పాలసీ టర్మ్‌పాలసీ 1 సం. వ్యవధికి లభిస్తుంది. |
పాలసీ రకంఈ పాలసీ వ్యక్తిగత ప్రాతిపదికన మాత్రమే ప్రయోజనాలను అందిస్తుంది. |
ప్రమాదపు మరణంప్రమాదం జరిగిన తేదీ నుండి 12 నెలలలోపు బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భంలో ఈ పాలసీ 100% సమ్ ఇన్సూర్డ్‌ను అందిస్తుంది. |
శాశ్వత పూర్తి వైకల్యంప్రమాదం జరిగిన తేదీ నుండి 12 నెలలలోపు బీమా చేయబడిన వ్యక్తి శాశ్వతంగా వైకల్యం చెందితే, ఈ పాలసీ 100% సమ్ ఇన్సూర్డ్‌ను అందిస్తుంది. |
శాశ్వత పాక్షిక వైకల్యంప్రమాదం జరిగిన తేదీ నుండి 12 నెలలలోపు ప్రమాదవశాత్తు గాయాలు సంభవించి శాశ్వత పాక్షిక అంగవైకల్యం సంభవించినప్పుడు పాలసీ నిబంధనలో పేర్కొన్న విధంగా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్దిష్ట శాతాన్ని ఈ పాలసీ అందిస్తుంది. |
తాత్కాలిక పూర్తి వైకల్యంఈ పాలసీ అనేది బీమా చేయబడిన వ్యక్తి కేవలం ప్రమాదాల కారణంగా తీవ్రంగా గాయపడి తాత్కాలిక పూర్తి వైకల్యానికి దారితీసిన సందర్భంలో ఈ పాలసీలో పేర్కొన్న విధంగా ప్రయోజనాలను అందిస్తుంది. |
ప్రమాదాల కారణంగా అయ్యే హాస్పిటలైజేషన్ ఖర్చులుప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరడానికి అయ్యే వైద్య ఖర్చులు సమ్ ఇన్సూర్డ్‌లో 10% వరకు కవర్ చేయబడతాయి. |
ఎడ్యుకేషనల్ గ్రాంట్బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భంలో లేదా శాశ్వతంగా పూర్తిగా అంగవైకల్యానికి గురైతే, బీమా చేయబడిన వ్యక్తిపై ఆధారపడిన పిల్లల కోసం సమ్ ఇన్సూర్డ్‌లో 10% ఒక-పర్యాయ ఎడ్యుకేషనల్ గ్రాంట్‌గా అందించబడుతుంది. |
హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.
మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.