలుకోవడంపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని సులభతరం చేస్తుంది.

ఆర్థిక సహాయం

మీ ఆర్ధిక ప్రణాళిక చేస్తున్నప్పుడు ఆరోగ్య బీమాను విస్మరించకుండా చూసుకోండి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు బీమా చేయడం వలన మీరు అవసరమైన సమయాల్లో ఆర్థికంగా సహకారం పొందుతారని నిర్ధారించుకోవచ్చు. వైద్య ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది, కాబట్టి ఆకస్మిక వైద్య అత్యవసర పరిస్థితి మీరు చేసుకున్న పొదుపులను హరించివేయవచ్చు.

ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేస్తుంది

చాలా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేస్తాయి. మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి ముందు పాలసీదారు ఇప్పటికే బాధపడుతున్న ఏవైనా వైద్య పరిస్థితులు లేదా అనారోగ్యాలను ముందుగా ఉన్న వ్యాధిగా సూచిస్తారు.

హెల్త్ ఇన్సూరెన్స్ - ఒక త్వరిత సంగ్రహం

హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

ప్రయోజనాలు

సమ్ ఇన్సూర్డ్ (INR) (INR)

2 కోట్ల వరకు

నెట్‌వర్క్ హాస్పిటల్స్

16,000+ భారతదేశమంతటిలో

ఆస్పత్రిలో చేరడానికి ముందు

సాధారణంగా 30-60 రోజులు

ఆస్పత్రిలో చేరి బయటకు వచ్చిన తర్వాత

సాధారణంగా 60-90 రోజులు

ఆంబులెన్స్ ఖర్చులు

కవర్ చేయబడినవి

నగదు రహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్

2 గంటలలోపే 96%

ప్రమాదాల కవరేజీ

రోజు 1 నుండి

పన్ను ప్రయోజనాలు

రూ. 1 లక్ష వరకు

స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము ప్రత్యేకంగా రూపొందించిన ఇన్సూరెన్స్ పాలసీలను అందించడం నుండి ఫాస్ట్ ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తృతమైన సేవలు అందిస్తున్నాం. పెరుగుతున్న మా హాస్పిటల్స్ నెట్‌వర్క్‌తో మీ వైద్య అవసరాలను తీర్చడానికి సులభ యాక్సెస్ మీకు లభించేలా హామీ ఇస్తున్నాం.

వెల్నెస్ ప్రోగ్రామ్

మా వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డ్‌లను పొందండి. రిన్యూవల్ తగ్గింపులను పొందడానికి ఆ రివార్డ్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.

డయాగ్నస్టిక్ సెంటర్లు

ల్యాబ్ శాంపిల్స్‌ను ఇంటి వద్దే పికప్ చేసుకోవడం మరియు ఇంటి వద్దే ఆరోగ్య పరీక్షలు పొందటంతో భారతదేశం అంతటా 1,635 డయాగ్నస్టిక్ సెంటర్‌లకు యాక్సెస్ పొందండి.

ఇ-ఫార్మసీ

రాయితీ ధరతో ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయండి. 2780 నగరాల్లో హోమ్ డెలివరీ మరియు స్టోర్ పికప్‌లు అందుబాటులో ఉన్నాయి.

తరగతులు

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలోని రకాలు

ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు నగదు రహిత చికిత్స సౌకర్యాలు మరియు రీయింబర్స్‌మెంట్‌ల పరంగా వాస్తవమైన వైద్య ఖర్చులను భర్తీ చేస్తాయి. ఇటువంటి రకాల మెడిక్లెయిమ్ ప్లాన్‌లు ఇండివిడ్యువల్ మరియు ఫ్లోటర్ ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి. వారు ఎంచుకున్న సమ్ ఇన్సూర్డ్ వరకు కవరేజీని అందిస్తారు.

ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు క్యాన్సర్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్ మొదలైన క్లిష్ట వ్యాధులకు ఒకేసారి కవర్‌ని అందజేస్తాయి. ప్రాణాంతకమైన జబ్బు సమయంలో ఎవరైనా ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పాలసీ బీమా చేసిన వ్యక్తికి ఒకేసారి చెల్లిస్తుంది.

టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మీ ప్రస్తుత పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ అయిపోయిన తర్వాత కూడా అదనపు కవర్‌ను అందిస్తాయి. కొన్నిసార్లు ఎంచుకున్న కవర్ మీ వైద్య అవసరాలను తీర్చడానికి సరిపోకపోవచ్చు. అటువంటి సమయాల్లో, టాప్-అప్ పాలసీ అదనపు కవరేజీని అందించడం ద్వారా ఆర్థిక రక్షణను బలోపేతం చేస్తుంది.

క్లెయిములు

మా క్లెయిమ్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది?

వీడియో చూడండి
  1. క్లెయిమ్ సూచన

  2. క్లెయిమ్ స్థితి

  3. హాస్పిటలైజేషన్

  4. క్లెయిమ్ సెటిల్‌మెంట్

ఏమి కవర్ చేయబడుతున్నాయో తెలుసుకోండి

సరియైన మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం ఎలా?

మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేయడం అనేది మీరు చేసే అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటి. అయితే మీ అవసరాలకు బాగా సరిపోయే ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి? ఇందులో ఉండేవి మరియు ఉండనివి గురించి తెలుసుకోవడం ఉత్తమ వైద్య మెడికల్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది. ప్రక్రియలో మీకు మార్గనిర్దేశం చేసే కొన్ని విధానాలు ఇక్కడ ఉన్నాయి.

హాస్పిటలైజేషన్ ఖర్చులు

చాలా మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనారోగ్యం, గాయం లేదా ప్రమాదాల కారణంగా అయ్యే గది అద్దెలు, ICU ఛార్జీలు, శస్త్రచికిత్స ఖర్చులు, డాక్టర్ సంప్రదింపులు మొదలైన ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తాయి.

ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్

పెరుగుతున్న వైద్య ఖర్చుల ప్రభావాన్ని అర్థం చేసుకుంటే, చాలా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌కు సంబంధించిన ప్రీ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తాయి.

డే-కేర్ చికిత్స

సాంకేతిక పురోగతి ఒకప్పుడు చాలా సమయం ఖర్చయ్యే శస్త్రచికిత్సలు మరియు చికిత్సల సమయాన్ని తగ్గించింది. అందువల్ల, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు డే కేర్ చికిత్సలు మరియు విధానాలను కవర్ చేస్తాయి.

ఇంటివద్దే మంచం పాలవ్వడం

కొన్ని మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు మెడికల్ ప్రాక్టీషనర్ సలహా మేరకు ఇంట్లో తీసుకునే డొమిసిలియరీ ట్రీట్‌మెంట్లను కూడా కవర్ చేస్తాయి.

అవయవ దాత ఖర్చులు

చాలా మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అవయవ దాత ఖర్చులను కవర్ చేస్తాయి. బీమా చేయబడిన వ్యక్తి అవయవ స్వీకర్త అయితే అవయవ సేకరణ మరియు మార్పిడి ఖర్చులు కవర్ చేయబడతాయి.

రోడ్ ట్రాఫిక్ ప్రమాదం

ప్రమాదాలను ఊహించలేము. చాలా మెడిక్లెయిమ్ ప్లాన్‌లు రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా జరిగే ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌లను కవర్ చేస్తాయి.

ఆయుష్ కవర్

అల్లోపతి చికిత్సలతో పాటు, చాలా మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఆయుర్వేదం, యోగా & నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ ఔషధాలను కూడా కవర్ చేస్తాయి.

హెల్త్ చెకప్

హాస్పిటలైజేషన్ మరియు ఇతర ప్రయోజనాలతో పాటు, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు హెల్త్ చెకప్ కోసం అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తాయి.

స్వయంచాలక పునరుద్ధరణ

మీ వైద్య ఖర్చులు మీ సమ్ ఇన్సూర్డ్‌కు మించి ఉంటే ఏమి చేయాలి? అటువంటి సమయాల్లో, పునరుద్ధరణ ప్రయోజనం మీ సమ్ ఇన్సూర్డ్‌ను 100% పూర్తిగా లేదా పాక్షికంగా అయిపోయిన తర్వాత స్వయంచాలకంగా పునరుద్ధరిస్తుంది.

పన్ను మినహాయింపు

పన్ను ప్రయోజనాలను పొందండి

ఆరోగ్య బీమా పాలసీ మీ వైద్య ఖర్చులను కవర్ చేయడమే కాకుండా పన్నులపై మీకు డబ్బును కూడా ఆదా చేస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన పెట్టుబడి అయినందున, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80D మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కి చెల్లించిన ప్రీమియంకు పన్ను మినహాయింపును అనుమతిస్తుంది. ఇక్కడ కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

Tax deduction illustration

ప్రీమియం చెల్లించడానికి పన్ను మినహాయింపు

మీకు లేదా మీ కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు రూ. 25,000/- వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. మీరు మీ తల్లిదండ్రులకు కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, మీరు గరిష్టంగా రూ. 1 లక్ష వరకు అధిక పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.

హెల్త్ చెకప్ కోసం పన్ను మినహాయింపు

ప్రీమియంలతో పాటు, మీరు ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌ల కోసం చేసే ఖర్చులకు కూడా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80డి కింద, మీరు రూ. 5,000/- వరకు ఆదాయపు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు.

ఆన్‌లైన్ ప్రయోజనాలు

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?

ఆన్‌లైన్‌లో మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మీకు ప్రయోజనాలతో లభిస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి.

పోల్చడానికి సులభం

ప్రజలకు వేర్వేరు అవసరాలు ఉంటాయి. మీర్ పలు రకాల మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో పోల్చిచూసుకొని మీ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకునే ప్లాన్లు, మీరు చేర్చే సభ్యుల సంఖ్యపై ఆధారపడి మారుతూ ఉండే ప్రీమియంలపై కూడా మీర్ అవగాహన పొందవచ్చు.

ధర-ప్రభావకమైనవి

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం అనేది మీ డబ్బును ఆదా చేస్తుంది. పాలసీని మొదటి సారిగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ఎక్కువ శాతం కంపెనీలు ప్రీమియంలపై డిస్కౌంటును అందిస్తాయి. దీనికి అదనంగా, మీరు కొన్ని క్లిక్‌లలోనే అత్యుత్తా మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేయగలగడంతో ఇలా చేయడం మీ సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.

తక్షణ కొటేషన్

మెడికల్ పాలసీకి మీరు ఆన్‌లైన్‌లో కొటేషన్ పొందవచ్చు. మీరు చేయవలసిందల్లా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం, వయసు, ఆరోగ్య స్థితి, వంటి వివరాలను ఎంటర్ చేయడం. ఇది మీ వయసు మరియు ఆరోగ్య కారకాల ఆధారంగా మీరు ప్రీమియం, కవరేజీ, మరియు మినహాయింపులను పోల్చి చూసుకోవడానికి అనుమతిస్తుంది.

మీ సౌకర్యంతో

ఇప్పుడు మీరు మీ ఇంటి నుండే అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కారణంగా మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ గురించి, కంపెనీ గురించి విచారణ చేయడానికి వ్యక్తిగత సందర్శనలు అవసరం లేదు. 

విస్తృతమైన ఎంపికలు

ఎక్కువ శాతం మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయగలిగేలా కస్టమర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుండటంతో మీకు విస్తృతమైన ఎంపికలు లభిస్తున్నాయి. వాటిని సమయం తీసుకొని వివరంగా విశ్లేషణ చేసి మీకు తగిన ప్లాన్‌ను ఎంచుకోండి.

లయబిలిటీ

ఈ ఇన్సూరెన్స్ యొక్క నియమనిబంధనలను అర్ధం చేసుకోవడం కొంచం కష్టమే. ఎక్కువ శాతం మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలను తమ వెబ్‌సైట్‌లలో పొందుపరచాయి. ఇది వారిని నమ్మి పాలసీలను సులభంగా అర్ధం చేసుకోవడానికి దోహదపడుతుంది.

పారదర్శకత

ఆన్‌లైన్ ప్రక్రియలు పారదర్శ్కతను కలిగి ఉంటాయి. కావలసిన సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత, మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనే ప్రక్రియకు ముందుకు సాగుతారు. ఈ ప్రీమియం, మీ ఆవశ్యకతల ఆధారంగా లెక్కించబడుతుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం, మీరు ప్రయోజనాలు, సమ్ ఇన్సూర్డ్, మీ కుటుంబ సభ్యులు, వంటి అంశాలను చేర్చడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తుంది. మీరిచ్చే వివరాల ఆధారంగా మీ ప్రీమియం ఆధారంగా లెక్కించబడుతుంది మరియు ఆయా అంశాలు మారినప్పుడు, ప్రీమియం కూడా మారడాన్ని మీరు చూడవచ్చు.

ముందుగానే సురక్షితం చేసుకోండి

తక్కువ వయసులో ఉండగానే మెడికల్ ఇన్సూరెన్స్‌ను కొనడం వలన ప్రయోజనాలేమిటి

మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి నిర్దిష్ట వయస్సు లేదు. అయితే, చిన్న వయస్సులోనే వైద్య బీమా పథకాన్ని ఎంచుకోవడం వల్ల దాని ప్రయోజనాలు ఉన్నాయి.

తక్కువ ప్రీమియం

తక్కువ ప్రీమియం

మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడంలో వయస్సు ఒక ముఖ్యమైన అంశం. మీరు ఎంత చిన్నవారైతే మీ ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది.

నిరంతర కవర్

నిరంతర కవర్

రిన్యూవల్‌ల ద్వారా మీకు లభించే నిరంతర కవర్ నిర్దిష్ట మరియు ముందుగా ఉన్న వ్యాధుల (PED) వెయిటింగ్ పిరియడ్‌లో మీకు సహాయం చేస్తుంది.

వైద్య పరీక్ష

వైద్య పరీక్ష

మీరు చిన్న వయస్సులో మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీని కొనుగోలు చేస్తే ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేదు.

నో-క్లెయిమ్ బోనస్

నో-క్లెయిమ్ బోనస్

మీరు ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి నో-క్లెయిమ్ బోనస్‌ను పొందవచ్చు. ఇది తదుపరి దశలలో మీకు ప్రయోజనం చేకూర్చే బీమా మొత్తాన్ని మెరుగుపరుస్తుంది.

