Star Health Logo

మా గురించి

అవలోకనం

మేము భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన స్టార్ హెల్త్ & ఆలీడ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. మా ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది, మేము 2006లో భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర ఆరోగ్య బీమా ప్రొవైడర్‌గా మా కార్యకలాపాలను ప్రారంభించాము. నేడు, దేశవ్యాప్తంగా 14,000 నెట్‌వర్క్ ఆసుపత్రులు, 835 బ్రాంచ్ కార్యాలయాలు, 6.30 లక్షలకు పైగా ఏజెంట్లు మరియు రూ. 30,300 కోట్లకు పైగా చెల్లింపు క్లెయిమ్‌లతో, మేము నిజంగా దేశానికి ఆరోగ్య బీమా ప్రదాతలుగా గుర్తించబడుతున్నాం.


14,750 మంది ఉద్యోగులతో, మేము భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాదాలు మరియు విదేశీ & దేశీయ ప్రయాణ బీమాలో వినూత్న సేవలు మరియు ఉత్పత్తులను అందిస్తున్నాము. ఎంతో సునిశితంగా రూపొందించిన బీమా పాలసీలతో, మేము ప్రజల ప్రత్యేక ఆరోగ్య అవసరాలను తీర్చడాన్ని కొనసాగిస్తున్నాము. ప్రారంభం అయిన దగ్గరి నుండి 17 కోట్ల మందికి పైగా లైఫ్ ఇన్సూరెన్స్ అందించిన మేము, మరిన్ని జీవితాలను ఆరోగ్య బీమా కింద కవర్ చేసేలా మా సేవలను పెంచుతున్నాము. 


హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ అయినందున, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సహాయం అందేలా మేము చూసుకుంటాము. మా ప్రత్యేకంగా కేటాయించబడిన అంతర్గత క్లెయిమ్ సెటిల్‌మెంట్ టీమ్ ప్రతి గంటకు రూ.నాలుగు కోట్ల కంటే ఎక్కువ క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేసిన అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది.


మేము వ్యక్తుల నుండి కుటుంబాలు మరియు కార్పొరేట్ల వరకు ప్రతి మార్కెట్ రంగానికి ఉత్పత్తులను అందిస్తాము. కొత్త తరం కంపెనీగా, మేము సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చడానికి డిజిటల్, అగ్రిగేటర్లు, బ్రోకర్లు మొదలైన వాటితో సహా వివిధ ఛానెల్‌ల ద్వారా నేరుగా పనిచేస్తాము. మేము బ్యాంకాస్యూరెన్స్ రంగంలో కూడా అగ్రగామిగా ఉన్నాము మరియు అనేక బ్యాంకులతో దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాము.


స్పెషలిస్ట్ ప్రోడక్ట్‌లు మరియు హెల్త్ ఇన్సూరెన్స్‌ల విస్తృత ఎంపికను అందించడంతో పాటుగా, మేము మా నిపుణుల బృందంలోని అంతర్గత వైద్యులతో ఉచిత టెలిహెల్త్ సంప్రదింపులను అందిస్తాము, అలాగే అవసరమైతే ఉచితంగా రెండవ వైద్య అభిప్రాయాన్ని కూడా అందిస్తాము. మేము ప్రాథమిక సంరక్షణ, నిపుణుల సిఫార్సు, ద్వితీయ అభిప్రాయాలు మరియు నిర్ణయ మద్దతుపై దృష్టి సారించే 8 లక్షల సంప్రదింపులను ఇప్పటివరకు పూర్తి చేసాము. 


మా అత్యంత ముఖ్యమైన అంశం మా కస్టమర్ సేవ మరియు మేము అందించే అనుభవం. మాకు 24x7 పనిచేసే బహుభాషా కాల్ సెంటర్ ఉంది, ఇది క్లెయిమ్‌ల సహాయానికి ప్రత్యేకం చేయబడింది. అదనంగా, కస్టమర్లు ఎటువంటి TPA (థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్) లేకుండా అవాంతరాలు లేని అంతర్గత క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ నుండి ప్రయోజనం పొందవచ్చు.


ఈ డిజిటల్‌ ప్రపంచంలో, మా కస్టమర్‌లందరికీ సేవ యొక్క నాణ్యత, ప్రాప్యత సౌలభ్యం మరియు జంజాటం లేని వినియోగదారు అనుభవానికి హామీ ఇవ్వడానికి మేము వినూత్న సాంకేతికతలతో డిజిటల్‌గా రూపాంతరం చెందడం ద్వారా ప్రస్తుత ట్రెండ్‌లకు అనుగుణంగా మమ్ములను మేము రూపొందించుకున్నాం.