Star Health Logo

స్టార్ ట్రావెల్ ప్రొటెక్ట్ ఇన్సూరెన్స్ పాలసీ

We have the answer to your happy and secure future

*I hereby authorise Star Health Insurance to contact me. It will override my registry on the NCPR.

IRDAI UIN: IRDA/NL-HLT/SHAI/P-T/V.I/140/13-14

ముఖ్యాంశాలు

ప్లాన్ ఎసెన్షియల్స్

essentials

ప్లాన్ రకం

ఈ పాలసీని వ్యక్తిగత పాతిపదికన ఉపయోగించుకోవచ్చు.
essentials

ట్రావెల్ పాలసీ

ఈ పాలసీ ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు మరియు మీ ప్రయాణంలో లేదా విదేశాల్లో ఉండే సమయంలో కలిగే ప్రయాణ అసౌకర్యాల కారణంగా అయ్యే ఖర్చులకు కవర్ అందిస్తుంది.
essentials

విస్తృత కవరేజీ

ఈ పాలసీ విదేశాల్లో ఉన్నప్పుడు కలిగే అనారోగ్యం లేదా రుగ్మత కారణంగా అయ్యే వైద్య ఖర్చులకు కవర్ అందిస్తుంది. అదనంగా, బీమా చేయబడిన వ్యక్తి నివసించే దేశంలో అదే వ్యాధి లేదా అనారోగ్యానికి తగిన నిరంతర చికిత్సను కూడా ఇది కవర్ చేస్తుంది.
essentials

ప్రయాణ అసౌకర్యాలకు కవర్

ఈ పాలసీ ఫ్లైట్ ఆలస్యం, ట్రిప్ రద్దు, పాస్‌పోర్ట్ కోల్పోవడం, చెక్-ఇన్ బ్యాగేజీని కోల్పోవడం లేదా ఆలస్యం కావడం, ఫ్లైట్ మిస్ అవ్వడం/కనెక్షన్ మిస్ అవ్వడం మరియు హైజాక్ అవ్వడం వంటి ప్రయాణ అసౌకర్యాల వల్ల కలిగే నష్టాన్ని కవర్ చేస్తుంది.
వివరణాత్మక జాబితా

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

ముఖ్యమైన అంశాలు

ప్రవేశ వయస్సు

6 నెలల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి భారతదేశంలో నివసిస్తున్న ఎవరైనా సెలవు లేదా వ్యాపార పర్యటన కోసం భారతదేశం వెలుపల ప్రయాణించాలనుకునే వారు ఈ పాలసీని ఉపయోగించుకోవచ్చు.

పొడగించబడిన కవర్

ఈ పాలసీ 50% ప్రీమియం లోడింగ్‌తో 70 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులను కవర్ చేస్తుంది. 75 ఏళ్లు పైబడిన వ్యక్తులకు, ఈ పాలసీ 25% ప్రీమియం లోడింగ్‌తో గరిష్టంగా USD 10000/- వరకు ఎమర్జెన్సీ మెడికల్ సెక్షన్ కింద గరిష్ట కవరేజీని అందిస్తుంది.

అర్హత

భారతదేశంలో శాశ్వత నివాసి అయి, 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు.

ప్లాన్ ఎంపికలు

ఈ పాలసీ రెండు కవర్ ఆప్షన్‌లను అందిస్తుంది. USA & కెనడాకు ప్రయాణం చేయడం కోసం దీనిని పొందవచ్చు; మరియు USA & కెనడా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించవచ్చు.

సమ్ ఇన్‌‌ష్యూర్డ్ ఎంపికలు

ఈ పాలసీ రెండు ప్లాన్ ఎంపికల క్రింద నాలుగు సమ్ ఇన్సూర్డ్ పరిమితులను అందిస్తుంది. అవి USD 50,000/-, USD 100,000/-, USD 250,000/- మరియు USD 500,000/-.

ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్

ఈ పాలసీకి ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేదు. అయితే, 65 ఏళ్లు పైబడిన వారు మరియు ప్రతికూల వైద్య చరిత్ర ఉన్నవారు ECG, ఫాస్టింగ్ & పోస్ట్‌ప్రాండియల్ బ్లడ్ షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్ ప్రొఫైల్ మరియు యూరిన్ స్ట్రిప్ టెస్ట్ ప్లాన్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

అత్యవసర వైద్య ఖర్చుల కవర్

ఈ పాలసీ బీమా చేయబడిన వ్యక్తి విదేశాలలో ఉన్న సమయంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం అయ్యే ఖర్చులను భర్తీ చేస్తుంది.

వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో ఖాళీ చేయాల్సివచ్చినప్పుడు

ఈ పాలసీ వైద్య నిపుణుడి సలహా మేరకు బీమా చేయబడిన వ్యక్తి యొక్క అత్యవసర వైద్య తరలింపు కోసం కవర్ అందిస్తుంది. ఇది సంబంధిత రవాణా మరియు వైద్య చికిత్స ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.

వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్

ప్రమాదం కారణంగా బీమా చేయబడిన వ్యక్తి మరణించినా లేదా అంగవైకల్యానికి గురైనా, కంపెనీ బీమా చేయబడిన వ్యక్తికి లేదా అతని/ఆమె చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశిత పరిమితుల వరకు ఏకమొత్తాన్ని అందజేస్తుంది.

డెంటల్ ఎమర్జెన్సీ కవర్

ఈ పాలసీ అనేది పర్యటన సమయంలో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే దంత సమస్యలకు చికిత్స చేయడానికి తీవ్రమైన మత్తుమందు చికిత్సకు అయ్యే ఖర్చులను అందిస్తుంది.

మృతశరీరాన్ని స్వదేశానికి చేర్చడం

బీమా చేయబడిన వ్యక్తి విదేశాలలో మరణించిన సందర్భంలో, ఈ పాలసీ బీమా చేయబడిన వ్యక్తి యొక్క మృత దేహాలను తరలించడానికి కవరేజీని అందిస్తుంది లేదా మరణం సంభవించిన దేశంలో స్థానికంగా ఖననం లేదా దహన సంస్కారాలకు సమానమైన మొత్తాన్ని భర్తీ చేస్తుంది.

మినహాయింపుకు లోనయ్యేవి

ఈ పాలసీ మినహాయింపులకు లోబడి ఉంటుంది. ప్రతి క్లెయిమ్‌కు కంపెనీ చెల్లించాల్సిన బాధ్యతను కలిగిలేని మొత్తం అని దీని అర్థం.

చెక్-ఇన్ బ్యాగేజీ నష్టానికి కవర్

ఎయిర్‌లైన్ లేదా క్యారియర్ ద్వారా చెక్-ఇన్ బ్యాగేజీ (భీమా చేయబడిన వ్యక్తి యొక్క ఆస్తి) పోగొట్టుకున్నట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిమితుల వరకు బీమా చేయబడిన వ్యక్తికి కలిగిన నష్టాన్ని కంపెనీ భర్తీ చేస్తుంది.

పాస్‌పోర్ట్ పోగొట్టుకొన్నపుడు

ట్రిప్ సమయంలో బీమా చేయబడిన వ్యక్తి అతని/ఆమె పాస్‌పోర్ట్‌ను కోల్పోతే, స్వదేశానికి తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ లేదా చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను పొందడంలో అయ్యే ఖర్చులను కంపెనీ కవర్ చేస్తుంది.

చెక్ ఇన్ బ్యాగేజీ ఆలస్యం కావడం

బీమా చేయబడిన వ్యక్తి యొక్క చెక్-ఇన్ బ్యాగేజీ పర్యటన సమయంలో 12 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంటే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిమితుల వరకు అట్టి ఆలస్యానికి కంపెనీ పరిహారం చెల్లిస్తుంది.

ఫ్లైట్ ఆలస్యం

బీమా చేయబడిన వ్యక్తి యొక్క ఫ్లైట్ ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, కంపెనీ పేర్కొన్న పరిమితుల వరకు అదనపు వసతి, ప్రయాణం మరియు ఇతర సహేతుకమైన ఖర్చులను భర్తీ చేస్తుంది.