సహ చెల్లింపు

సహ చెల్లింపు

మీరు చిన్న వయస్సులో మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకున్నప్పుడు సహ-చెల్లింపు వర్తించదు కాబట్టి మీ మెడికల్ బిల్లులను అందించాల్సిన అవసరం లేదు.

రెన్యూవల్

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూ చేసుకోవాలి?

Watch video
  1. దశ 1:

  2. దశ 2:

  3. దశ 3:

  4. దశ 4:

ప్రారంభించండి

ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

మరింత సమాచారం కావాలా?
మరింత సమాచారం కావాలా?
మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?
మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?

భారతదేశంలో ఉత్తమ మెడిక్లెయిమ్ మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీ

 

మెడికల్ ఇన్సూరెన్స్‌ పథకాలు సమగ్ర కవరేజీని అందిస్తాయి

 

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా మెడిక్లెయిమ్ ప్లాన్‌లు అనారోగ్యం, ప్రమాదాలు మరియు డేకేర్ ట్రీట్‌మెంట్‌లు/ప్రక్రియల కారణంగా 24-గంటల ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ పొందిన వారికి కవర్ అందిస్తాయి. పాలసీ నిబంధనలో పేర్కొన్న నిర్దిష్ట రోజుల వరకు అన్ని సంబంధిత ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు చెల్లించబడతాయి.

 

మెడికల్ ఇన్సూరెన్స్‌ పథకాలు మరింత సౌలభ్యాన్ని అందిస్తాయి

 

పాలసీదారు మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేసి, కొన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మరింత సౌకర్యవంతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఉదాహరణకు, సమ్ ఇన్సూర్డ్‌ అయిపోయినప్పుడు, అదనపు ప్రీమియం లేకుండా అదనపు కవరేజ్ అందించబడుతుంది. ఇక్కడే ప్రాథమిక బీమా సొమ్ము యొక్క ఆటోమేటిక్ రిస్టోరేషన్, ప్రాథమిక బీమా సొమ్ము యొక్క సూపర్ రిస్టోరేషన్ మరియు సమ్ ఇన్సూర్డ్‌పై రోడ్డు ట్రాఫిక్ ప్రమాదం (RTA) వంటి ప్రయోజనాలు అమలులోకి వస్తాయి.

గమనిక: ఈ సౌకర్యవంతమైన ప్రయోజనాలు ప్రోడక్ట్/ప్రక్రియకు సంబంధించినవి. మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ నిబంధనను చూడండి.

 

మెడికల్ ఇన్సూరెన్స్‌ పథకాలు అదనపు వ్యాధి-నిర్దిష్ట కవరేజీని అనుమతిస్తాయి

 

స్టార్ హెల్త్‌తో, బీమా చేయబడిన వ్యక్తి సాధారణ మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీగా ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌తో పాటు తీవ్రమైన అనారోగ్యాలు, క్యాన్సర్ మరియు గుండె జబ్బుల కోసం వ్యాధి-నిర్దిష్ట పాలసీలను పొందవచ్చు. స్టార్ కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ-ప్లాటినం, స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినమ్ ఇన్సూరెన్స్ పాలసీ మరియు స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినమ్ ఇన్సూరెన్స్ పాలసీ వంటి అనేక రకాల మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకోవచ్చు.

 

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు హాస్పిటలైజేషన్ యేతర ఖర్చులను కవర్ చేస్తాయి

 

బీమా చేయబడినవారు మా మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో చాలా వరకు కవర్ చేయబడిన నాన్-హాస్పిటలైజేషన్ ఖర్చులను పొందవచ్చు. వాటిలో ఖర్చులు, దంత చికిత్సలు, వార్షిక ఆరోగ్య పరీక్షలు, ఔట్-పేషెంట్ కేర్ ట్రీట్‌మెంట్‌లు, డయాగ్నోస్టిక్‌లు, సంప్రదింపులు మొదలైనవి ఉన్నాయి.

మా ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

 

నిశ్చల జీవనశైలితో ఆరోగ్య సమస్యలు పెరగడమే కాక ఎక్కువ మంది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. ప్రస్తుత మహమ్మారి పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా మెడికల్ ఇన్సూరెన్స్‌ అవసరాన్ని నొక్కి చెప్పింది. మా పాలసీలన్నీ COVID-19కి సంబంధించిన కవరేజీని అందిస్తాయి, ఆరోగ్యవంతమైన వ్యక్తి/కుటుంబం ద్వారా కోవిడ్-19కి సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్ కొనుగోలుపై, COVID-19 ఉన్నట్లు నిర్ధారణ అయి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. పాలసీ క్లాజులలో పేర్కొన్న విధంగా కోవిడ్-19 చికిత్సలు కొంత వెయిటింగ్ పీరియడ్‌తో కవర్ చేయబడతాయి.

మా విభిన్నమైన, అధిక ఫీచర్లు కల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేక ఆరోగ్య సమస్యలకు అందుబాటులో ఉన్నాయి మరియు వైద్యపరమైన ఆకస్మిక పరిస్థితులు మరియు అనిశ్చితి కారణంగా ఆర్థిక సంక్షోభ సమయాల్లో మీకు మనశ్శాంతిని అందిస్తాయి.

మెడికల్ ఇన్సూరెన్స్‌ పథకాలు ప్రాథమికంగా వివిధ రకాలుగా ఉంటాయి మరియు వాటి కవరేజీ ఆధారంగా రెండు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి - ఒక వ్యక్తికి మరియు కుటుంబానికి.

 

వ్యక్తిగత మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లను కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తికి ఎంపిక చేయబడిన బీమా మొత్తాన్ని కవర్ చేస్తుంది, దీనిని బీమా చేయబడిన వ్యక్తి మాత్రమే ఉపయోగించవచ్చు.

 

  • ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్

కుటుంబ మెడికల్ ఇన్సూరెన్స్‌ విషయానికొస్తే, కుటుంబం అనేది సదరు వ్యక్తి, తన జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన పిల్లలు మరియు తల్లిదండ్రులను సూచిస్తుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మొత్తం కుటుంబాన్ని ఒకే ప్రీమియంతో కవర్ చేస్తుంది మరియు సమ్ ఇన్సూర్డ్ బీమా చేయబడిన కుటుంబ సభ్యుల మధ్య ఫ్లోట్ అవుతుంది. భారతదేశం అంతటిలో వ్యాపించి ఉన్న ఆసుపత్రులలో, బీమా చేయబడినవారు మరియు కుటుంబ సభ్యులు నాణ్యమైన హామీ ఉన్న ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్, ఆధునిక చికిత్సలు, రోగనిర్ధారణ, శస్త్రచికిత్సలు మొదలైన వాటితో పాటు అనేక ఇతర ఫీచర్లను పొందవచ్చు.

మా ఉత్తమ-బై హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల జాబితా

50.9 మిలియన్ల జనాభా కలిగిన అత్యంత సాధారణ రుగ్మతలలో మధుమేహం ఒకటి, దీనిచే పభావితమైన దేశాల జాబితాలో భారతదేశం రెండవ స్థానానికి వెళుతుందని ఇటీవలి సర్వేలో డయాబెటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం, నిశ్చల జీవనశైలి, పొగాకు వినియోగం మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధుమేహానికి దారితీసే కారకాలు.

డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ టైప్ 1/టైప్ 2 మధుమేహం నుండి ఉత్పన్నమయ్యే అనారోగ్యం/ప్రమాదాలు మరియు సమస్యల కారణంగా రెగ్యులర్ ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌కు కవరేజీని అందిస్తుంది. ఇది ఇప్పటికే మధుమేహం చరిత్ర కలిగిన వ్యక్తుల కోసం రూపొందించబడిన ప్రత్యేక ప్లాన్. ఈ ప్లాన్ మధుమేహ సమస్యలు మరియు వ్యక్తిగత మరియు కుటుంబ ఫ్లోటర్ ప్రాతిపదికన 24 గంటల హస్పిటలైజేషన్‌తో ముడిపడి ఉన్న అన్ని ఇతర అనారోగ్యాలను కవర్ చేస్తుంది.

లక్షణాలువిధానము
ప్రవేశ వయస్సు (వయోజనులకు)18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు
పాలసీ వ్యవధి1 సంవత్సరం/2 సంవత్సరాలు/3 సంవత్సరాలు
సమ్ ఇన్సూర్డ్ INRలో3/4/5/10 లక్షలు
ప్రోడక్ట్ రకంఇండివిడ్యువల్/ఫ్లోటర్
తగ్గింపులుమా మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా 5% తగ్గింపు పొందండి
వెయిటింగ్ పీరియడ్ నాన్-డయాబెటిక్ సంకలనాలుPED-48 నెలలునిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

 మహమ్మారి సమయంలో, ఉత్తమ కవరేజీ కూడా సరిపోదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక టాప్-అప్ ప్లాన్, ఇది థ్రెషోల్డ్ పరిమితి కంటే ఎక్కువైన వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. 1 కోటి సమ్ ఇన్సూర్డ్‌ వరకు సరసమైన ప్రీమియంలతో విపరీతమైన వైద్య ఖర్చులను కవర్ చేయడానికి ప్లాన్ రూపొందించబడింది. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ వ్యక్తిగతంగా మరియు ఫ్లోటర్ ఆధారంగా మీ కుటుంబాన్ని కూడా కవర్ చేయగలదు.

లక్షణాలువిధానము
ప్రవేశ వయస్సు (వయోజనులకు)18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు
పాలసీ కాలం1 సంవత్సరం/2 సంవత్సరాలు
INRలో సమ్ ఇన్సూర్డ్‌ఇండివిడ్యువల్ - 5 / 7 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 లక్షలు
ఇండివిడ్యువల్ - 5 / 7 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 లక్షలు
ప్రోడక్ట్ రకంఇండివిడ్యువల్ మరియు ఫ్లోటర్
రాయితీలుమా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, మొదటిసారి నేరుగా, 5% తగ్గింపు పొందండి
వెయిటింగ్ పిరియడ్PED-12 నెలలునిర్దిష్ట వ్యాధులు - 12 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

మీ గుండెకు అదనపు భద్రత మరియు సకాలంలో రక్షణ అవసరం. ఇది 7 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న్లు లేదా కార్డియాక్ సర్జికల్ ప్రక్రియకు గురైన వ్యక్తులకు సహాయపడే ప్రత్యేకమైన మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్.

లక్షణాలువిధానము
ప్రవేశ వయస్సు7 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు
INRలో సమ్ ఇన్సూర్డ్‌5 / 7.5 / 10 /15 లక్షలు
సంచిత బోనస్బేసిక్ సమ్ ఇన్సూర్డ్ 100% వరకు
ప్రీ-యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్అవసరం లేదు
స్వయంచాలక పునరుద్ధరణగుండె సంబంధిత వ్యాధులకు 100% ప్రాథమిక సమ్ ఇన్సూర్డ్ వర్తిస్తుంది
ప్రోడక్ట్ రకంఇండివిడ్యువల్
రాయితీలునిర్దిష్ట వైద్య నివేదికలను సమర్పించడం ద్వారా రెన్యూవల్ ప్రీమియంపై 10% తగ్గింపు మరియు సాధారణమైనవి.
వెయిటింగ్ పీరియడ్ - గుండె సంబంధితము కాని వ్యాధులుPED-48 నెలలునిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)
వెయిటింగ్ పీరియడ్ గుండె సంబంధిత జబ్బులు30 రోజులుగుండె మార్పిడి 24 నెలలు 

పేరుకు తగ్గట్టుగానే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది జీవితకాల రెన్యూవబిలిటీ ప్రయోజనంతో వ్యక్తిని లేదా కుటుంబం రెండింటినీ కవర్ చేయగల అన్నీ కలిసిన ప్లాన్.

వ్యక్తిగత మరియు కుటుంబ ఫ్లోటర్ కవరేజీతో, ఈ మెడికల్ బీమా ప్లాన్ వివిధ సమ్ ఇన్సూర్డ్ ఎంపికలను అందిస్తుంది. వారి అవసరాలను బట్టి, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, వ్యక్తులు/కుటుంబాలు కనిష్టంగా 5 లక్షలు మరియు గరిష్టంగా 1 కోటితో నిర్దేశిత సమ్ ఇన్సూర్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు.

లక్షణాలువిధానము
అర్హత (వయోజనులకు)18 - 65 సంవత్సరాలు
ఆధారపడిన పిల్లలు91 రోజులు - 25 సంవత్సరాలు
పాలసీ కాలం1 సంవత్సరం/2 సంవత్సరాలు/3 సంవత్సరాలు
ప్రీమియంను వాయిదాలలో చెల్లించే  సౌకర్యంత్రైమాసిక/అర్ధ సంవత్సరానికి
INRలో సమ్ ఇన్సూర్డ్5 / 7.5 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 లక్షలు
ప్రోడక్ట్ రకంవ్యక్తిగత మరియు ఫ్లోటర్
తగ్గింపులు

2% - 10% - వెల్‌నెస్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద రెన్యూవల్ ప్రీమియంపై

మా మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, 5% తగ్గింపు పొందండి

వెయిటింగ్ పీరియడ్లుPED-36 నెలలుPEDని తిరిగి కొనుగోలు చేసే ఎంపిక. వెయిటింగ్ పీరియడ్‌లను 36 నెలల నుంచి 12 నెలలకు తగ్గించారునిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ 60 మరియు 75 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్‌లకు ఆదర్శవంతమైన మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీ. పాలసీ జీవితకాల రెన్యూవల్ ఎంపికతో వస్తుంది, ఇది డేకేర్ ప్రక్రియలు/చికిత్సలు, ముందుగా ఉన్న వ్యాధులు, ఆధునిక చికిత్సలు మరియు వృద్ధులకు అవసరమైన ముఖ్యమైన వైద్య ప్రక్రియలను కవర్ చేస్తుంది. అన్ని క్లెయిమ్‌లకు 30% నామమాత్రపు సహ-చెల్లింపు ఉంటుంది.

మీ తల్లిదండ్రుల బేషరతు మద్దతు మరియు వారు అందించిన ప్రేమను తిరిగి పొందండి. తల్లిదండ్రులు వారికి సీనియర్ సిటిజన్ రెడ్ కార్పెట్ పాలసీని బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి వృద్ధాప్యంలో సరైన సంరక్షణ మరియు భద్రతను పొందేలా చూసుకోండి మరియు సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు పొందండి.

