Star Health Logo

యాక్సిడెంట్ కేర్ ఇండివిడ్యువల్ ఇన్సూరెన్స్ పాలసీ

We have the answer to your happy and secure future

IRDAI UIN: IRDAI/HLT/SHAI/P-P/V.III/134/2017-18

ముఖ్యాంశాలు

ప్లాన్ ఎసెన్షియల్స్

essentials

ప్రవేశ వయస్సు

18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు. బీమా చేయబడిన వ్యక్తిపై ఆధారపడిన 5 నెలల నుండి 25 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు కవర్ చేయబడతారు.
essentials

పాలసీ రకం

ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ కింద బీమా చేయబడిన వారి జీవిత భాగస్వామి మరియు ఆధారపడిన పిల్లలు కవర్ చేయబడతారు.
essentials

ప్రీమియం డిస్కౌంట్

కుటుంబ ప్రాతిపదికన పాలసీని ఎంచుకుంటే ప్రీమియంపై 10% తగ్గింపు లభిస్తుంది.
essentials

ఆన్‌లైన్ డిస్కౌంట్

పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ప్రీమియంపై 5% తగ్గింపు లభిస్తుంది.
వివరణాత్మక జాబితా

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

ముఖ్యమైన అంశాలు

సమ్ ఇన్‌‌ష్యూర్డ్

ఈ పాలసీ యొక్క కనీస సమ్ ఇన్సూర్డ్ రూ.1,00,000/- మరియు దీనిని రూ.10,000/- గుణకాలలో పెంచుకోవచ్చు. బీమా పొందిన వ్యక్తి యొక్క సంపాదన సామర్థ్యాన్ని బట్టి గరిష్ట సమ్ ఇన్సూర్డ్ మారుతుంది.

పాలసీ ప్రయోజనం

టేబుల్ A - ప్రమాద మరణానికి కవర్ అందిస్తుంది. టేబుల్ B - ప్రమాదవశాత్తు మరణం మరియు శాశ్వత వైకల్యం జరిగిన సందర్భంలో కవర్ అందిస్తుంది. టేబుల్ C - ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం మరియు తాత్కాలిక పూర్తి వైకల్యాలకు కవర్ అందిస్తుంది.

ప్రమాదపు మరణం

ఈ పాలసీ బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో సంచిత బోనస్‌తో పాటు 100% సమ్ ఇన్సూర్డ్‌ను అందిస్తుంది.

శాశ్వత పూర్తి వైకల్యం

ప్రమాదం కారణంగా బీమా చేయబడిన వ్యక్తి శాశ్వతంగా వైకల్యానికి గురైతే, ఈ పాలసీ బీమా చేయబడిన మొత్తంలో 150% సంచిత బోనస్‌తో పాటు (100% సమ్ ఇన్సూర్డ్‌పై మాత్రమే లెక్కించబడుతుంది) అందిస్తుంది.

శాశ్వత పాక్షిక వైకల్యం

ప్రమాదవశాత్తూ గాయపడిన తర్వాత శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలో పాలసీ నిబంధనలో పేర్కొన్న విధంగా ఈ పాలసీ సమ్ ఇన్సూర్డ్‌లో నిర్దిష్ట శాతాన్ని అందిస్తుంది.

తాత్కాలిక పూర్తి వైకల్యం

ఈ పాలసీ కేవలం ప్రమాదాల కారణంగా బీమా పొందిన వ్యక్తి తీవ్రంగా గాయపడి తాత్కాలిక వైకల్యానికి దారి తీసిన సందర్భంలో పూర్తయిన ఒక వారానికి రూ.15,000/- (వారానికి) మించకుండా 100 వారాల వరకు టేబుల్ C కింద పేర్కొన్న సమ్ ఇన్సూర్డ్‌లో 1% అందిస్తుంది.

టేబుల్ A,B & C ల క్రింద అదనపు ప్రయోజనాలు

ఎడ్యుకేషనల్ గ్రాంట్

ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో లేదా బీమా చేయబడిన వ్యక్తికి శాశ్వత పూర్తి వైకల్యం సంభవించినప్పుడు, బీమా చేసిన వారిపై ఆధారపడిన గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఎడ్యుకేషనల్ గ్రాంట్ అందించబడుతుంది. I) ఇద్దరు ఆధారపడిన పిల్లల వరకు, బిడ్డకు గరిష్టంగా రూ.10,000/- చొప్పున అందించబడుతుంది, II) 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఒకరి కంటే ఎక్కువ ఆధారపడిన పిల్లల విషయంలో, బిడ్డకు రూ.10,000/- చొప్పున మొత్తం రూ.20,000/- కంటే ఎక్కువ చెల్లించబడదు.

అంబులెన్స్ ఛార్జీలు / మృతదేహ రవాణా

బీమా చేయబడిన వ్యక్తి నివాస స్థలానికి వెలుపల జరిగే ప్రమాదాల కారణంగా చేసిన ఆమోదయోగ్యమైన క్లెయిమ్ విషయంలో, ఈ పాలసీ ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్స్ ఛార్జీల కోసం లేదా బీమా చేయబడిన వ్యక్తి యొక్క మృత దేహాలను అతని/ఆమె నివాసానికి తరలించడానికి గరిష్టంగా రూ.5,000/- వరకు కొంత ఏకమొత్తాన్ని అందిస్తుంది.

ఒక బంధువుకు ప్రయాణ ఖర్చులు

బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భంలో, భీమాదారుని నివాసానికి ఒక బంధువు ప్రయాణం చేయడానికి సంస్థ బీమా మొత్తంలో 1%, గరిష్టంగా రూ.50,000/- వరకు (వాస్తవానికి లోబడి) అందిస్తుంది.

