ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ఈ పాలసీకి ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేదు. అయితే, 65 ఏళ్లు పైబడిన వారు మరియు ప్రతికూల వైద్య చరిత్ర ఉన్నవారు ECG, ఫాస్టింగ్ & పోస్ట్‌ప్రాండియల్ బ్లడ్ షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్ ప్రొఫైల్ మరియు యూరిన్ స్ట్రిప్ టెస్ట్ ప్లాన్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. |
ప్రవేశ వయస్సు6 నెలల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి భారతదేశంలో నివసిస్తున్న ఎవరైనా సెలవు లేదా వ్యాపార పర్యటన కోసం భారతదేశం వెలుపల ప్రయాణించాలనుకునే వారు ఈ పాలసీని పొందవచ్చు. |
ప్లాన్ ఎంపికలుఈ పాలసీ USA మరియు కెనడాతో సహా ప్రపంచవ్యాప్త అన్ని ప్రయాణాలకు కవర్‌ని అందిస్తుంది. |
ట్రిప్ బ్యాండ్ఈ పాలసీ రెండు ట్రిప్ బ్యాండ్ ఎంపికల కింద కవర్ అందిస్తుంది - 30 రోజులు మరియు 45 రోజుల బ్యాండ్. |
వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో ఖాళీ చేయాల్సివచ్చినప్పుడుఈ పాలసీ వైద్య నిపుణుడి సలహా మేరకు బీమా చేయబడిన వ్యక్తి యొక్క అత్యవసర వైద్య తరలింపు కోసం కవర్ అందిస్తుంది. ఇది సంబంధిత రవాణా మరియు వైద్య చికిత్స ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. |
ట్రిప్ పొడిగింపుకు కవర్బీమా చేయబడిన వ్యక్తి పాలసీ చివరి రోజు నాటికి భారతదేశం వెలుపల ప్రయాణిస్తున్నట్లయితే, పాలసీ గడువు తేదీ నుండి 30 లేదా 45 రోజుల వ్యవధిలో పర్యటన పూర్తయ్యే వరకు లేదా బీమా చేయబడిన వ్యక్తి భారతదేశానికి తిరిగి వచ్చే వరకు పాలసీ స్వయంచాలకంగా పొడిగించబడుతుంది. |
డెంటల్ ఎమర్జెన్సీ కవర్ఈ పాలసీ అనేది పాలసీ క్లాజ్‌లో పేర్కొన్న పరిమితుల వరకు పర్యటన సమయంలో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే దంత సమస్యలకు చికిత్స చేయడానికి తీవ్రమైన మత్తుమందు చికిత్సకు అయ్యే ఖర్చులను అందిస్తుంది. |
ప్రయాణ అసౌకర్యాలకు కవర్ఈ పాలసీ ఫ్లైట్ ఆలస్యం, ట్రిప్ రద్దు, పాస్‌పోర్ట్ కోల్పోవడం, చెక్-ఇన్ బ్యాగేజీని కోల్పోవడం లేదా ఆలస్యం కావడం, ఫ్లైట్ మిస్ అవ్వడం/కనెక్షన్ మిస్ అవ్వడం మరియు హైజాక్ అవ్వడం వంటి ప్రయాణ అసౌకర్యాల వల్ల కలిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. |
పాస్‌పోర్ట్ పోగొట్టుకొన్నపుడుట్రిప్ సమయంలో బీమా చేయబడిన వ్యక్తి అతని/ఆమె పాస్‌పోర్ట్‌ను కోల్పోతే, స్వదేశానికి తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ లేదా చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను పొందడంలో అయ్యే ఖర్చులను కంపెనీ కవర్ చేస్తుంది. |
హైజాక్ అవ్వడం వలన కలిగే అసౌకర్యంబీమా చేయబడిన వ్యక్తి ప్రయాణిస్తున్న సాధారణ క్యారియర్ హైజాక్ చేయబడి, ట్రిప్‌కు 12 గంటల కంటే ఎక్కువ సమయం పాటు అంతరాయం ఏర్పడితే, కంపెనీ పేర్కొన్న పరిమితుల ప్రకారం ప్రతి రోజు ఆలస్యానికి సమానమైన భారతీయ రూపాయలను చెల్లిస్తుంది. |
చెక్ ఇన్ బ్యాగేజీ ఆలస్యం కావడంబీమా చేయబడిన వ్యక్తి యొక్క చెక్-ఇన్ బ్యాగేజీ పర్యటన సమయంలో 12 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంటే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిమితుల వరకు అట్టి ఆలస్యానికి కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. |