కర్తవిధానము
ప్రవేశ వయస్సు60 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవితకాలం
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు
INRలో సమ్ ఇన్సూర్డ్‌

ఇండివిడ్యువల్ :- 1 / 2 / 3 / 4 / 5 / 7.5 / 10 / 15 / 20 / 25 లక్షల్లో

ఫ్లోటర్ :- 10 / 15 / 20 / 25 లక్షల్లో

ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్అవసరం లేదు
సహ చెల్లింపుSI కోసం :- 1 / 2 / 3 / 4 / 5 / 7.5 / 10 / 15/ 20/ 25 లక్షలు (అన్ని క్లెయిమ్‌లు – 30%)
తగ్గింపులు

ఆన్‌లైన్ కొనుగోలు & రెన్యూవల్స్‌పై 5%

ప్రపోజర్ కింది పత్రాలను సమర్పించినట్లయితే ప్రీమియంలో 10% అనుమతించబడుతుంది

  1. స్ట్రెస్ థాలియం నివేదిక
  2. BP నివేదిక
  3. చక్కెర (రక్తం & మూత్రం)
  4. బ్లడ్ యూరియా & క్రియేటినిన్
వెయిటింగ్ పిరియడ్PED-12 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)ప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

కుటుంబ అవసరాలను అందించడం ఆర్థికంగా సవాలుగా ఉంటుంది. అందుచేత, ఖర్చులను కనిష్టంగా ఉంచుతూ, మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే సూపర్ సేవర్ పాలసీ మీ ఎంపిక. ఈ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తగిన ధరను కలిగి ఉంది, తద్వారా మీరు ప్రతి కుటుంబ సభ్యుని యొక్క అత్యంత సవాలుగా ఉన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. పాలసీని కొనుగోలు చేయడం ద్వారా, మీరు మీ నవజాత శిశువును పుట్టిన 16వ రోజు ప్రారంభం నుండి ఏవైనా వైద్యపరమైన సమస్యల నుండి ఆసుపత్రిలో చేరే ఛార్జీల ఖర్చుల కవర్ పొందవచ్చు. బీమా చేయబడిన మొత్తంలో 300% ఆటోమేటిక్ రీస్టోరేషన్, మృత దేహాలను స్వదేశానికి పంపడం, కారుణ్య ప్రయాణం, అత్యవసర దేశీయ వైద్య తరలింపు, అవయవ దాతల ఖర్చులు, రీఛార్జ్ ప్రయోజనం, రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల కోసం సమ్ ఇన్సూర్డ్‌, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ చికిత్స మరియు వంటి USPల శ్రేణివంటి మరెన్నో వాటితో ఈ ప్లాన్ వస్తుంది.

లక్షణాలువిధానము
ప్రవేశ వయస్సు (వయోజనులకు)18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు16 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు
పాలసీ కాలం1 సంవత్సరం
INRలో సమ్ ఇన్సూర్డ్3 / 4 / 5 / 10 / 15 / 20 / 25 లక్షలు
ప్రోడక్ట్ రకంఫ్లోటర్
రాయితీలుమా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా మొదటిసారి నేరుగా, 5% తగ్గింపు పొందండి
వెయిటింగ్ పిరియడ్‌PED-48 నెలలునిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ వ్యక్తులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఫీచర్-ప్యాక్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, 16 రోజుల నుండి 65 సంవత్సరాల వరకు ఎవరైనా 65 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ కోసం వయస్సుపై ఎటువంటి పరిమితులు లేకుండా కవర్ చేయవచ్చు.

కర్తవిధానం - గోల్డ్
ప్రవేశ వయస్సు16 రోజుల నుండి 65 సంవత్సరాల వరకు
వ్యక్తి (1A) A= పెద్దలు
రెన్యూవల్జీవితకాలం
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు
INRలో సమ్ ఇన్సూర్డ్‌3 / 4 / 5 / 10 / 15 / 20 / 25 లక్షలు
తగ్గింపులు

మా మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా 5% తగ్గింపు పొందండి

గోల్డ్ వేరియంట్ కింద 25% (బీమా చేసినట్లయితే, ప్రధాన అవయవ దాత యొక్క రుజువును సమర్పించండి.)

5% కుటుంబ తగ్గింపు - కుటుంబ సభ్యుల కోసం అదనపు పాలసీని కొనుగోలు చేస్తే

వెయిటింగ్ పిరియడ్‌PED-48 నెలలునిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

ఆరోగ్య సంజీవని అంటే మనకు మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మనం ఎప్పటికీ క్షేమం కలగాలని కోరుకునే ప్లాన్. IRDAI ద్వారా నిర్దేశించబడిన ఈ ఆరోగ్యకరమైన మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్, జీవితకాల పునరుద్ధరణ ఎంపికతో, 65 సంవత్సరాల వయస్సు వరకు స్వీయ, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు తల్లిదండ్రులతో సహా మెడికల్ ఇన్సూరెన్స్‌లో అధిక ప్రవేశాన్ని అనుమతిస్తుంది.

ప్రాధమ్యాలను కవర్ చేసే సరసమైన మెడికల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మీ కోరికల జాబితాలో ఉన్నట్లయితే, ఆరోగ్య సంజీవని పాలసీ గ్రామీణ ప్రజలకు 20% తగ్గింపును అందించే గొప్ప ఎంపిక. ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్, డేకేర్ ప్రక్రియలు, కోవిడ్-19 చికిత్స, ఆయుష్ చికిత్స మరియు మరిన్నింటి కోసం 10 లక్షల వరకు కవరేజీతో ఆరోగ్యంలో, అనారోగ్యంలో మీ కుటుంబాలతో మీ  బంధాలను కాపాడుకోండి.

కర్తవిధానము
ప్రవేశ వయస్సు18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు - 3 నెలల నుండి 25 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవిత కాలం
పాలసీ కాలం1 సంవత్సరం
INRలో సమ్ ఇన్సూర్డ్‌0.5 లక్షల నుండి 10 లక్షలు (50 వేల గుణిజాలలో)
సహ చెల్లింపుఅన్ని అనుమతించదగిన క్లెయిమ్‌లకు 5%
తగ్గింపులుగ్రామీణ ప్రజలకు 20% తగ్గింపు
వెయిటింగ్ పిరియడ్‌PED-48 నెలలునిర్దిష్ట వ్యాధులు - 24/48 నెలలుగ్రామీణ ప్రజలకు 20% తగ్గింపు

సమస్య పెద్దదిగా మారడం కంటే ప్రారంభంలోనే పరిష్కరించడం మంచిది. సమస్యను పరిష్కరించడానికి వైద్యుడిని సంప్రదించడం, ఔట్ పేషెంట్ సంప్రదింపులు మరియు చికిత్సలు మన ఆరోగ్యం యొక్క సాధారణ నిర్వహణలో అత్యంత కీలకమైనవి. ఔట్ పేషెంట్ చికిత్సలను నివారించడం సాధ్యం కాదు మరియు మంచి అనుభూతి చెందడానికి ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది. రూట్ కెనాల్ కోసం మీ దంతవైద్యుని సంప్రదింపులు లేదా మీరు కంటి క్లినిక్‌ని సందర్శించిన సమయాలలో మీరు ఆదా చేయగల డబ్బును ఊహించుకోండి.

ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కన్సల్టెంట్ ఫీజులు, ఫార్మసీ బిల్లులు, ఎక్స్-రేల చెల్లింపులు, ఇన్వెస్టిగేషన్‌లు మరియు డయాగ్నోస్టిక్స్ ఫిజియోథెరపీ, మీ స్టాండర్డ్ హెల్త్ ప్లాన్‌లో కవర్ చేయబడని అవుట్-ఆఫ్-పాకెట్ ఖర్చులు వంటి అవుట్‌పేషెంట్ చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ ఆరోగ్య పాలసీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది - సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినం. ఇది ప్రత్యేకంగా OP సంప్రదింపులను కవర్ చేసే పరిశ్రమ-నిర్దిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. 2 క్లెయిమ్ రహిత సంవత్సరాల తర్వాత 25% వరకు తగ్గింపు ప్రీమియంల ప్రయోజనాలను పొందండి.

కర్తవిధానము 
ప్రవేశ వయస్సు18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు 
ఆధారపడిన పిల్లలు - 31 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు 
రెన్యూవల్జీవితకాలం
పాలసీ కాలం1 సంవత్సరం
INRలో సమ్ ఇన్సూర్డ్‌25,000 / 50,000 / 75, 000 / 1,00, 000
తగ్గింపులు

రెండు నిరంతర క్లెయిమ్ ఫ్రీ సంవత్సరాల ప్రతి బ్లాక్ తర్వాత ప్రీమియంలో 25% తగ్గింపు.

మా మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా 5% తగ్గింపు పొందండి

వెయిటింగ్ పీరియడ్స్PED- 48/24/12 నెలలు (వెండి/బంగారం/ప్లాటినం)ప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)  

ప్రియమైన వ్యక్తికి చికిత్స విషయానికి వస్తే, చిన్న విషయాలు కూడా ముఖ్యమైనవి. మీరు ఆసుపత్రిలో చేరే సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చును చూసుకోవడానికి ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ రూపొందించబడింది.

మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ రోజువారీ ఆసుపత్రి నగదును అందిస్తుంది. స్టార్ హెల్త్ అందించే అన్ని మెడికల్ ప్లాన్‌లకు ఈ పాలసీ సప్లిమెంట్ లేదా యాడ్-ఆన్ కావచ్చు. మీరు ఎంచుకున్న రోజులకు రోజుకు రూ. 5000 వరకు క్యాష్-ఇన్-హ్యాండ్ ప్రయోజనాలను పొందవచ్చు .

కర్తవిధానము
ప్రవేశ వయస్సు18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు - 91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవితకాలం
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు
ప్లాన్ ఎంపికలుప్రాథమిక మొత్తం (రోజుకు) ఎంపికలు1000/- , 2000/-, 3000/-ఎన్‌హాన్స్‌డ్ మొత్తం (రోజుకు) ఎంపికలు3000/-, 4000/- , 5000/-
రోజుల సంఖ్య30 / 60 /90/ 120/18090 / 120 / 180
తగ్గింపులు
  • 10% - ఇండివిడ్యువల్ కవర్ కింద ఒకే పాలసీ కింద 2 కంటే ఎక్కువ కుటుంబ సభ్యులను కవర్ చేయడానికి
  • మా మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, 5% తగ్గింపు పొందండి
వెయిటింగ్ పిరియడ్‌

ప్రాథమిక ప్లాన్

  • PED - 36 నెలలు
  • నిర్దిష్ట వ్యాధులు - 24 నెలలు
  • ప్రారంభ అనారోగ్యం - 30 రోజులు

మెరుగైన ప్రణాళిక

  • PED – 24 నెలలు
  • నిర్దిష్ట వ్యాధులు - 24 నెలలు
  • ప్రారంభ అనారోగ్యం - 30 రోజులు
  • బీమా చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చేరి ఉన్న సమయంలో ఈ పాలసీ బీమా చేసిన వ్యక్తి యొక్క ప్రస్తుత వైద్య ప్రయోజనాలతో పాటు రోజువారీ ఆసుపత్రి నగదును అందజేస్తుంది.
  • స్టార్ హెల్త్ అందించే అన్ని మెడికల్ ప్లాన్‌లకు పాలసీని జోడించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత యువ జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. భారతదేశపు మిలీనియల్స్ దేశ ఆర్థిక వృద్ధికి విలువైన ఆస్తి. అందుకే, దేశంలోని యువత చైతన్యం మరియు శక్తితో నింపబడాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సహాయంతో మీ జీవితంలోని అత్యంత శక్తివంతమైన సంవత్సరాలను అనుకూలంగా మలచుకోండి. ఈ ఆరోగ్య ప్రణాళిక తమకు మరియు వారి కుటుంబాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలని కోరుకునే ప్రత్యేకంగా 40 ఏళ్లలోపు యువకుల కోసం రూపొందించబడింది.

ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా, మీరు ఇన్సెంటివ్‌లు అందించే వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు, అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్‌లు, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల కవరేజీ, నో-క్లెయిమ్ బోనస్, వార్షిక చెక్-అప్‌లు, మొత్తానికి ఆటోమేటిక్ రీస్టోరేషన్ వంటి అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల కోసం బీమా మరియు అదనపు బేసిక్ సమ్ ఇన్సూర్డ్.

కర్తవిధానము
ప్రవేశ వయస్సు18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు - 3 నెలల నుండి 25 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవితకాలంప్లాన్ ఎంపికలు
  • గోల్డ్
  • సిల్వర్
     
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాల వాయిదా ప్రీమియం - త్రైమాసిక / అర్ధ సంవత్సరం
INRలో సమ్ ఇన్సూర్డ్‌3 / 4 / 5 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 లక్షలు
తగ్గింపులు

2% - 10% - వెల్‌నెస్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద రెన్యూవల్ ప్రీమియంపై

మా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా మొదటిసారి నేరుగా, 5% తగ్గింపు పొందండి

ప్రారంభ ప్రవేశ తగ్గింపు - 36 సంవత్సరాలలోపు కొనుగోలు చేయడం ద్వారా 40 సంవత్సరాల తర్వాత రెన్యూవల్‌పై ప్రీమియంపై 10%

వెయిటింగ్ పీరియడ్స్PED-12 నెలలునిర్దిష్ట వ్యాధులు - 12 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

మంచి ఆరోగ్యం మరియు ఆసుపత్రులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విషయంలో, మీరు ఎక్కడ నివసిస్తున్నారు లేదా ఎంత సంపాదిస్తారు అనేది పట్టింపు లేదు. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ మనకు ఆహారం అందించే చేతులను రక్షించడానికి రూపొందించబడింది.

రూ. 1 లక్ష సమ్ ఇన్సూర్డ్‌తో వ్యక్తిగత మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను అదే విధంగా రూ. 2 లక్షల సమ్ ఇన్సూర్డ్‌తో  ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ పొందండి . గది అద్దె, కన్సల్టెంట్ ఫీజులు, ICU ఛార్జీలు, ఆధునిక చికిత్సలు మరియు అన్ని డేకేర్ ప్రక్రియలపై కవరేజీని పొందండి.