వాహనం / నివాస మార్పు

ప్రమాద ఫలితంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క భారతదేశంలోని నివాస వసతి లేదా వాహనాన్ని సవరించాల్సి వచ్చి, అట్టి అవసరత వైద్యునిచే ధృవీకరించబడితే, అట్టి మారులు చేయడానికయ్యే ఖర్చులు సమ్ ఇన్సూర్డ్‌లో 10%, గరిష్టంగా రూ.50,000/- వరకు కవర్ చేయబడతాయి (టేబుల్ B మరియు Cల క్రింద).

రక్తాన్ని కొనుగోలు చేయడం

ఈ పాలసీ బీమా చేయబడిన వ్యక్తి యొక్క వైద్య లేదా శస్త్రచికిత్స చికిత్స కోసం రక్తాన్ని కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చులకు, సమ్ ఇన్సూర్డ్‌తో పాటు సమ్ ఇన్సూర్డ్‌లో 5%, లేదా గరిష్టంగా రూ.10,000/- (ఏది తక్కువైతే అంత వరకు) అందిస్తుంది.

ఇంపోర్టెడ్ ఔషధాల రవాణా

భారతదేశానికి ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి సరుకు రవాణా ఛార్జీలపై అయ్యే ఖర్చుల కోసం గరిష్టంగా రూ.20,000/-కి లోబడి సమ్ ఇన్సూర్డ్‌లో 5%ను ఈ పాలసీ అందిస్తుంది.

సంచిత బోనస్

సంచిత బోనస్ అనేది ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి సమ్ ఇన్సూర్డ్‌లో 5% వరకు మొత్తంగా అయితే గరిష్టంగా సమ్ ఇన్సూర్డ్ యొక్క 50% వరకు అందించబడుతుంది.

ఐచ్ఛిక ప్రయోజనం

వైద్య ఖర్చుల పొడిగింపు

ఇన్-పేషెంట్ మరియు అవుట్ పేషెంట్‌కు అయ్యే వైద్య ఖర్చులు చెల్లుబాటు అయ్యే క్లెయిమ్‌లో 25% లేదా మొత్తం సమ్ ఇన్సూర్డ్‌లో 10% లేదా అసలు ఎంతైతే అంతవరకు (ఏది తక్కువైతే అంత వరకు), పాలసీ వ్యవధికి మొత్తంగా రూ.5,00,000/- పరిమితికి లోబడి చెల్లించబడుతుంది.

శీతాకాల క్రీడల కవరేజీ

బీమా చేయబడిన వ్యక్తి అటువంటి క్రీడలలో పాల్గొనడానికి ప్రతిపాదించిన కాలానికి ఈ పొడిగింపు మంజూరు చేయబడుతుంది.

హాస్పిటల్ క్యాష్

ప్రమాదం జరిగిన తేదీ నుండి 30 రోజులలోపు ఆసుపత్రిలో చేరినప్పుడు ఆసుపత్రిలో గడిపిన ప్రతి రోజుకు రూ.1000/- నగదు ప్రయోజనం అందించబడుతుంది. ఈ ప్రయోజనం ఒక పర్యాయానికి గరిష్టంగా 15 రోజులు మరియు పాలసీ వ్యవధికి 60 రోజులు అందించబడుతుంది.

గృహము వద్ద కోలుకునే సందర్భంలో

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత సదరు బీమాదారుని నివాసంలో ఒక అటెండర్‌కు అయ్యే ఖర్చులు, వైద్య చేస్తున్న వైద్యుని సలహా మేరకు ఒక పర్యాయానికి గరిష్టంగా 15 రోజులు చొప్పున, లాగే పాలసీ కాలంలో అయితే మొత్తంగా 60 రోజులకు గానూ పూర్తయిన ప్రతి రోజుకి రూ.500/- వరకు కవర్ చేయబడతాయి.
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

star-health
వెల్నెస్ ప్రోగ్రామ్
మా వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నందుకు రివార్డ్‌లను పొందండి. రిన్యూవల్ తగ్గింపులను పొందడానికి ఆ రివార్డ్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.
star-health
స్టార్‌తో మాట్లాడండి
ఫోన్, చాట్ లేదా వీడియో కాల్ ద్వారా మా నిపుణులైన వైద్యులతో ఉచిత సంప్రదింపులను పొందడానికి 7676 905 905కు డయల్ చేయండి.
star-health
COVID-19 హెల్ప్‌లైన్
8 AM మరియు 10 PM మధ్య మా ఆరోగ్య నిపుణులతో ఉచిత COVID-19 సంప్రదింపులు పొందండి. 7676 905 905కు కాల్ చేయండి.
star-health
డయాగ్నస్టిక్ సెంటర్లు
ల్యాబ్ శాంపిల్స్‌ను ఇంటి వద్దే పికప్ చేసుకోవడం మరియు ఇంటి వద్దే ఆరోగ్య పరీక్షలు పొందటంతో భారతదేశం అంతటా 1,635 డయాగ్నస్టిక్ సెంటర్‌లకు యాక్సెస్ పొందండి.
star-health
ఇ-ఫార్మసీ
రాయితీ ధరతో ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయండి. 2780 నగరాల్లో హోమ్ డెలివరీ మరియు స్టోర్ పికప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మా కస్టమర్‌లు

' సంతోషంగా బీమా చేయబడ్డాం!' స్టార్ హెల్త్‌తో

మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి
ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us

మరింత సమాచారం కావాలా?

Get Insured

మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?