పాలసీ టర్మ్ఈ పాలసీ 365 రోజుల పాటు కవరేజీని అందిస్తుంది. పాలసీ గడువు ముగిసేలోపు బీమా చేసిన వ్యక్తి యొక్క అభ్యర్థనపై దీనిని మరో 365 రోజులకు ఒకసారి పొడిగించవచ్చు. |
ప్రయాణ అసౌకర్యాలకు కవర్ఈ పాలసీ ఫ్లైట్ ఆలస్యం, ట్రిప్ రద్దు, పాస్‌పోర్ట్ కోల్పోవడం, చెక్-ఇన్ బ్యాగేజీని కోల్పోవడం లేదా ఆలస్యం కావడం, ఫ్లైట్ మిస్ అవ్వడం/కనెక్షన్ మిస్ అవ్వడం మరియు హైజాక్ అవ్వడం వంటి ప్రయాణ అసౌకర్యాల వల్ల కలిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. |
అత్యవసర వైద్య ఖర్చుల కవర్ఈ పాలసీ బీమా చేయబడిన వ్యక్తి విదేశాలలో ఉన్న సమయంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం అయ్యే ఖర్చులను భర్తీ చేస్తుంది. |
వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో ఖాళీ చేయాల్సివచ్చినప్పుడుఈ పాలసీ వైద్య నిపుణుడి సలహా మేరకు బీమా చేయబడిన వ్యక్తి యొక్క అత్యవసర వైద్య తరలింపు కోసం కవర్ అందిస్తుంది. ఇది సంబంధిత రవాణా మరియు వైద్య చికిత్స ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. |
మృతశరీరాన్ని స్వదేశానికి చేర్చడంబీమా చేయబడిన వ్యక్తి విదేశాలలో మరణించిన సందర్భంలో, ఈ పాలసీ బీమా చేయబడిన వ్యక్తి యొక్క మృత దేహాలను తరలించడానికి కవరేజీని అందిస్తుంది లేదా మరణం సంభవించిన దేశంలో స్థానికంగా ఖననం లేదా దహన సంస్కారాలకు సమానమైన మొత్తాన్ని భర్తీ చేస్తుంది. |
డెంటల్ ఎమర్జెన్సీ కవర్ఈ పాలసీ అనేది పర్యటన సమయంలో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే దంత సమస్యలకు చికిత్స చేయడానికి తీవ్రమైన మత్తుమందు చికిత్సకు అయ్యే ఖర్చులను అందిస్తుంది. |
వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ప్రమాదం కారణంగా బీమా చేయబడిన వ్యక్తి మరణించినా లేదా అంగవైకల్యానికి గురైనా, కంపెనీ బీమా చేయబడిన వ్యక్తికి లేదా అతని/ఆమె చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశిత పరిమితుల వరకు ఏకమొత్తాన్ని అందజేస్తుంది. |
చెక్-ఇన్ బ్యాగేజీ నష్టానికి కవర్ఎయిర్లైన్ లేదా క్యారియర్ ద్వారా చెక్-ఇన్ బ్యాగేజీ (భీమా చేయబడిన వ్యక్తి యొక్క ఆస్తి) పోగొట్టుకున్నట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న పరిమితుల వరకు బీమా చేయబడిన వ్యక్తికి కలిగిన నష్టాన్ని కంపెనీ భర్తీ చేస్తుంది. |
పాస్‌పోర్ట్ పోగొట్టుకొన్నపుడుట్రిప్ సమయంలో బీమా చేయబడిన వ్యక్తి అతని/ఆమె పాస్‌పోర్ట్‌ను కోల్పోతే, స్వదేశానికి తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ లేదా చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను పొందడంలో అయ్యే ఖర్చులను కంపెనీ కవర్ చేస్తుంది. |
వ్యక్తిగత లయబిలిటీ కవర్బీమా చేయబడిన వ్యక్తి ఏదైనా వ్యక్తికి అనారోగ్యం/గాయం (ప్రాణాంతకం లేదా ప్రాణాంతకం కానిది) లేదా బీమా కాలంలో ఆస్తికి నష్టం వాటిల్లడానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తే, బీమా కంపెనీ అతను/ఆమెకు అయ్యే చట్టబద్ధంగా చెల్లించవలసిన మొత్తాలకు గానూ బీమా చేసిన వ్యక్తికి పరిహారం చెల్లిస్తుంది. |
బెయిల్ బాండ్ప్రపోజల్ ఫారమ్‌లో పేర్కొన్న ప్రదేశంలో పోలీసులు లేదా న్యాయ అధికారులు బీమా పొందిన వ్యక్తిని తప్పుగా అరెస్టు చేసిన లేదా తప్పుగా నిర్బంధించిన సందర్భంలో, బీమా కంపెనీ బెయిల్ బాండ్ యొక్క ఖరీదుకై నిర్దేశిత బీమా మొత్తం వరకు చెల్లిస్తుంది. |
కారుణ్య సందర్శనబీమా చేయబడిన వ్యక్తి వరుసగా 7 రోజులకు మించి విదేశాల్లో ఆసుపత్రిలో చేరి, స్వదేశానికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుంటే, బీమా చేయబడిన వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్ళే తక్షణ కుటుంబ సభ్యునికి విమాన/రైలులో ఒక రౌండ్ ట్రిప్ కోసం అయ్యే ఖర్చులను కంపెనీ భరిస్తుంది. |
ఆరోగ్య సమస్యల కారణంగా చదువుకు అంతరాయం కలిగితేగాయం, అనారోగ్యం లేదా టెర్మినల్ సిక్‌నెస్ కారణంగా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వరుసగా ఒకటి కంటే ఎక్కువ నెలలు ఆసుపత్రిలో చేరిన సందర్భంలో అతని/ఆమె చదువును ఆపివేసినట్లయితే, కంపెనీ ఇప్పటికే చెల్లించిన ట్యూషన్ ఫీజును భర్తీ చేస్తుంది. |
కుటుంబంలోని అత్యవసర పరిస్థితుల కారణంగా చదువుకు అంతరాయం కలిగితేమొత్తం పాలసీ వ్యవధిలో ఎవరైనా తక్షణ కుటుంబ సభ్యులు లేదా స్పాన్సర్ ప్రమాదవశాత్తు మరణించిన కారణంగా బీమా చేయబడిన వ్యక్తి యొక్క చదువుకు అంతరాయం కలిగితే, కంపెనీ ఇప్పటికే చెల్లించిన ట్యూషన్ ఫీజును భర్తీ చేస్తుంది. |
స్పాన్సర్ ప్రొటెక్షన్బీమా చేయబడిన వ్యక్తి యొక్క స్పాన్సర్ ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భంలో, మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత, కంపెనీ నిర్దేశిత పరిమితుల వరకు బీమా చేసిన వారి చ్దువు యొక్క మిగిలిన కాలానికి చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లిస్తుంది. |
హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.
మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.
మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.