కర్తవిధానము
ప్రవేశ వయస్సు18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు - 12 నెలల నుండి 25 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవిత కాలం
పాలసీ కాలం1 సంవత్సరం
సమ్ ఇన్ష్యూర్డ్ఇండివిడ్యువల్ - 1 లక్ష
ఫ్లోటర్ - 2 లక్షలు
సహ చెల్లింపుప్రవేశం 61 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉంటే, అన్ని అనుమతించదగిన క్లెయిమ్‌లకు 20%
వెయిటింగ్ పిరియడ్‌PED-6 నెలలునిర్దిష్ట వ్యాధులు - 6 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

సమాజాన్ని తీర్చిదిద్దడంలో స్త్రీలు అంతర్భాగాన్ని పోషిస్తారు. తన ప్రతిభను బయటపెడుతూ చేసే కొత్త పనులు, తన కలలను సాధించుకోవడం కోసం దృష్టి పెట్టడం, కొనసాగించాల్సిన లక్ష్యాలు, ఇంటి పని పూర్తి చేయడం మొదలైన రోజువారీ సవాళ్ల మధ్య, ఆమె తరచుగా తనను తాను పట్టించుకోవడం మరచిపోతుంది.

మీ విజయ యాత్రను ప్రారంభించేటప్పుడు మీ ఆరోగ్యం లేదా సంబంధిత ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వకండి. మా స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేకంగా మహిళల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుకూలంగా రూపొందించబడింది. అదనంగా, ఈ పాలసీని స్వయంగా, జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన పిల్లలకు కవర్ అందించే ఫ్లోటర్ ప్రాతిపదికన కూడా ఎంచుకోవచ్చు. ఈ పాలసీ స్టార్ మదర్ కేర్, డెలివరీ ఖర్చులు, అసిస్టెడ్ రీప్రొడక్షన్ చికిత్స, యాంటీ-నాటల్ కేర్ (గర్భధారణ సంరక్షణ), గర్భాశయంలో పిండం శస్త్రచికిత్స/మరమ్మత్తు, ఔట్ పేషెంట్ కన్సల్టేషన్ వంటి ప్రధాన ప్రయోజనాలతో రూపొందించబడింది, ఇవి స్త్రీల అవసరాలకు అనుకూలంగా పని చేస్తాయి.

కర్తవిధానము
ప్రవేశ వయస్సు18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవితకాలం
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు
ప్రోడక్ట్ రకంఇండివిడ్యువల్ మరియు ఫ్లోటర్
INRలో సమ్ ఇన్సూర్డ్‌5 / 10 / 15 / 20 / 25 / 50 / 100 లక్షల్లో
ప్రీ-యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు తమ గర్భధారణ కాలం 12వ మరియు 20వ వారంలో స్టార్ హెల్త్ నిర్దేశిత స్కాన్ సెంటర్లలో తీసిన స్కాన్ నివేదికలను సమర్పించాలి. అటువంటి స్కాన్ ఖర్చు భీమాదారుచే భరించబడుతుంది.
తగ్గింపులుఆన్‌లైన్ కొనుగోలు & రెన్యూవల్స్‌పై 5%
స్టార్ వెల్‌నెస్ ప్రోగ్రామ్ కింద రెన్యూవల్ ప్రీమియంపై 2% - 10%
దీర్ఘకాలిక తగ్గింపు: 2వ సంవత్సరం ప్రీమియంపై 10% తగ్గింపు మరియు 2వ మరియు 3వ సంవత్సరాల ప్రీమియంపై 11.25% తగ్గింపు.
వెయిటింగ్ పిరియడ్‌PED-24 నెలలునిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

50 ఏళ్లు నిండితే మీరు వృద్ధాప్యంలోనికి ప్రవేశిస్తున్నట్లు కాదు, కానీ గతంలో కంటే తెలివిగా మారుతున్నారని అర్ధం. మీరు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీని కలిగి ఉండకపోతే, దానిని కొనుగోలు చేయడానికి వివేకవంతమైన నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలోని ప్రతి దశను ఆస్వాదించండి మరియు వైద్య ఖర్చుల కోసం మీరు కష్టపడి సంపాదించిన పొదుపును వదులుకోవద్దు.

దానికి సంబంధించి, హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీ మీ వైద్య ఖర్చులకు కవర్‌ని అందిస్తుంది, తద్వారా మీ పొదుపులను కాపాడుకోవడానికి మరియు మీ 50 ఏళ్లను ఆస్వాదించడానికి మార్గం ఏర్పడుతుంది. మా స్టార్ హెల్త్ ప్రీమియర్ ఇన్సూరెన్స్ పాలసీ 50 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల కోసం ఎటువంటి గరిష్ట వయో పరిమితి లేకుండా రూపొందించబడింది. జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన పిల్లలు కూడా ఫ్లోటర్ ప్రాతిపదికన అదే పాలసీ కింద కవర్ చేయబడతారు. ఇది రూ. 1 కోటి వరకు సమ్ ఇన్సూర్డ్‌ ఎంపికను కలిగి ఉన్న కాంప్రహెన్సివ్ పాలసీ. ఇది సరసమైన ప్రీమియంతో హోమ్ కేర్ ట్రీట్‌మెంట్, డొమిసిలియరీ హాస్పిటలైజేషన్, నాన్-మెడికల్ ఐటెమ్‌లకు కవరేజీ, ఎయిర్ అంబులెన్స్, హాస్పైస్ కేర్, అవుట్ పేషెంట్ మెడికల్ ఖర్చులు మొదలైన ప్రత్యేక ఫీచర్లతో అందించబడుతుంది .

కర్తవిధానము
ప్రవేశ వయస్సుకనిష్టంగా - ప్రాథమిక సభ్యునికి 50 సంవత్సరాలు & గరిష్టంగా - ఏ వయస్సు వరకు అయినా
ఆధారపడిన పిల్లలు91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవితకాలం
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు
ప్రోడక్ట్ రకంఇండీవిడ్యువల్ మరియు ఫ్లోటర్
INRలో సమ్ ఇన్సూర్డ్‌10 / 20 / 30 / 50 / 75 / 100 లక్షల్లో
ప్రీ-యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్అవసరం లేదు.
తగ్గింపులుఆన్‌లైన్ కొనుగోలు & రెన్యూవల్‌పై 5%
స్టార్ వెల్‌నెస్ ప్రోగ్రామ్ కింద రెన్యూవల్ ప్రీమియంపై 2% - 10%
లాంగ్ టర్మ్ డిస్కౌంట్: ఎంచుకునే పాలసీ టర్మ్ 2 సంవత్సరాలు అయితే, 2వ సంవత్సరం ప్రీమియంపై 10% తగ్గింపు మరియు పాలసీ టర్మ్ ఎంచుకున్నట్లయితే 2వ మరియు 3వ సంవత్సరాల ప్రీమియంపై 11.25% తగ్గింపు.

ప్రపోజర్ కింది వైద్య రికార్డులను ఉత్పత్తి చేస్తే మరియు సమర్పించిన నివేదికలలోని ఫలితాలకు లోబడి ఉంటే ప్రీమియంలో 10% అనుమతించబడుతుంది

  1. స్ట్రెస్ ECHO నివేదిక / TMT (మార్గదర్శకత్వంలో జరిగింది)
  2. BP నివేదిక (3 రీడింగ్‌లు)
  3. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (FBS) మరియు HbA1C
  4. బ్లడ్ యూరియా & క్రియేటినిన్
  5. పూర్తి మూత్ర పరీక్ష (CUE)
వెయిటింగ్ పిరియడ్‌PED-24 నెలలునిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

ఆరోగ్యం మరియు శ్రేయస్సు ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన గొప్ప ఆస్తులు. మా స్టార్ హెల్త్ అష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని ఒకే రూఫ్ కింద కవర్ చేస్తుంది. ఇది ఒక సమగ్ర బీమా పాలసీ, దీనిని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ఆధారంగా పొందవచ్చు.

ఈ పాలసీ గరిష్టంగా 6 మంది పెద్దలు (సదరు వ్యక్తి, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు & అత్తమామలు) మరియు ముగ్గురు ఆధారపడిన పిల్లలను కవర్ చేయగలదు. ఫ్లోటర్ ఆధారంగా కవర్ చేయబడిన పిల్లలు 17 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, కుటుంబ పరిమాణం 9 మంది పెద్దలు కావచ్చు. ఈ పాలసీ మిడ్-టర్మ్ ఇన్క్లూజన్, డెలివరీ ఖర్చులు, హోమ్ కేర్ ట్రీట్‌మెంట్, దీర్ఘకాలిక తీవ్రమైన రిఫ్రాక్టరీ ఆస్తమాకు చికిత్స, అసిస్టెడ్ రీప్రొడక్షన్ చికిత్స, పునరావాసం & నొప్పి నిర్వహణ, కారుణ్య ప్రయాణం మరియు మరిన్ని వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు ఈ పాలసీలో దీర్ఘకాలిక డిస్కౌంట్‌లు, స్టార్ వెల్‌నెస్ ప్రోగ్రామ్ డిస్కౌంట్‌లు మరియు తగ్గింపులను ఎంచుకోవడంపై ప్రీమియం తగ్గింపులు (ఐచ్ఛిక కవర్) వంటి వివిధ తగ్గింపులను పొందవచ్చు.

కర్తవిధానము
ప్రవేశ వయస్సు18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు
ఆధారపడిన పిల్లలు16 రోజుల నుండి 17 సంవత్సరాల వరకు
రెన్యూవల్జీవిత కాలం
పాలసీ కాలం1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు
ప్రోడక్ట్ రకంఇండివిడ్యువల్ మరియు ఫ్లోటర్
INRలో సమ్ ఇన్సూర్డ్‌5 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 / 200 లక్షల్లో
ప్రీ-యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్అవసరం లేదు.
తగ్గింపులుఆన్‌లైన్ కొనుగోలు & రెన్యూవల్‌పై 5%
స్టార్ వెల్‌నెస్ ప్రోగ్రామ్ కింద రెన్యూవల్ ప్రీమియంపై 4% - 20%
లాంగ్ టర్మ్ డిస్కౌంట్: పాలసీ టర్మ్ ఎంచుకుంటే 2 సంవత్సరాలు, 2వ సంవత్సరం ప్రీమియంపై 10% తగ్గింపు మరియు పాలసీ టర్మ్ ఎంచుకుంటే 2వ మరియు 3వ సంవత్సరాల ప్రీమియంపై 3 సంవత్సరాలు 10%
వెయిటింగ్ పిరియడ్‌PED-30 నెలలు (3 సంవత్సరాల కాలానికి) & 36 నెలలు (1 & 2 సంవత్సరాల కాలానికి)నిర్దిష్ట వ్యాధులు - 24 నెలలుప్రారంభ వెయిటింగ్ పిరియడ్‌ - 30 రోజులు (ప్రమాదాలు మినహా)

మీ మెడికల్ ఇన్సూరెన్స్‌ పాలసీని కొనుగోలు చేసే ముందు పరిగణించవలసిన ముఖ్య అంశాలు

 

ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అనేక సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నప్పుడు ఉత్తమమైన ప్లాన్‌ను ఎంచుకోవడం కష్టం. చేరికలు మరియు మినహాయింపు ప్రతి పాలసీకి భిన్నంగా ఉంటాయి. మీరు సేకరించే ప్రతి సమాచారం సరైన మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ని ఎంచుకునే ప్రక్రియలో మీకు సహాయం చేస్తుంది.

 

మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు సరైన బీమా ప్రొవైడర్‌ను కూడా ఎంచుకోవాలి.

 

కంపెనీ అందించే ప్లాన్‌లను చూడండి. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి దాని స్వంత నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, కాబట్టి విస్తృత  హాస్పిటల్స్‌ యొక్క నెట్‌వర్క్‌ను అందించే కంపెనీని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తికి సమానమైన ప్రాముఖ్యతను ఇవ్వండి మరియు అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఉన్న దానిని ఎంచుకోండి.

 

ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకునేటప్పుడు, ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి:

 

చేరిక మరియు మినహాయింపు అనేవి కీలకమైన అంశాలు, కాబట్టి పాలసీని ఎంచుకునే ముందు వాటిని జాగ్రత్తగా చదవడం ముఖ్యం. ఇది క్లెయిమ్ ప్రక్రియ సమయంలో అపోహలను నివారించవచ్చు. మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని అర్థం చేసుకోవడం వల్ల క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు మీకు చక్కటి అవగాహన ఉంటుంది.

 

హెల్త్ ఇన్సూరెన్స్‌లో  వెయిటింగ్ పీరియడ్‌ ఎంత అనేది ప్రధానంగా తెలుసుకోవాలి, ఎందుకంటే, వెయిటింగ్ పీరియడ్‌లో, ప్రయోజనాలను పొందేందుకు మీరు క్లెయిమ్‌ను పెంచలేరు. తద్వారా, వెయిటింగ్ పీరియడ్‌ల వ్యవధిని తెలుసుకోవడం చాలా అవసరం. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీని ఎంచుకోవడం మంచిది.

 

నెట్‌వర్క్ హాస్పిటల్స్ అనేవి నగదు రహిత చికిత్స అందించడానికి బీమా కంపెనీలతో ఒప్పందంలో పనిచేసే ఆసుపత్రులు. ఆసుపత్రుల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న బీమా సంస్థను ఎంచుకోండి, తద్వారా మీరు మీకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు.

 

సహ-చెల్లింపు అనేది బీమా చేసిన వ్యక్తి మరియు బీమాదారు మధ్య వైద్య బిల్లుల భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. కొన్ని పాలసీలకు సహ-చెల్లింపు తప్పనిసరి మరియు కొన్నింటికి ఇది ఐచ్ఛికం. మీ సహ-చెల్లింపు గురించి తెలుసుకోవడం వలన మీ ఫైనాన్స్ ప్లాన్ చేసేటప్పుడు మీకు మరింత సౌలభ్యం లభిస్తుంది.

 

ఉప పరిమితులు అనేవి మెడికల్ ఇన్సూరెన్స్‌లో ఒక సాధారణ అంశం. గది అద్దె, గృహ చికిత్స, ఆయుష్ చికిత్స, కంటిశుక్లం చికిత్స మొదలైన వివిధ ఖర్చులకు పాలసీ ఉప-పరిమితులను కలిగి ఉండవచ్చు. కాబట్టి, అటువంటి ఖర్చుల కోసం క్లెయిమ్ మొత్తం పేర్కొన్న ఉప-పరిమితుల వరకు కవర్ చేయబడుతుంది మరియు మీరు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి.

