ఉచిత లుక్ వ్యవధి
ప్రియమైన కస్టమర్ కు
బీమా పాలసీని తీసుకున్నందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్‌ని ఎంచుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు. పాలసీ "ఫ్రీ లుక్ పీరియడ్" షరతుకు లోబడి ఉంటుందని దయచేసి గమనించండి. ఈ నిబంధన ప్రకారం, పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించడానికి మీకు పాలసీ అందిన తేదీ నుండి 15 రోజుల ఫ్రీ లుక్ వ్యవధి అందుబాటులో ఉంటుంది. మీరు నిబంధనలు మరియు షరతులతో సంతృప్తి చెందకపోతే, మీరు పాలసీని రద్దు చేయమని కోరవచ్చు మరియు అటువంటి సందర్భంలో, ఇలాంటి రద్దు జరిగే వరకూ, ఎటువంటి క్లెయిమ్ చేయబడకుంటే,. ఏదైనా ప్రీ-యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్ ఖర్చు, , స్టాంప్ డ్యూటీ ఛార్జీలను, బీమా రక్షణ ఉన్న కాలానికి తగిన రిస్క్ ప్రీమియంను సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించిన ప్రీమియంను వాపసుచేస్తాం.
దీనికి సంబంధించి ఒక నమూనా దరఖాస్తు ఫామ్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది, మీరు గనుక రద్దును ఎంచుకుంటే ఈ ఫామ్ ను ఉపయోగించుకోవచ్చు.
పునరుద్ధరణలకు ఫ్రీ లుక్ క్యాన్సిలేషన్ ఆప్షన్ వర్తించదు.
ధన్యవాదాలతో,
మీ విధేయులు
అధీకృత సంతకందారు