చెక్-ఇన్ బ్యాగేజీ నష్టానికి కవర్ఎయిర్లైన్ లేదా క్యారియర్ ద్వారా చెక్-ఇన్ బ్యాగేజీ (భీమా చేయబడిన వ్యక్తి యొక్క ఆస్తి) పోగొట్టుకున్నట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిమితుల వరకు బీమా చేయబడిన వ్యక్తికి కలిగిన నష్టాన్ని కంపెనీ భర్తీ చేస్తుంది. |
ఫ్లైట్ ఆలస్యంబీమా చేయబడిన వ్యక్తి యొక్క ఫ్లైట్ ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, కంపెనీ పేర్కొన్న పరిమితుల వరకు అదనపు వసతి, ప్రయాణం మరియు ఇతర సహేతుకమైన ఖర్చులను భర్తీ చేస్తుంది. |
ట్రిప్ రద్దు కావడం/అంతరాయం ఏర్పడటంబీమా చేయబడిన వ్యక్తి లేదా అతని/ఆమె కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రమాదవశాత్తు శారీరక గాయాలు లేదా మరణానికి గురికావడం కారణంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క పర్యటన రద్దు చేయబడితే, కంపెనీ అట్టి బీమా చేయబడిన వ్యక్తికి లేదా అతని/ఆమె చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశిత మొత్తం వరకు నష్టపరిహారం ఇస్తుంది. |
డిపార్చర్ /కనెక్షన్‌ను మిస్ అవ్వడంనిర్దేశిత కారణాల వల్ల బీమా చేయబడిన వ్యక్తి ముందుగా బుక్ చేసిన నిష్క్రమణ లేదా కనెక్షన్ ఫ్లైట్‌ను కోల్పోతే, సహేతుకమైన అదనపు వసతి మరియు ప్రయాణానికి అయ్యే ఖర్చులను కంపెనీ నష్టపరిహారంగా ఇస్తుంది. |
వ్యక్తిగత లయబిలిటీ కవర్బీమా చేయబడిన వ్యక్తి ఏదైనా వ్యక్తికి అనారోగ్యం/గాయం (ప్రాణాంతకం లేదా ప్రాణాంతకం కానిది) లేదా బీమా కాలంలో ఆస్తికి నష్టం వాటిల్లడానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తే, బీమా కంపెనీ అతను/ఆమెకు అయ్యే చట్టబద్ధంగా చెల్లించవలసిన మొత్తాలకు గానూ బీమా చేసిన వ్యక్తికి పరిహారం చెల్లిస్తుంది. |
వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ప్రమాదం కారణంగా బీమా చేయబడిన వ్యక్తి మరణించినా లేదా అంగవైకల్యానికి గురైనా, కంపెనీ బీమా చేయబడిన వ్యక్తికి లేదా అతని/ఆమె చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశిత పరిమితుల వరకు ఏకమొత్తాన్ని అందజేస్తుంది. |
శరీర భాగాలను బదిలీ చేయడానికిబీమా చేయబడిన వ్యక్తి విదేశాలలో మరణించిన సందర్భంలో, ఈ పాలసీ బీమా చేయబడిన వ్యక్తి యొక్క మృత దేహాలను తరలించడానికి కవరేజీని అందిస్తుంది లేదా మరణం సంభవించిన దేశంలో స్థానికంగా ఖననం లేదా దహన సంస్కారాలకు సమానమైన మొత్తాన్ని భర్తీ చేస్తుంది. |
ప్రత్యామ్నాయ ఉద్యోగి కోసం కవర్బీమా చేయబడిన ఉద్యోగి అనారోగ్యానికి గురైతే లేదా గాయపడినట్లయితే, బీమా చేయబడిన వ్యక్తి స్థానంలో ఒక ప్రత్యామ్నాయ ఉద్యోగిని పంపడం ద్వారా జరిగే ఏవైనా ప్రయాణ ఖర్చులకు ఈ పాలసీ కవర్ అందిస్తుంది. |
మినహాయింపుకు లోనయ్యేవిఈ పాలసీ మినహాయింపులకు లోబడి ఉంటుంది. ప్రతి క్లెయిమ్‌కు కంపెనీ చెల్లించాల్సిన బాధ్యతను కలిగిలేని మొత్తం అని దీని అర్థం. |
హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.
మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.
మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.