 

ఒక సంచిత బోనస్‌ను నొ-క్లెయిమ్ బోనస్ అని కూడా అంటారు. పాలసీ వ్యవధిలో మీరు క్లెయిమ్‌ను చేసుకోకపోతే, మీ సమ్ ఇన్సూర్డ్‌ నిర్దిష్ట శాతంతో మెరుగుపరచబడుతుంది. అటువంటి మెరుగుదలని సంచిత బోనస్ అంటారు. సమకూడిన బోనస్ అవసరమైన సమయాల్లో ఉపయోగపడుతుంది.

మా ఉత్తమ స్పెషాలిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

 

మధుమేహం కోసం పాలసీ

 

మార్పు చెందుతున్న జీవనశైలి తీవ్రమైన వ్యాధులు మరియు రుగ్మతలకు దారితీస్తుంది. అలా వచ్చే సమస్యే మధుమేహం. వైద్య ద్రవ్యోల్బణం పెరుగుదలతో, డయాబెటిస్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కలిగి ఉండటం వలన మీ ఆర్థిక వైఫల్యం నుండి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. మా డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేకంగా టైప్ 1 & టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది.

 

క్యాన్సర్ కోసం పాలసీ

 

క్యాన్సర్ తీవ్రమైన ముప్పు మరియు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలలో ఒకటి. క్యాన్సర్‌కు సంబంధించిన నిర్దిష్ట బీమా పాలసీ ఆసుపత్రిలో చేరడం, చికిత్స మరియు క్యాన్సర్‌కు సంబంధించిన రోగనిర్ధారణకు కవర్‌ని అందిస్తుంది. మా స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేకంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. అదనంగా, ఇది క్యాన్సర్ కాని వ్యాధులకు కూడా కవరేజీని అందిస్తుంది.

 

గుండె జబ్బుల కోసం పాలసీ

 

జీవనశైలి మార్పులు కూడా సంక్లిష్టతలతో వస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇతర సంబంధిత సమస్యల యొక్క నానాటికీ పెరుగుతున్న ప్రమాదాలతో, మీరు ఉత్తమమైన మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌తో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం చాలా కీలకం. మా స్టార్ కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ-ప్లాటినం గుండె సంబంధిత వ్యాధులకు విస్తృత కవరేజీని అందిస్తుంది. ఇది అక్కడితో ఆగదు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు కూడా కవరేజీని అందిస్తుంది.

 

క్రిటికల్ ఇల్‌నెస్ కోసం పాలసీ

 

చాలా సందర్భాలలో, ఆరోగ్య సమస్యలు ఊహించని విధంగా సంభవిస్తాయి మరియు పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం ఇబ్బందులను పెంచుతుంది. క్లిష్టమైన అనారోగ్యానికి చికిత్స ఖరీదైనది మరియు ఎక్కువ కాలం పాటు నడుస్తుంది. చికిత్స ఖర్చుల గురించి చింతించకండి ఎందుకంటే మా స్టార్ క్రిటికల్ ఇల్‌నెస్ మల్టీపే ఇన్సూరెన్స్ పాలసీ, 37 క్లిష్ట అనారోగ్యాలకు వ్యతిరేకంగా మీకు బీమా చేస్తుంది. ఈ పాలసీ 4 గ్రూపుల కింద తీవ్రమైన అనారోగ్యాల నిర్ధారణపై ఏకమొత్తాన్ని అందిస్తుంది.

స్టార్ హెల్త్ ఎందుకు అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా పిలువబడుతుంది?

 

వినియోగదారులకు అత్యంత శ్రద్ధతో సేవలందించడమే మా నినాదం. మేము మీ మాటలను లోతుగా వింటాము, కాబట్టి మేము మీ నమ్మకాన్ని సంపాదించే మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లను అందించగలము.

మేము హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్, మరియు మా కస్టమర్-సెంట్రిక్ పాలసీలలో మా ఇటీవలి విజయాల జాబితా ఇక్కడ ఉంది:

 

  • రిటైల్ ఉత్పత్తి కోసం భారతదేశపు ఉత్తమ మెడికల్ ఇన్సూరెన్స్‌ కంపెనీ –ఇన్సూరెన్స్ అలర్ట్‌లు
  • 2020 సంవత్సరంలో అత్యంత వినూత్నమైన కొత్త ప్రోడక్ట్
  • ASSOCHAM యొక్క ఇన్సూరెన్స్ ఇ-సమ్మిట్ మరియు అవార్డ్స్ 2020లో యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీకి సంవత్సరానికి ఇన్నోవేటివ్ న్యూ ప్రోడక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
  • ఎకనామిక్ టైమ్స్ ద్వారా ఉత్తమ BFSI బ్రాండ్లు 2019
  • బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఆఫ్ ది ఇయర్ – బిజినెస్ టుడే, మనీ టుడే ఫైనాన్షియల్ అవార్డ్స్ 2018–2019
  • ఔట్‌లుక్ మనీ అవార్డ్స్ 2018 ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఆఫ్ ది ఇయర్ సిల్వర్ అవార్డ

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని మీ బీమా ప్రొవైడర్‌గా ఎంచుకోవడానికి కారణాలు

 

  • కస్టమర్-కేంద్రిత సంస్థ

 

ఉత్పత్తులు కస్టమర్-కేంద్రీకృతమైనవి మరియు కస్టమర్ అవసరాల ఆధారంగా రూపొందించబడ్డాయి – స్టార్ డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్ పాలసీ, స్టార్ కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ-ప్లాటినం, స్టార్ క్యాన్సర్ కేర్ ప్లాటినం ఇన్సూరెన్స్ పాలసీ, యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ మరియు మరెన్నో. మా కస్టమర్‌లు కోరుకునే విధంగా మీకు సేవలందించేందుకు లభ్యంగా ఉన్నాయి.

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్-ఫస్ట్ మైండ్‌సెట్‌తో విశ్వాసం మరియు సమగ్రతను కలిగి ఉన్న ప్రధాన విలువలతో పనిచేస్తుంది. ఇది మా మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లతో మీ కోసం అదనపు మైలు దూరం వెళ్లేలా చేస్తుంది. స్టార్ ఫ్యామిలీలో భాగమని ఎంచుకునే వారి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము.

 

  • మా నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదు రహితం కింద 96.6% క్లెయిమ్‌లు 2 గంటలలోపు పరిష్కరించబడ్డాయి
     

భారతదేశంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులలో 2 గంటల్లో నగదు రహిత సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మా అంతర్గత క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ ఒక ప్రధాన అంశం, ఇది ఈ భారీ విజయ రేటును సాధించడానికి మాకు వీలు కల్పించింది. మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్ మరియు సెటిల్‌మెంట్‌ని క్వాలిఫైడ్ ఇన్‌హౌస్ డాక్టర్‌ల ద్వారా నిర్ధారిస్తాము.

 

  • యావత్భారతదేశం వ్యాపించి ఉన్నాం
     

భారతదేశం అంతటా నానాటికీ విస్తరిస్తున్న  16,000+ నెట్‌వర్క్ ఆసుపత్రులు.

 

  • అర్హత కలిగిన వైద్యుల ద్వారా క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయి
     

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి మరియు ప్రొసీడింగ్‌లను వేగంగా ట్రాక్ చేయడానికి ప్రత్యేక వైద్యుల అంతర్గత బృందం నిత్యం అందుబాటులో ఉంటుంది. ఈ బృందం నిధులను పొందేందుకు దుర్మార్గపు పద్ధతులను ఉపయోగించేవారిని మరియు మెడికల్ ఇన్సూరెన్స్‌ నుండి లాభం పొందాలని భావించే వారిని కూడా ఏరి పారవేస్తుంది..

 

  • థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేషన్ (TPA) లేదు
     

ఒక క్లెయిమ్ గడువులోపు పరిష్కరించబడినప్పుడే అది న్యాయం చేస్తుంది. తరచుగా, అనేక బీమా కంపెనీలు TPA సేవలను పొందుతాయి మరియు క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం ప్రోత్సాహాన్ని పొందుతాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ TPAపై ఆధారపడదు కానీ క్లెయిమ్‌లను వేగంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడటానికి మరియు అత్యంత అవసరమైన గంటలో తక్కువ సమయంలో వాటిని పరిష్కరించడంలో సహాయపడటానికి మా అంతర్గత క్లెయిమ్ బృందంపై ఆధారపడుతుంది.

 

  • అందరికీ అధిక-నాణ్యతతో కూడిన ఉచిత టెలిమెడిసిన్ సౌకర్యం
     

ఆరోగ్యం అనేది అన్నింటినీ తనతో కలుపుకుంటుంది, దీనిని మా కస్టమర్లు మాత్రమే కాకుండా అందరూ పొందుకోవాలని విశ్వసిస్తున్నాము. కాబట్టి, ఎవరైనా మా ఉచిత టెలిమెడిసిన్ సౌకర్యాలను పొందవచ్చు. టాక్ టు స్టార్ యాప్ అనేది ఈ ప్రయోజనం కోసం రూపొందించబడిన ప్రత్యేక అప్లికేషన్.

 

  • వెల్నెస్ కార్యక్రమాలు
     

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ప్రత్యేకమైన వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లతో మంచి ఆరోగ్యం యొక్క క్రియాశీల నిర్వహణకు మద్దతు ఇస్తుంది.

ఇతర ప్రోడక్ట్‌లు
వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్

వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్

వ్యక్తులకు ప్రత్యేకంగా రూపొందించిన అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌‌తో మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. 

కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్

కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్

మీ కుటుంబ పరిమాణం ఆధారంగా సరసమైన ప్రీమియంలతో అనుకూలమైన కవరేజీని పొందండి.

తలిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్

తలిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్

మీ తల్లిదండ్రులకు మీ ప్రేమ, శ్రద్ధ మరియు మద్దతును అందించడం ద్వారా వారి ఋణాన్ని తీర్చుకొనేందుకు ఓ సువర్ణావకాశం.

ప్రసూతి కోసం హెల్త్ ఇన్సూరెన్స్

ప్రసూతి కోసం హెల్త్ ఇన్సూరెన్స్

అన్ని ప్రసూతి-సంబంధిత ఖర్చులకు సమగ్ర కవరేజీ పొందండి. అలాగే నవజాత శిశువుల వైద్య అవసరాలకు కూడా కవర్ పొందండి.

హెల్త్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ల ప్రక్రియ ఏమిటి?

స్టార్ హెల్త్ క్లెయిమ్ సర్వీసెస్ సులభమైన, కస్టమర్-స్నేహపూర్వక, అవాంతరాలు లేని ప్రక్రియతో సత్వర పరిష్కార ప్రక్రియను నిర్ధారిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ నిపుణులుగా, మేము భారతదేశంలోని మా అనుబంధిత నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత క్లెయిమ్‌లను అందిస్తాము.

నెట్‌వర్క్ ఆసుపత్రిలో బీమా డెస్క్‌ని సంప్రదించండి. ఇన్సూరెన్స్ చేయబడిన రోగి యొక్క కస్టమర్ ID మరియు పాలసీ కాపీని షేర్ చేయండి.

ప్రణాళికాబద్ధమైన హాస్పిటలైజేషన్ గురించి 7 నుండి 10 రోజుల ముందుగానే  తెలియజేయండి, అయితే అత్యవసర ఆసుపత్రిలో అయితే చేరిన 24 గంటలలోపు తెలియజేయాలి.

 

ప్రక్రియ

  • క్లెయిమ్‌ను నమోదు చేయండి
  • పత్రాలు స్టార్ హెల్త్ క్లెయిమ్‌ల బృందానికి పంపబడతాయి.
  • క్లెయిమ్ ప్రాసెసింగ్ టీమ్ ద్వారా పత్రాలు ధృవీకరించబడతాయి.
  • క్లెయిమ్ ఆమోదం, అదనపు పత్రాల విచారించడం లేదా నగదు రహిత చెల్లింపు తిరస్కరణ లేదా క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించిన నిర్ణయాన్ని నెట్‌వర్క్ ఆసుపత్రి రెండు గంటలలోపు అందుకుంటుంది.
  • ఆమోదించబడినప్పుడు, ఇన్సూరెన్ నిబంధనల ప్రకారం క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.
  • ఏదైనా వ్యత్యాసం ఉంటే దానిని డిశ్చార్జ్‌కి ముందు చెల్లించండి.
     

రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేయడానికి, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఆసుపత్రి ఖర్చులను చెల్లిస్తారు. డిశ్చార్జ్ తేదీ నుండి 15 రోజులలోపు, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లను బీమా సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ రీయింబర్స్‌మెంట్ కోసం అవసరమైన పత్రాలు

  • సక్రమంగా నింపిన క్లెయిమ్‌ ఫారమ్.
  • ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ సమ్మరీ.
  • అడ్మిషన్‌కు ముందు పరిశీలన మరియు చికిత్స పత్రాలు.
  • ఆసుపత్రి మరియు కెమిస్ట్‌ల నుండి విడి వివరాలతో కూడిన అంతిమ బిల్లు.
  • రోగ నిర్ధారణకు సంబంధించి హాజరైన వైద్యులు మరియు సర్జన్ల నుండి రసీదు.
  • పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్, క్యాన్సిల్డ్ చెక్కు లేదా NEFT వివరాలు.

తదుపరి సహాయం మరియు ప్రశ్నల కోసం, ప్రశ్నలను నివృతి చేసుకోడానికి మా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. 

మీరు తెలుసుకోవలసిన హెల్త్ ఇన్సూరెన్స్‌ నిబంధనలు

హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ముందు కొన్ని నిబంధనల గురించి తెలుసుకోవడం ముఖ్యం. పాలసీ కవరేజ్ మరియు దాని ప్రమాణాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ నిబంధనలు సహాయపడతాయి. పెద్ద తప్పిదాలను నివారించడానికి అన్ని నిబంధనలను అనుసరించడం ముఖ్యం. అయితే, కొన్ని నిబంధనలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.

సరైన హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లను ఎంచుకోవడంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ మరియు సాధారణ నిబంధనలు క్రింద ఇవ్వబడ్డాయి.

 

1. సమ్-ఇన్సూర్డ్

 

 సమ్ ఇన్సూర్డ్ అనేది పాలసీ కవరేజ్ మొత్తం.

 

2. ప్రీమియం

 

 ప్రీమియం అనేది మీరు కొనుగోలు చేసిన పాలసీకి  బీమా సంస్థకు లేదా హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం. ప్రీమియం మీరు ఎంచుకున్న పాలసీ రకం, పాలసీదారు, వయస్సు మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

 

3. నగదు రహిత క్లెయిమ్‌లు

 

నగదు రహిత క్లెయిమ్‌లు అంటే బీమా సంస్థ యొక్క నెట్‌వర్క్ హాస్పిటల్‌లలో పొందగలిగే హెల్త్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు.

