
ఫ్యామిలీ యాక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ
IRDAI UIN: SHAHLIP21042V012021
HIGHLIGHTS
Plan Essentials
ఫ్లోటర్ పాలసీ
ప్రమాదాల కారణంగా తలెత్తే ఆర్థిక నష్టభయాల నుండి మీ కుటుంబాన్ని కవర్ చేయడానికి ఫ్లోటర్ పాలసీ.
పాలసీ టర్మ్
పాలసీని 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలానికి ఎంచుకోవచ్చు.
ప్రవేశ వయస్సు
16 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు. ఆధారపడిన పిల్లలు 25 సంవత్సరాల వయస్సు వరకు పాలసీని కొనసాగించవచ్చు అదే పెద్దలైతే జీవితాంతం కొనసాగించవచ్చు.
సమ్ ఇన్ష్యూర్డ్
ఈ పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ కనీసం రూ.1,00,000/- మరియు గరిష్టంగా రూ.50,00,000/- (రూ.50,000/- గుణిజాలలో) ఉంటుంది.
Detailed List
Understand what’s included
ముఖ్యమైన అంశాలు
ప్రమాదంలో మరణించినప్పుడు ఏకమొత్తంప్రమాదం జరిగిన తేదీ నుండి 12 క్యాలెండర్ నెలల్లోపు బీమా చేయబడిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో పాలసీలో పేర్కొన్న విధంగా ఈ పాలసీ 100% సమ్ ఇన్సూర్డ్ను అందిస్తుంది. |
శాశ్వత పూర్తి వైకల్యంప్రమాదం జరిగిన తేదీ నుండి 12 క్యాలెండర్ నెలల్లోపు బీమా చేయబడిన వ్యక్తి శాశ్వత పూర్తి వైకల్యానికి గురైన సందర్భంలో పాలసీలో పేర్కొన్న విధంగా ఈ పాలసీ 100% సమ్ ఇన్సూర్డ్ను అందిస్తుంది. |
ప్రీమియం రేటు (2 పెద్దలు + 3 పిల్లల వరకు కుటుంబ పరిమాణంతో సంబంధం లేకుండా)1 సంవత్సరం పాలసీకి ప్రీమియం లక్షకు రూ.75/- (GST మినహా) మరియు 2-సంవత్సరాల పాలసీకి లక్షకు రూ.145/- (GST మినహా)గా ఉంటుంది |
జీవిత కాల రిన్యూవల్ఈ పాలసీ జీవితకాల రెన్యూవల్ ఎంపికను అందిస్తుంది. |
సాధారణ నిబంధనలు
పాలసీని ప్రారంభించే సమయంలో, పాలసీ నిబంధనలు మరియు షరతులను సమీక్షించడానికి, ఒకవేళ అవి ఆమోదయోగ్యం కానట్లయితే పాలసీని తిరిగి ఇవ్వడానికి పాలసీని అందుకున్న తేదీ నుండి 15 రోజుల వరకు బీమా చేయబడిన వ్యక్తికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో, ప్రీమియం వాపసు క్రింది విధంగా ఉంటుంది:
ఫ్రీ లుక్ వ్యవధిలో బీమా చేసిన వ్యక్తి ఎలాంటి క్లెయిమ్ చేయకుంటే, బీమా చేసిన వ్యక్తికి -
1. బీమా చేయబడిన వ్యక్తుల యొక్క వైద్య పరీక్ష మరియు స్టాంప్ డ్యూటీ ఛార్జీల కోసం బీమా సంస్థ చేసే ఖర్చులను మినహాయించి చెల్లించిన ప్రీమియం యొక్క వాపసు
లేదా
2. రిస్క్ ఇప్పటికే ప్రారంభమై, పాలసీని తిరిగి ఇచ్చే ఎంపికను పాలసీ హోల్డర్ ఉపయోగించినట్లయితే, పాలసీ వర్తించే కాలానికి దామాషా పద్ధతిలో రిస్క్ ప్రీమియంలో తగ్గింపు
లేదా
3. బీమా కవరేజీలో కొంత భాగం మాత్రమే ప్రారంభమైతే, ఆ వ్యవధిలో బీమా కవరేజీకి దామాషా ప్రీమియం సరిపోతుంది.
రెన్యూవల్ సమయంలో ఫ్రీ లుక్ వ్యవధి వర్తించదు

Health Insurance Coverage for pre-existing medical conditions is subject to underwriting review and may involve additional requirements, loadings, or exclusions. Please disclose your medical history in the proposal form for a personalised assessment.
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in



