Star Health Logo

స్టార్ ఎక్స్‌ట్రా ప్రొటెక్ట్ - యాడ్ ఆన్ కవర్

We have the answer to your happy and secure future

IRDAI UIN: SHAHLIA23061V012223

ముఖ్యాంశాలు

ప్లాన్ ఎసెన్షియల్స్

essentials

యాడ్ ఆన్ కవర్

ఈ కవర్ మీ ప్రస్తుత పాలసీ పరిమితులను పెంచుతుంది. దీన్ని బేస్ పాలసీని ప్రారంభించిన సమయంలో లేదా రెన్యువల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.
essentials

అర్హత

ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్ / స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ / మెడి క్లాసిక్ ఇన్సూరెన్స్ పాలసీ (వ్యక్తిగతం) కనీస బీమా మొత్తం రూ. 10,00,000/- కింద కవర్ చేయబడిన పాలసీదారులు, ఈ యాడ్ ఆన్ కవర్‌ని పొందవచ్చు.
essentials

పాలసీ టర్మ్

ఈ యాడ్ ఆన్ కవర్ యొక్క పాలసీ టర్మ్ ఎంచుకున్న బేస్ పాలసీకి సమానంగా ఉంటుంది.
essentials

వయస్సు & కుటుంబ పరిమాణం

ఈ యాడ్ ఆన్ కవర్ ప్రవేశ వయస్సు మరియు కుటుంబ పరిమాణం ఎంచుకున్న బేస్ పాలసీకి సమానంగా ఉంటాయి.
వివరణాత్మక జాబితా

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

విభాగం I

పెంచబడిన రూమ్ రెంట్

పాలసీ నిబంధనలో పేర్కొన్న పరిమితుల ప్రకారం రూమ్, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులను ఈ కవర్ పెంచుతుంది.

క్లెయిమ్ గార్డ్ (వైద్యేతర వస్తువులకు కవరేజ్)

బేస్ పాలసీ కింద ఆమోదయోగ్యమైన క్లెయిమ్ ఉన్నట్లయితే, ఈ యాడ్ ఆన్ కవర్‌లో పేర్కొన్న నాన్-మెడికల్ వస్తువులకు అయ్యే ఖర్చులు చెల్లించబడతాయి.

ఆధునిక చికిత్సల కోసం మెరుగైన పరిమితి

పాలసీ క్లాజ్‌లో ఇవ్వబడిన ఆధునిక చికిత్సలు బేస్ పాలసీలో కవర్ చేయబడితే, అటువంటి చికిత్సలు ప్రాథమిక పాలసీ యొక్క బీమా మొత్తం వరకు కవర్ చేయబడతాయి.

ఆయుష్ చికిత్స కోసం మెరుగైన పరిమితి

ఆయుష్ చికిత్స కోసం మెరుగైన పరిమితిఆయుష్ ఆసుపత్రులలో ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి విధానాలలో చికిత్స కోసం ఇన్-పేషెంట్ ఆసుపత్రి ఖర్చులు బేస్ పాలసీ యొక్క బీమా మొత్తం వరకు కవర్ చేయబడతాయి.

గృహ సంరక్షణ చికిత్స

పాలసీ నిబంధనలో పేర్కొన్న విధంగా నిర్దిష్ట పరిస్థితులకు గృహ సంరక్షణ చికిత్సపై అయ్యే ఖర్చులు పాలసీ సంవత్సరంలో గరిష్టంగా రూ. రూ. 5,00,000/-లకు మించకుండా బేస్ పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ లో 10% దాకా కవర్ చేయబడుతాయి.

బోనస్ గార్డ్

1) బేస్ పాలసీ కింద మంజూరు చేయబడిన క్యుములేటివ్ బోనస్ గనుక ఉపయోగించబడకపోతే రెన్యువల్ సమయంలో ఆ బోనస్ తగ్గించబడదు. 2) బీమా చేయబడిన మొత్తాన్ని పూర్తిగా వినియోగించుకున్నప్పుడు మరియు క్యుములేటివ్ బోనస్‌ని ఏమాత్రం ఉపయోగించుకోనప్పుడు, రెన్యువల్ సమయంలో బేస్ పాలసీ కింద మంజూరు చేయబడిన క్యుములేటివ్ బోనస్ తగ్గించబడదు. 3) బీమా చేయబడిన మొత్తాన్ని పూర్తిగా వినియోగించుకున్నప్పుడు మరియు క్యుములేటివ్ బోనస్ ను పాక్షికంగా వినియోగించుకున్నప్పుడు రెన్యువల్ సమయంలో బేస్ పాలసీ కింద మంజూరు చేయబడిన క్యుములేటివ్ బోనస్ బ్యాలెన్స్ అనేది లభ్యం కాగల క్యుములేటివ్ బోనస్‌గానే ఉంటుంది. 4) బీమా చేయబడిన మొత్తం మరియు క్యుములేటివ్ బోనస్ లను పూర్తిగా వినియోగించుకున్నప్పుడు, రెన్యువల్ సందర్భంలో, బేస్ పాలసీ కింద మంజూరు చేయబడిన క్యుములేటివ్ బోనస్ ఇక ఏమీ ఉండదు.

విభాగం II

మొత్తం తగ్గింపును ఎంచుకోవడానికి ఎంపిక

బీమా చేయబడిన వ్యక్తి పాలసీ నిబంధనలో పేర్కొనబడిన ఏదైనా మినహాయింపును ఎంచుకుంటే ప్రీమియంపై తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

star-health
వెల్నెస్ ప్రోగ్రామ్
మా వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డ్‌లను పొందండి. రిన్యూవల్ తగ్గింపులను పొందడానికి ఆ రివార్డ్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.
star-health
స్టార్‌తో మాట్లాడండి
ఫోన్, చాట్ లేదా వీడియో కాల్ ద్వారా మా నిపుణులైన వైద్యులతో ఉచిత సంప్రదింపులను పొందడానికి 7676 905 905కు డయల్ చేయండి.
star-health
COVID-19 హెల్ప్‌లైన్
8 AM మరియు 10 PM మధ్య మా ఆరోగ్య నిపుణులతో ఉచిత COVID-19 సంప్రదింపులు పొందండి. 7676 905 905కు కాల్ చేయండి.
star-health
డయాగ్నస్టిక్ సెంటర్లు
ల్యాబ్ శాంపిల్స్‌ను ఇంటి వద్దే పికప్ చేసుకోవడం మరియు ఇంటి వద్దే ఆరోగ్య పరీక్షలు పొందటంతో భారతదేశం అంతటా 1,635 డయాగ్నస్టిక్ సెంటర్‌లకు యాక్సెస్ పొందండి.
star-health
ఇ-ఫార్మసీ
రాయితీ ధరతో ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయండి. 2780 నగరాల్లో హోమ్ డెలివరీ మరియు స్టోర్ పికప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మా కస్టమర్‌లు

' సంతోషంగా బీమా చేయబడ్డాం!' స్టార్ హెల్త్‌తో

మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి
ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us

మరింత సమాచారం కావాలా?

Get Insured

మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?