 

4. యాడ్-ఆన్ కవర్లు

 

యాడ్-ఆన్ కవర్లు అనేది అధిక వైద్య ఖర్చులతో కూడిన అనూహ్య వైద్య అత్యవసర పరిస్థితులకు హెల్త్ ఇన్సూరెన్స్‌లో అదనపు ఆర్థిక కవర్‌లను అందించే అదనపు ఫీచర్లు.

 

యాడ్-ఆన్ కవర్‌లకున్న ఇతర పేర్లు రైడర్‌లు మరియు ఐచ్ఛిక(ఆప్షనల్) కవర్‌లు. తీవ్రమైన అనారోగ్యం, గది అద్దె మినహాయింపు, ప్రసూతి కవర్ మరియు ఆసుపత్రి నగదు ప్రయోజనం వంటివి మీ ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్‌ను మెరుగుపరిచే కొన్ని సాధారణ యాడ్-ఆన్‌లు.

 

5. క్రిటికల్ ఇల్‌నెస్

 

క్రిటికల్ ఇల్‌నెస్‌ల క్రిందికి మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్ మరియు గుండె సంబంధ వ్యాధులు వంటి ప్రాణాంతక వైద్య పరిస్థితులు వస్తాయి. అటువంటి క్లిష్టమైన అనారోగ్యాలకు, వాటిని కవర్ చేసే ప్రత్యేక ప్లాన్‌లు ఉన్నాయి. అదనంగా, మీరు యాడ్-ఆన్ లేదా రైడర్ కవర్‌ని పొందవచ్చు.

 

 6. నెట్‌వర్క్ ఆసుపత్రులు

 

 అన్ని హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీలు దేశంలోని నిర్దిష్ట సంఖ్యలో ఆసుపత్రులతో టై-అప్ కలిగి ఉంటాయి. హాస్పిటల్స్‌తో ఈ టై-అప్‌లను నెట్‌వర్క్ హాస్పిటల్స్ అంటారు.

 

7. స్వయంచాలక పునరుద్ధరణ

 

చాలా హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆటోమేటిక్ రీస్టోరేషన్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. మీరు సమ్ ఇన్సూర్డ్ అయిపోయిన తర్వాత మీరు బీమా బ్యాకప్ నుండి ప్రయోజనం పొందుతారు. స్వయంచాలక పునరుద్ధరణలో, పాలసీ వ్యవధిలో తదుపరి హాస్పిటలైజేషన్ కోసం సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది.

 

8. ముందుగా ఉన్న వ్యాధి/సహ వ్యాధులు

 

హైపర్‌టెన్షన్, COPD, కిడ్నీ వ్యాధులు, మధుమేహం మరియు ఇతర ప్రధాన ఆరోగ్య సమస్యలు వంటి సహ-అనారోగ్యాలు హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రమాద కారకాలుగా పరిగణించబడతాయి. కాబట్టి పైన పేర్కొన్న ఏవైనా సహ-అనారోగ్యాలు ఉన్న వ్యక్తులు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

 

9. మినహాయింపులు

 

మినహాయింపులు లేదా పరిమితులు అనేవి హెల్త్ ఇన్సూరెన్స్‌ కంపెనీలు తమ పాలసీ పదాలలో స్పష్టంగా పేర్కొనే పరిస్థితులు మరియు షరతులు. అటువంటి సందర్భాలలో, మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు తిరస్కరించబడవచ్చు లేదా తదుపరి ప్రాసెస్ చేయబడవు.

 

10. చేరికలు

 

చేరికలు లేదా కవరేజ్ ప్రయోజనాలు మీరు సరిగ్గా తనిఖీ చేయవలసిన ఒక విభాగం. ఈ ప్రయోజనాలు అనేవి ప్రయోజనాలు మరియు బీమా సంస్థ మీకు పరిహారం అందించే ఇతర పాలసీ ఫీచర్లను సూచిస్తాయి. హాస్పిటలైజేషన్, అనస్థీషియా, సర్జరీ, అంబులెన్స్ ఛార్జీలు మరియు చికిత్స-సంబంధిత ఖర్చులు అనేవి కొన్ని సాధారణ చేరికలు.

 

11. వెయిటింగ్ పిరియడ్

 

మెడికల్ ఇన్సూరెన్స్‌లో, ఆరోగ్య పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్‌లో, మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను పొందలేరు. వివిధ ఆరోగ్య పరిస్థితులు మరియు బీమా పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ భిన్నంగా ఉంటుంది.

 

12. టాప్-అప్ ప్లాన్‌లు

 

 టాప్-అప్ ప్లాన్‌లు బేస్ పాలసీతో పాటు కొనుగోలు చేయగల పాలసీలు. బేస్ పాలసీ ద్వారా బీమా మొత్తం అయిపోయినప్పుడు, టాప్ ప్లాన్‌లు మిమ్మల్ని కవర్ చేస్తాయి.

 

13. సహ చెల్లింపు

 

కోపే నిబంధన లేదా సహ-చెల్లింపు అనేది పాలసీదారు తీసుకున్న చికిత్సలో ఖర్చులపై ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తంలో నిర్ణీత శాతం. కాపీ చెల్లింపు శాతం పాలసీ నుండి పాలసీకి భిన్నంగా ఉంటుంది మరియు ప్రవేశ వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్‌ అవసరం ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్‌ ఎందుకు అవసరమో కొన్ని కారణాలు.

 

హెల్త్ ఇన్సూరెన్స్‌ మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఒత్తిడికి గురిచేసే ఆకస్మిక భారీ వైద్య బిల్లుల నుండి రక్షిస్తుంది.

 

 హెల్త్ ఇన్సూరెన్స్‌ ఆరోగ్య పరిస్థితులు మరియు హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం మరియు రక్తపోటు వంటి ఇతర జీవనశైలి వ్యాధుల చికిత్స ఖర్చును కవర్ చేస్తుంది.

 

 మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. 

స్టార్ నుండి తగిన హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి?

సమ్ ఇన్సూర్డ్

 

ఆసుపత్రిలో చేరడం కోసం పాలసీ సంవత్సరంలో సరసమైన ప్రీమియంతో కవరేజ్ ఉన్న పాలసీని ఎంచుకోండి.

 

కవరేజ్ మొత్తం

 

హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునేటప్పుడు, ప్రతి పాలసీ కింద కవరేజ్ మొత్తాన్ని పరిశీలించండి. ఆసుపత్రిలో చేరడం, డేకేర్, అంబులెన్స్ మరియు ప్రసూతి వంటి వైద్య ఖర్చులను కవర్ చేసే పాలసీని ఎంచుకోండి.

 

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లు

 

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి, ఇది మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లు సరసమైనవి మరియు మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తాయి.

 

వివిధ పాలసీలను సరిపోల్చండి

 

హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు, వివిధ ప్లాన్‌లను సరిపోల్చడం మరియు మీకు సరిపోయేదాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది కవరేజ్ వివరాల గురించి మరియు మీ బడ్జెట్‌కు ఏ పాలసీకి సరిపోతుందో కూడా మీకు తెలియజేస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఐచ్ఛిక యాడ్-ఆన్‌లు ఏమిటి?

 హెల్త్ ఇన్సూరెన్స్‌లోని యాడ్-ఆన్‌లు లేదా ఐచ్ఛిక ఫీచర్లను కొనుగోలు చేసేటప్పుడు అదనపు మొత్తాన్ని చెల్లించడం ద్వారా మీ బేస్ పాలసీలో చేర్చవచ్చు. చాలా సందర్భాలలో, వ్యక్తులు యాడ్-ఆన్‌లను ఎంచుకుంటారు ఎందుకంటే అవి ఖర్చును తగ్గిస్తాయి మరియు గణనీయమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

హెల్త్ ఇన్సూరెన్స్‌ అర్హత ప్రమాణాలు ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లు వయస్సు, ముందుగా ఉన్న వైద్య పరిస్థితులు మొదలైనవాటితో సహా వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కు అర్హత సాధించడానికి ఈ క్రింది షరతులను తప్పనిసరిగా పాటించాలి.

 

  • వయస్సు

 

పెద్దలకు ప్రవేశ వయస్సు 18, మరియు వారు పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం అన్ని ప్రయోజనాలకు అర్హులు. అయితే, వివిధ పాలసీలకు వయస్సు ప్రమాణాలు మారుతూ ఉంటాయి.

 

  • ప్రీ-మెడికల్ స్క్రీనింగ్

 

45 లేదా 55 ఏళ్లు పైబడిన పాలసీదారులకు ప్రీ-మెడికల్ పరీక్ష తప్పనిసరి. అయితే, పాలసీని జారీ చేయడానికి ముందు, చాలా సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్‌లకు వైద్య పరీక్షలు అవసరం.

 

  • ముందుగా ఉన్న వ్యాధి (PED)

 

హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు బీమా సంస్థలో నిర్ధారణ చేయబడిన వ్యాధులే ముందుగా ఉన్న పరిస్థితులు(ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్లు). ముందుగా ఉన్న వ్యాధులకు మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలన్నింటికీ అర్హులు కానటువంటి వెయిటింగ్ పిరియడ్‌ను కలిగి ఉంటారు.

 

వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్ కింద నిర్దిష్ట పరిస్థితి కోసం క్లెయిమ్‌లను సమర్పించవచ్చు. క్లెయిమ్‌ తిరస్కరణను నివారించడానికి, మీ ఆరోగ్య సమస్యలు మరియు జీవనశైలి ఎంపికల గురించి సరైన సమాచారాన్ని అందించండి.

హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను ఎలా లెక్కించాలి?

హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం మీ వైద్య చరిత్ర, బీమా మొత్తం మరియు మీ కుటుంబ వైద్య చరిత్రతో సహా అనేక అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది.

 

మీరు ప్రతి నెల, ప్రతి త్రైమాసికం, ప్రతి అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా చెల్లించడానికి ఎంచుకోవచ్చు.

 

మీ అవసరాలు మరియు సామర్థ్యాలపై మీకు అవగాహన ఉంటే భారంగా అనిపించని ప్రీమియం చెల్లింపుతో కూడిన ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు.

మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియం పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే దానిపై అనేక అంశాలు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రభావితం చేస్తాయి. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్ ప్రీమియంను ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

  • వయస్సు

హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను వయస్సు నిర్ణయిస్తుంది. ఎక్కువ వయస్సు, హెల్త్ ఇన్సూరెన్స్‌ పథకానికి ప్రీమియం ఎక్కువ అవ్వడానికి కారణం అవుతుంది. వయస్సు పెరుగుదలతో, మీరు వయస్సు-సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది మరియు వైద్య సంరక్షణ అవసరం అవుతుంది, ఇది మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ కవరేజ్ యొక్క ప్రీమియంను పెంచుతుంది.

  • వైద్య చరిత్ర

ముందుగా ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు పాలసీకి ప్రీమియం పెరుగుతుంది.

  • పాలసీ వ్యవధి

హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీ నిడివి ప్లాన్ ప్రీమియంపై ప్రభావం చూపుతుంది. అధిక కాల వ్యవధి పాలసీకి ప్రీమియం తక్కువగా ఉంటుంది.

  • అలవాట్లు

మీరు ధూమపానం, మద్యపానం మొదలైనవాటిలో ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ జీవనశైలి అలవాట్లు హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.

  • వృత్తి

మీ వృత్తి లేదా పని స్వభావం హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై ప్రభావం చూపుతుంది. హానికరమైన వాతావరణంలో పని చేస్తున్నప్పుడు లేదా ఒత్తిడితో కూడిన ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రీమియం పెరుగుతుంది.

  • బాడీ మాస్ ఇండెక్స్

మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు మరియు ఇతర వ్యాధులు BMI సూచికకు సంబంధించినవి. అధిక BMI సూచికలు ఉన్నవారికి బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.

కింది చిట్కాలు మీ వైద్య బీమా ప్రీమియంను తగ్గించడంలో మీకు సహాయపడతాయి:

  • హెల్త్ ఇన్సూరెన్స్‌ను ముందుగానే కొనుగోలు చేయండి.

మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను ప్రభావితం చేసే ప్రాథమిక అంశం వయస్సు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యంగ్ స్టార్ ప్లాన్‌ను ముందస్తుగా కొనుగోలు చేస్తే 5% జీవితకాల తగ్గింపు లభిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరియు మీ జీవితంలో ప్రధానమైన సమయంలో ఆరోగ్య రక్షణ ప్లాన్ కోసం తక్కువ ప్రీమియం రేటును లాక్ చేయడం ముఖ్యం.

  • టాప్-అప్‌లను పరిగణించండి

టాప్-అప్ ప్లాన్‌లు మీ బీమా రక్షణను పెంచడంలో మీకు సహాయపడతాయి, మీ బడ్జెట్‌లో వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం మిమ్మల్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతాయి. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ కవరేజ్ మరియు ప్రీమియం ఖర్చులను నియంత్రించడంలో కూడా ఇవి మీకు సహాయపడతాయి.

  • వివిధ హెల్త్ ఇన్సూరెన్స్‌ పథకాలను పోల్చడం

కొనుగోలు చేయడానికి ముందు వివిధ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీల గురించి ఆలోచించి పోల్చి చూడండి. కొన్ని బీమా పాలసీలు అధిక ప్రీమియంలను కలిగి ఉన్నప్పటికీ, అధిక కవరేజ్‌కు ఎల్లప్పుడూ హామీ ఇవ్వబడదు. కాబట్టి, నిర్ణయం తీసుకునే ముందు ఫీచర్‌లు, మినహాయింపులు, ప్రోత్సాహకాలు మొదలైన వాటితో సహా అన్ని ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను బేరీజు వేసుకోండి.

  • ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

మీ బీమాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. సాధారణంగా, ఆఫ్‌లైన్ విధానాల కంటే ఆన్‌లైన్ కొనుగోలు చాలా పొదుపుగా ఉంటుంది, పాలసీదారుల వార్షిక ప్రీమియం బాధ్యతను తగ్గిస్తుంది.

  • ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లను ఎంచుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్‌ అవసరాలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనవి అయినప్పటికీ, ఈ ప్రణాళికలు కుటుంబంలోని సభ్యులందరికీ సరిపోయేలా రూపొందించబడ్డాయి.