డిపార్చర్ /కనెక్షన్‌ను మిస్ అవ్వడం

నిర్దేశిత కారణాల వల్ల బీమా చేయబడిన వ్యక్తి ముందుగా బుక్ చేసిన నిష్క్రమణ లేదా కనెక్షన్ ఫ్లైట్‌ను కోల్పోతే, సహేతుకమైన అదనపు వసతి మరియు ప్రయాణానికి అయ్యే ఖర్చులను కంపెనీ నష్టపరిహారంగా ఇస్తుంది.

ట్రిప్ రద్దు కావడం/అంతరాయం ఏర్పడటం

బీమా చేయబడిన వ్యక్తి లేదా అతని/ఆమె కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రమాదవశాత్తు శారీరక గాయాలు లేదా మరణానికి గురికావడం కారణంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క పర్యటన రద్దు చేయబడితే, కంపెనీ అట్టి బీమా చేయబడిన వ్యక్తికి లేదా అతని/ఆమె చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశిత మొత్తం వరకు నష్టపరిహారం ఇస్తుంది.

వ్యక్తిగత లయబిలిటీ కవర్

బీమా చేయబడిన వ్యక్తి ఏదైనా వ్యక్తికి అనారోగ్యం/గాయం (ప్రాణాంతకం లేదా ప్రాణాంతకం కానిది) లేదా బీమా కాలంలో ఆస్తికి నష్టం వాటిల్లడానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తే, బీమా కంపెనీ అతను/ఆమెకు అయ్యే చట్టబద్ధంగా చెల్లించవలసిన మొత్తాలకు గానూ నిర్దేశిత పరిమితుల వరకు బీమా పొందిన వ్యక్తికి పరిహారం చెల్లిస్తుంది.

హైజాక్ అవ్వడం వలన కలిగే అసౌకర్యం

బీమా చేయబడిన వ్యక్తి ప్రయాణిస్తున్న సాధారణ క్యారియర్ హైజాక్ చేయబడి, ట్రిప్‌కు 12 గంటల కంటే ఎక్కువ సమయం పాటు అంతరాయం ఏర్పడితే, కంపెనీ పేర్కొన్న పరిమితుల ప్రకారం ప్రతి రోజు ఆలస్యానికి సమానమైన భారతీయ రూపాయలను చెల్లిస్తుంది.
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

star-health
వెల్నెస్ ప్రోగ్రామ్
మా వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డ్‌లను పొందండి. రిన్యూవల్ తగ్గింపులను పొందడానికి ఆ రివార్డ్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.
star-health
స్టార్‌తో మాట్లాడండి
ఫోన్, చాట్ లేదా వీడియో కాల్ ద్వారా మా నిపుణులైన వైద్యులతో ఉచిత సంప్రదింపులను పొందడానికి 7676 905 905కు డయల్ చేయండి.
star-health
COVID-19 హెల్ప్‌లైన్
8 AM మరియు 10 PM మధ్య మా ఆరోగ్య నిపుణులతో ఉచిత COVID-19 సంప్రదింపులు పొందండి. 7676 905 905కు కాల్ చేయండి.
star-health
డయాగ్నస్టిక్ సెంటర్లు
ల్యాబ్ శాంపిల్స్‌ను ఇంటి వద్దే పికప్ చేసుకోవడం మరియు ఇంటి వద్దే ఆరోగ్య పరీక్షలు పొందటంతో భారతదేశం అంతటా 1,635 డయాగ్నస్టిక్ సెంటర్‌లకు యాక్సెస్ పొందండి.
star-health
ఇ-ఫార్మసీ
రాయితీ ధరతో ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయండి. 2780 నగరాల్లో హోమ్ డెలివరీ మరియు స్టోర్ పికప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మా కస్టమర్‌లు

' సంతోషంగా బీమా చేయబడ్డాం!' స్టార్ హెల్త్‌తో

మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి
ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us

మరింత సమాచారం కావాలా?