 ఫ్యామిలీ-ఫ్లోటర్ ప్లాన్ కుటుంబ సభ్యులందరి మెడికల్ బిల్లులకు చెల్లిస్తుంది. అయితే, మీరు మీ కుటుంబంలోని ప్రతి సభ్యుని కోసం ఒక ప్రత్యేక ప్లాన్‌ని కొనుగోలు చేయడం కంటే దీని ధర చాలా తక్కువగా ఉంటుంది.

అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా కుటుంబ సభ్యులెవరైనా అవసరం ఉన్నట్లయితే, ప్లాన్ కింద హామీ ఇవ్వబడిన డబ్బును ఉపయోగించవచ్చు.

  • ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని నిర్వహించండి.

మీ జీవనశైలి మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్ ప్రీమియాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పొగతాగని, మద్యపానం చేయని, పొగాకు వాడని, డ్రగ్స్ వాడని వారికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ఫలితంగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించే వ్యక్తులు అతి తక్కువ ప్రీమియంలను మాత్రమే కట్టాల్సి వస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అపోహలు, వాటికి సమాధానాలు

#1 మంచి ఆరోగ్యం ఉన్న వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్‌ అవసరం లేదు

మీరు ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉన్నప్పుడు కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ నుండి దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్‌ మిమ్మల్ని ఏదైనా ఊహించని అనారోగ్యం నుండి కాపాడుతుంది.

 

#2 ఇన్సూరెన్స్ గర్భధారణను కవర్ చేయదు

నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులకు లోబడి ప్రసూతి కవరేజీతో బీమా పాలసీలు ఉన్నాయి.

 

#3 మీ మొత్తం వైద్య ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి

రీయింబర్స్‌మెంట్ మొత్తం పాలసీపై ఆధారపడి ఉంటుంది. చాలా ప్లాన్‌లు బీమా చేయబడిన మొత్తం ఆధారంగా గది ఛార్జీలను కవర్ చేస్తాయి, దానికి మించిన ఏదైనా అదనపు మొత్తాన్ని బీమాదారు చెల్లించాలి. పాక్షిక రీయింబర్స్‌మెంట్‌కు లోబడి ఉండే ఇతర ఖర్చులకు పాలసీకి ఉప-పరిమితులు ఉండవచ్చు.

 

#4 ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కొనుగోళ్లు సురక్షితం కాదు

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ విక్రయాలు క్రమంగా పెరిగాయి. అయితే, ఇంటర్నెట్ లావాదేవీలు మోసానికి దారితీస్తాయని చాలా మంది నమ్ముతారు. సులభంగా పాలసీ కొనుగోళ్ల కోసం బీమా సంస్థలు ఆన్‌లైన్ పోర్టల్‌లను ప్రారంభించాయి కాబట్టి ఇది అవాస్తవం.

సహాయ కేంద్రం

అయోమయంగా ఉందా? మావద్ద సమాధానాలు ఉన్నాయి

మీ మెడికల్ ఇన్సూరెన్స్‌ సంబంధిత సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి.

హెల్త్ ఇన్సూరెన్స్  అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి మరియు ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తికి మధ్య ఒక ఒప్పందం, ఇందులో ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి కవరేజి పొందటానికి ప్రీమియంలు చెల్లిస్తారు. ఇది పాలసీదారునికి అయిన వైద్య ఖర్చులకు కవర్ చేస్తుంది.

మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఊహించని మెడికల్ ఎమర్జెన్సీలలో ఆర్ధిక సంరక్షణగా నిలుస్తుంది. అలాంటి సమయాల్లో మీరు మీ గురించి, మీ ఆత్మీయుల గురించి శ్రద్ధ చూపిస్తూ ఉండగా మెడికల్ ఇన్సూరెన్స్ మీ హాస్పిటల్ బిల్స్‌ను కవర్ చేస్తుంది.

ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధి అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు వ్యక్తి యొక్క ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి. అటువంటి ముందుగానే ఉన్న వ్యాధులు ఉన్న సందర్భంలో వెయిటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత కవరేజీ వర్తిస్తుంది.

అవును, మీరు బహుళ మెడిక్లెయిమ్ పాలసీలను కలిగి ఉండవచ్చు, అయితే మీరు నియమనిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి, ఇలా తెలుసుకోవడం వలా క్లెయిమ్ ప్రక్రియ సమయంలో అపార్ధాలకు తావులేకుండా చేస్తుంది.

స్టార్ వెల్‌నెస్ కార్యక్రమం వ్యక్తులను ఆరోగ్యంగా ఉంచడం కోసం డిజైన్ చేయబడింది. మా పలు వెల్‌నెస్ కార్యక్రమాలలో పాల్గొనడం వలన పాలసీదారులు వెల్‌నెస్ పాయింట్లు ఆర్జించవచ్చు. ఈ పాయింట్లను రెన్యూవల్ సమయంలో ప్రీమియం డిస్కౌంట్లు పొందటం కొరకు ఉపయోగించుకోవచ్చు.

ఎక్కువ శాతం మెడిక్లెయిమ్ పాలసీలు స్థిరమైన వెయిటింగ్ పిరియడ్‌ను కలిగి ఉంటాయి. అయితే, మా స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు ముందుగానే ఉన్న మరియు కొన్ని నిర్దిష్ట వ్యాధులకు ఆప్షనల్ కవర్ అయిన బయ్ బ్యాక్ పిఇడితో 36 నుండి 12 నెలల వరకు వెయిటింగ్ పిరియడ్‌ను తగ్గించవచ్చు.

మీరు ఈ క్రింది లింక్‌ను సందర్శించడం ద్వారా కొన్ని సులభ దశల్లో క్లెయిం‌ను దాఖలు చేయవచ్చు. 
https://www.starhealth.in/customerportal/claimintimationWithoutlogin. మీరు మమ్మల్ని 0446900/04446745800/1800425 2255/ 1800 102 4477 వద్ద సంప్రదించడం ద్వారా మరియు support@starhealth.inకు ఇ-మెయిల్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ చాట్ సర్వీసును @ +91 9597652225 ఉపయోగించుకోవడం ద్వారా మీ క్లెయిమును దాఖలు చేయవచ్చు.

మీరు https://www.starhealth.in/claims#3 లింకును క్లిక్ చేయడం ద్వారా మీరు మీ క్లెయిమును ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. మీరు మీ క్లెయిమ్ స్థితిని 1800 425 2255 / 1800 102 4477 కు కాల్ చేయడం ద్వారా , support@starhealth.inకు ఇ-మెయిల్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ చాట్ సర్వీసును @ +91 9597652225 ఉపయోగించుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.

మీరు క్రింది డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా రీఇంబర్స్‌మెంట్ క్లెయిమును దాఖలు చేయవచ్చు:
1. క్లెయిమ్ ఫారం
2. పరీక్ష రిపోర్టులు (ప్రభుత్వం ఆమోదించిన లేబొరేటరీల నుండి)
3. చేయించుకున్న పరీక్షల బిల్లులు
4. హాస్పిటల్ నుండి డిశ్చార్జి సమ్మరీ
5. హాస్పిటల్ నుండి బిల్లులు
6. కొన్న ఔషధాల బిల్లులు
7. అన్ని చెల్లింపుల రశీదులు
8. పాన్ కార్డ్, క్యాన్సిల్డ్ చ్క్ లేదా నెఫ్ట్ వివరాల కాపీ

మా వెబ్‌సైట్  https://www.starhealth.in/claims/#3 ను సందర్శించి 'నాకు రెన్యూవల్ కావాలి'ను  క్లిక్ చేయడం ద్వారా 
లేదా ఇన్‌స్టంట్ రెన్యూవల్స్‌ కోసం https://www.starhealth.in/customerportal/instant-renewal/ లింకును క్లిక్ చేయడం ద్వారా 
మీ పేరు, పాలసీ నంబర్, జన్మదినం, మరియు అడిగిన మేరకు ఇతర వివరాలు
మీ చెల్లింపు విధానాన్ని ఎంచుకొని మీ పాలసీని రెన్యూ చేసుకోండి

మీరు మాకు 1800-425-2255 లేదా 1800-102-4477 వద్ద కాల్ చేయడం ద్వారా లేదా సమీపంలోని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచిని సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా మీ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు 

ప్రీ-ఆథరైజేషన్ అభ్యర్ధన అనేది నెట్‌వర్క్ హాస్పిటల్‌లో తీసుకున్న చికిత్సకు నగదు రహిత క్లెయిమును దాఖలు చేయడానికి చేసే అధికారిక అభ్యర్ధన. మీరు ప్రీ-ఆథరైజేషన్ ఫార్మ్‌లో అడిగిన మేరకు ఇన్సూర్డ్ వ్యక్తి యొక్క వివరాలను నింపి దానిని చికిత్స పొందిన నెట్‌వర్క్ హాస్పిటల్‌లో సమర్పించాలి. ఒకసారి ఇన్సూరెన్స్ సంస్థ పరిశీలించి ఆమోదించిన తర్వాత నగదు రహిత క్లెయిమ్ నేరుగా నెట్‌వర్క్ హాస్పిటల్ వద్దే పరిష్కరించబడుతుంది.

మెడికల్ ఇన్సూరెన్స్‌లు ఏదైనా వైద్య అత్యవసర స్థితి నెలకొన్నప్పుడు ఎదురయ్యే ఆర్ధిక నష్ట భయాలు లేదా అనిశ్చితి పరిస్థితుల నుండి మిమ్మల్ని, మీ ఆత్మీయులను సంరక్షించడానికి మీకు సహాయం అందిస్తాయి. ఒక విశ్వసనీయ ఇన్సూరెన్స్ ప్రదాత నుండి ఒక అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ తీసుకోవడం వలన ఏదైనా వైద్య అత్యవసర స్థితి నెలకొన్నప్పుడు మీరు కష్టపడి ఆదాచేసుకొన్న  పొదుపులు మరియు ఆస్తులను కాపాడుకోవడానికి దోహదమవుతుంది.

పాలసీ క్రింద లభించే సమ్ ఇన్సూర్డ్ మరియు బోనస్ (ఏదైనా ఉంటే) పరిధిలో చేయదగిన ఎన్ని క్లెయిములైనా

మీ కుటుంబం(మీరు, మీ భాగస్వామి మరియు ఆధారపడిన పిల్లలు) అంతా ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద కవర్ చేయబడగలిగినప్పుడు దానిని ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. ఈ ప్లాన్ మీ కుటుంబ సభ్యులకు పాలసీ నిబంధనల మేరకు ఆకస్మిక అనారోగ్యం మరియు డేకేర్ ప్రక్రియలు /చికిత్సల కయ్యే ఖర్చులతో సహా అన్ని వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. 

అవును, మీరు మొత్తం కుటుంబాన్ని, వారు ఎక్కడ ఉంటున్నా ఒకే మెడిక్లెయిమ్ పాలసీతో కవర్ చేయవచ్చు. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ భారతదేశ వ్యాప్తంగా చెల్లుతుంది.

హెల్త్ ఇన్సూరెన్స్  పాలసీలు ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి ఇన్-పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరిన సమయంలో నిర్వహించే X-రేలు, MRI, రక్త పరీక్షలు మరియు ఆ సమయంలో నిర్వహించే అటువంటి మరెన్నో రోగనిర్ధారణ పరీక్షలకు కవర్‌ను అందిస్తాయి. అనారోగ్యం ఉన్నట్టు తేలకుండా  మూల్యాంకనం/పరిశోధన కోసం నిర్వహించబడే రోగనిర్ధారణ పరీక్షలకు ఈ కవర్ వర్తించదు.

ఏ హెల్త్ ఇన్సూరెన్స్  పాలసీ కింద అయినా, ముందుగా ఉన్న వ్యాధులు మరియు వాటి సమస్యలు నిర్దిష్ట వెయిటింగ్ పిరియడ్ తర్వాత కవర్ చేయబడతాయి, దీనిని టైం-బౌండ్ మినహాయింపులు అంటారు. స్టార్ హెల్త్‌లో మేము ఒక సంవత్సరం నిరంతర రెన్యూవల్స్ తర్వాత ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేసే పాలసీలను అందిస్తాము. ముందుగా ఉన్న వ్యాధులు మరియు వాటి సమస్యలకు కవరేజ్ ప్రోడక్ట్/ప్లాన్ నిర్దిష్టంగా ఉంటుంది. ప్రతి పాలసీకి ఉండే ప్రత్యేకమైన వెయిటింగ్ పీరియడ్‌లు మరియు మినహాయింపుల గురించి మరింత తెలుసుకోవడానికి మా పాలసీ క్లాజ్‌ని సందర్శించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము

అవును, మీ ప్రస్తుత పాలసీకి సంబంధించిన వివరాలను అందించడానికి లోబడి మీరు మా నుండి కుటుంబ ఆరోగ్య బీమా ప్లాన్‌ని తీసుకోవచ్చు. ఇందుకు ఉత్తమ ఎంపిక టాప్-అప్ ప్లాన్. ఉదాహరణకు, స్టార్ సూపర్ సర్‌ప్లస్ పాలసీ 1 కోటి కవరేజీని 3 లక్షల వరకు నిర్వచించిన పరిమితితో అందిస్తుంది, ఇది చాలా తక్కువ ఖరీదైనది మరియు సరసమైనదిగా ఉంటుంది.

మెడికల్ ఇన్సూరెన్స్ కింద, ఆసుపత్రి అనేది వివిధ వైద్య చికిత్సలను అందించే మరియు రోగిని జాగ్రత్తగా చూసుకోవడానికి వైద్య విధానాలను నిర్వహించే సంస్థను సూచిస్తుంది. ఒక ఆసుపత్రి ఇందుకు అర్హత పొందాలంటే, దానికి 24 గంటలూ అందుబాటులో ఉండే అర్హత కలిగిన వైద్య నిపుణులు ఉండాలి.


పట్టణాలలో  కనీస 15 మరియు గ్రామాల్లో  కనీస 10 పడకల  సంఖ్యను కలిగి ఉండి, 24/7 పని చేస్తూ, వార్డ్ బాయ్‌లు మరియు నర్సింగ్, ICU మరియు OT వంటి అన్ని సౌకర్యాలను కలిగి ఉండాలి, స్థానిక ప్రాధికార సంస్థ క్రింద ఆసుపత్రిగా నమోదు చేయబడాలి. ఇవి ఆసుపత్రికి కనీస అర్హతలు మాత్రమే.

నెట్‌వర్క్ హాస్పిటల్స్ అనేవి భారతదేశం అంతటా నగదు రహిత సౌకర్యాలను అందించడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందంలో పని చేసే ఆసుపత్రులు. నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రులు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందంలో పని చేయవు కాబట్టి, నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స సౌకర్యాలు పొందలేము. సమీప నెట్‌వర్క్ ఆసుపత్రిని గుర్తించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి చికిత్స గురించి ముందస్తు సమాచారం ఇస్తారు మరియు ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి స్వయంగా ఆసుపత్రికి ఖర్చులు చెల్లించి ఆ తేదీ నుండి 15 రోజులలోపు ఆ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేస్తారు.

  • రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల కోసం సమర్పించాల్సిన పత్రాలు.
  • సక్రమంగా పూర్తి చేసిన క్లెయిమ్ ఫారం.
  • ప్రవేశానికి ముందు పరిశోధనలు మరియు చికిత్స పత్రాలు.
  • ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ సమ్మరీ.
  • ఆసుపత్రులు మరియు కెమిస్ట్‌ల నుండి నగదు రసీదులు.
  • పరీక్షల నగదు రసీదులు మరియు రిపోర్ట్‌లు.
  • వైద్యులు, సర్జన్లు మరియు మత్తుమందు డాక్టర్ల నుండి రసీదులు.
  • రోగ నిర్ధారణకు సంబంధించి మిమ్మల్ని చూసిన డాక్టర్ నుండి సర్టిఫికేట్. 
  • పాన్ కార్డ్ మరియు క్యాన్సిల్ చేసిన చెక్కు లేదా NEFT వివరాల కాపీ.

వివిధ కారణాల ఆధారంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వైద్యులు క్లెయిమ్‌ల ఆథరైజేషన్ కోసం చేసిన అభ్యర్థనను తిరస్కరించవచ్చు.
మీ క్లెయిమ్ తిరస్కరించబడటానికి ఈ క్రింది వంటి కారణాలు ఉన్నాయి:

  • ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో సమయాధారిత లేదా శాశ్వత మినహాయింపులు కలిగి యున్న అంశాల కొరకు చేసిన క్లెయిములు 
  • మెటీరియల్ వాస్తవాలు, బహిర్గతం చేయనప్పుడు/తప్పుగా తెలిపినప్పుడూ/మోసపూరితమైన క్లెయిమ్‌లు చేసినప్పుడు 
  • మినహాయించబడిన ప్రొవైడర్ నుండి క్లెయిమ్‌లు (ప్రాణాపాయ పరిస్థితి/ ప్రమాదంలో మాత్రమే పరిస్థితి కుదుటపడే వరకు చెల్లించబడుతుంది.)
  • క్లెయిము కోసం అవసరమైన పత్రాలను సమర్పించడంలో మీరు విఫలమైతే

సాధారణ, ఆరు-దశల ప్రక్రియను అనుసరించి మా నెట్‌వర్క్ ఆసుపత్రులలో మీ నగదు రహిత సౌకర్యాన్ని పొందండి.

1.నెట్‌వర్క్ హాస్పిటల్‌లోని ఇన్సూరెన్స్ డెస్క్‌ని సంప్రదించి, సమాచారం కోసం అభ్యర్థించండి 
2. 044 6900 6900/ 044 4674 5800 కు మాకు కాల్ చేయడం ద్వారా,  support@stahealth.inకు ఈ-మెయిల్ చేయడం ద్వారా సమాచారం అందించవచ్చు: 
3. గుర్తింపు ధృవీకరణ కోసం మీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ID కార్డ్‌ను,  ప్రవేశానికి ముందు పరిశోధనలు మరియు వైద్యుల సంప్రదింపు పత్రాలను (ఏవైనా ఉంటే) హాస్పిటల్‌కు సమర్పించండి.
4. నెట్‌వర్క్ హాస్పిటల్‌లు మీ గుర్తింపును ధృవీకరించి స్టార్‌హెల్త్ 5కి సక్రమంగా పూరించిన ప్రీ-ఆథరైజేషన్ ఫారమ్‌ను సమర్పిస్తాయి. 
5. నిబంధనలు మరియు షరతుల ప్రకారం క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి ముందు సమర్పించిన అన్ని పత్రాలను మా వైద్యులు ధృవీకరిస్తారు. కేటాయించిన ఫీల్డ్ డాక్టర్ ఆసుపత్రిలో రోగిని సందర్శించవచ్చు (ప్రాసెసింగ్ డాక్టర్ మరింత సమాచారం పొందాలని భావిస్తే మరియు ఫీల్డ్ సందర్శన అవసరం పడితే మాత్రమే).
6. డిశ్చార్జ్ అయిన తర్వాత, హాస్పిటల్ కంపెనీకి క్లెయిమ్ పత్రాలను పంపుతుంది మరియు మంజూరైన మొత్తం నేరుగా హాస్పిటల్‌కు సెటిల్ చేయబడుతుంది

గమనిక: ఆమోదించబడిన మొత్తానికి మరియు అసలు ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని ఇన్సూరెన్స్ పొందుకున్న వ్యక్తి భరించాలి.

హెల్త్ కార్డ్ అనేది పాలసీదారులకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ జారీ చేసే గుర్తింపు కార్డు లాంటిది. ఇందులో పాలసీదారు పేరు, పుట్టిన తేదీ, పాలసీ నంబర్ మరియు పాలసీ పేరు వంటి సమాచారం ఉంటుంది. నగదు రహిత చికిత్స సౌకర్యాన్ని పొందేందుకు, మీరు నెట్‌వర్క్ హాస్పిటల్‌లో మీ హెల్త్ కార్డ్‌ని అందించాలి.

అవును, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద చెల్లించిన ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. ఈ మినహాయింపు తన కుటుంబం మరియు తనపై ఆధారపడిన పిల్లలను కవర్ చేసే వ్యక్తికి రూ. 25,000 వరకు ఉంటుంది.

ప్రపోజర్ 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తన తల్లిదండ్రులను వైద్య బీమా కింద కవర్ చేయాలని భావిస్తే, వారు సెక్షన్ 80డి కింద మరో రూ. 25,000 తగ్గింపుకు అర్హుత పొందుతారు. కవర్ చేయాల్సిన తల్లిదండ్రుల వయస్సు 60 ఏళ్లు పైబడి ఉంటే, అదే సెక్షన్ కింద మినహాయింపు రూ. 50,000 లభిస్తుంది. 60 ఏళ్లు పైబడిన ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకే పాలసీ కింద ఇన్సూరెన్స్ చేయబడితే, మినహాయించదగిన పన్ను మొత్తం రూ.లక్ష వరకు ఉంటుంది

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కింద ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అనేది ప్రొడక్ట్/ప్లాన్ నిర్దిష్టంగా ఉంటుంది. ఆరోగ్య పాలసీని కొనుగోలు చేసే ముందు, అవసరాల గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి మా పాలసీ షరతులను చూడండి.

అవును. అయితే, పాలసీ వ్యవధి కాలంలో భారతదేశంలోని ఆసుపత్రులలో తీసుకున్న చికిత్సల కోసం ఇన్సూరెన్స్ చేసినవారు మాత్రమే క్లెయిమ్‌లు చేయగలరు

ఖచ్చితంగా. స్టార్ హెల్త్ ఔట్ పేషెంట్ చికిత్సల కోసం కవరేజీని అందించే అనేక ప్లాన్‌లను అందిస్తుంది. ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్, డేకేర్ విధానాలు, ఔట్ పేషెంట్ సంప్రదింపులు, చికిత్సలు మొదలైన వాటి నుండి మీకు విస్తృతమైన కవరేజీని అందించడానికి రూపొందించబడిన స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని మేము సిఫార్సు చేస్తున్నాము. OP సంరక్షణలో మీ ప్రత్యేక అవసరాల కోసం స్టార్ అవుట్ పేషెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా మేము సిఫార్సు చేస్తున్నాము. దయచేసి మా విధానాల గురించి మరింత తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

తీసుకోవచ్చు. రోగ నిర్ధారణ అయిన ఏదైనా వ్యాధి/అనారోగ్యం లేదా చికిత్సను బహిర్గతం చేయాలి, అది ముందుగా ఉన్న వ్యాధిగా పరిగణించబడుతుంది  మరియు తర్వాత తేదీలో ఏదైనా క్లెయిమ్ చేసినప్పుడు వారికి సహాయపడుతుంది.
కస్టమర్ అవసరాలను తీర్చడానికి మాకు వివిధ ఎంపికలు ఉన్నాయి.

ఎంపిక 1: ప్రామాణిక పాలసీ కింద ముందుగా ఉన్న వ్యాధులకు (డయాబెటిస్ మెల్లిటస్/హైపర్‌టెన్షన్) వెయిటింగ్ పిరియడ్ మారుతూ ఉంటుంది,  అదిఎంచుకున్న ప్రోడక్ట్‌లు/ప్లాన్ ఆధారంగా 48/36/12 నెలల వంటి నిర్దిష్ట వ్యవధి తర్వాత కవర్ చేయబడుతుంది.

ఎంపిక 2: మధుమేహం కోసం మాత్రమే రూపొందించబడిన వినూత్న పోడక్ట్ మధుమేహం సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది మధుమేహ చరిత్ర కలిగిన వ్యక్తులను కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ కేవలం మధుమేహ సమస్యలను మాత్రమే కాకుండా మధుమేహ -యేతర సమస్యలకు కూడా వర్తిస్తుంది. డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి డయాబెటిస్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీని సందర్శించండి.

అవును, 75 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి అందించబడింది. సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేకంగా 60 మరియు 75 సంవత్సరాల వయస్సులో ఉన్న వృద్ధులకు / వారికి జీవితకాల పునరుద్ధరణ ఎంపికతో పాటు కవర్ చేయడానికి రూపొందించబడింది. ఈ పాలసీలోని అన్ని క్లెయిమ్‌లకు నామమాత్రపు సహ చెల్లింపు 30% వర్తిస్తుంది. అన్నింటికంటే, ముందుగా ఉన్న వ్యాధులు మరియు వాటి సమస్యలు సుమారు 12 నెలల వ్యవధి తర్వాత కవర్ చేయబడతాయి

తీసుకోవచ్చు. తల్లిదండ్రులు ప్రపోజర్ అయితే 3 ఏళ్ళ పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్  తీసుకోవచ్చు.

అవును, భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ పొందవచ్చు. అయితే, కవరేజ్ భారతదేశంలో నిర్వహించబడే చికిత్సలకు మాత్రమే లభిస్తుంది

ముందుగానే ప్రణాళిక చేసుకున్న సర్జరీకి, హాస్పిటల్‌లో చేరడానికి ముందుగానే హాస్పిటల్‌ను సంప్రదించి పూర్తిగా నింపిన ప్రీ ఆథరైజేష్ ఫారం‌ను ఇన్సూరెన్స్ సంస్థకు పంపించాలి. ముందుగా ప్రణాళిక చేసుకుని చేయించుకునే సర్జరీల విషయంలో 7 నుండి 10 రోజులు ముందుగానే ఆ విషయాన్ని తెలియజేయవచ్చు.

అవును. హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తర్వాత అయ్యే ఖర్చులను పరిగణించి, ఎక్కువ శాతం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆ ఖర్చులను కవర్ చేస్తాయి. అయితే అట్టి ఖర్చులకు అందించ్బడే కవర్ అనేద్ పాలసీ క్లాజులో పేర్కొన్నట్లు హాస్పిటలైజేషన్‌కు ముందు మరిఉయ్ తర్వాత నిర్దిష్ట రోజుల వరకు మాత్రమే పరిమితం చేయబడుతుంది

ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో మరియు మహమ్మారి పరిస్థితుల్లో వ్యక్తులను భౌతికంగా కలవడం ఎంతో ప్రమాదకరమైనది. కాబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం చక్కటి ఎంపిక. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో కొన్నప్పుడు, మీరు నేరుగా ఇన్సూరెన్స్ సంస్థతోనే లావాదేవీ నెరుపుతారు. మీరు మీకున్న సందేహాలను వారిని అడిగి అధికారికంగా వాటికి పరిష్కారాలను పొందడం ద్వారా తాజా సమాచారాన్ని పొందవచ్చు. మీ మొదటి కొనుగోలుపై 5% ప్రీమియం డిస్కౌంట్ ప్రయోజనాన్ని కూడా ఆస్వాదించవచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనడం ద్వారా కలిగే మరొక గొప్ప ప్రయోజనమేమిటంటే లావాదేవీ త్వరగా పూర్తయి మీకు సమయం ఆదా అవుతుంది. 

ప్రస్తుతం, కస్టమర్లు హెల్- ఇన్సూరెన్స్ ప్రీమియంలను నెలవారీయా, నాలుగు నెలలకోసారు, అర్ద సంవత్సరానికోసారి, సంవత్సరానికోసారి వాయిదాల రూపంలో చెల్లించే ఎంపికలను కలిగి ఉన్నారు.

నగదు రహిత హాస్పిటలైజేషన్ వలన ఆసుపత్రి ఖర్చులు చెల్లించడం గురించి ఆందోళన చెందకుండా ఆసుపత్రి సేవలను ఉపయోగించుకోవచ్చు. బీమా సంస్థ మీ బీమా పాలసీ ప్రకారం ఖర్చులను చెల్లించడానికి నేరుగా ఆసుపత్రితో కలిసి పని చేస్తుంది. నగదు రహిత హాస్పిటలైజేషన్ అనేది ప్లాన్డ్ మరియు అన్‌ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్‌లు రెండింటికీ వర్తిస్తుంది. ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ సమయంలో మీరు హాస్పిటల్‌కు వెళ్ళడానికి ముందే నగదు రహిత హాస్పిటలైజేషన్ కోసం మీ బీమా సంస్థకు ఒక అభ్యర్ధనను అందజేస్తారు. అన్‌ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ సందర్భంలో అయితే మీరు హాస్పిటల్‌లో చేరిన తర్వాత బీమా సంస్థను సంప్రదించవచ్చు. బీమా పాలసీ నిబంధన ప్రకారం, బీమా కంపెనీ ప్లాన్డ్ మరియు ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ రెండింటికీ కవరేజీని అందిస్తుంది.

ఆరోగ్య బీమా పథకాలు
Disclaimer:

Health Insurance Coverage for pre-existing medical conditions is subject to underwriting review and may involve additional requirements, loadings, or exclusions. Please disclose your medical history in the proposal form for a personalised assessment. 
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in