12 పాలు యొక్క శక్తి వంతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health Insurance Plans starting at Rs.15/day*

Health Insurance Plans starting at Rs.15/day*

పరిచయం

పాలు భారతీయ ఆహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న  తెల్లటి ద్రవం. పిల్లలు మరియు పెద్దలు ఇద్దరినీ సంతృప్తి పరచడానికి ఒక గ్లాసు పాలు సరిపోతుంది.

పాలు చాలా నిండుగా ఉంటాయి మరియు దీనిని ” ఒక  సంపూర్ణమైన  ఆహారం “గా సూచిస్తారు. దీనిని అలాగే నేరుగా  త్రాగవచ్చు  లేదా అనేక ఇతర వంటకాలకు అద్భుతమైన తోడుగా ఉంటుంది. చాలా మంది దీనిని ఉదయం పూట తాగితే, చాలా మంది వ్యక్తులు రాత్రికి రాత్రి పూట దీనిని త్రాగడానికి ఇష్టపడుతారు.

పాలలోని  పోషకాలు

పాలు మరియు పాల ఉత్పత్తులలో ప్రోటీన్, కొవ్వు  మరియు కార్బోహైడ్రేట్లు బాగా సమతుల్యంగా ఉంటాయి మరియు అవి అనేక ముఖ్యమైన పోషకాలకు ముఖ్యమైన మూలం, అవి క్రింది విధంగా ఉన్నాయి:

  • విటమిన్లు A మరియు B12
  • కాల్షియం
  • అయోడిన్
  • ఫాస్ఫరస్
  • పొటాషియం
  • జింక్ మరియు
  • మెగ్నీషియం

మానవ అవసరాలకు సరిపోయే అధిక – నాణ్యత గల ప్రోటీన్లు పాల ఉత్పత్తులలో కూడా ఉన్నాయి.  100 ml మొత్తం ఆవు పాలు 73 Kcal మరియు 3.2g ప్రొటీన్లను అందిస్తుంది.

పాల వల్ల కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది

రోగ నిరోధక శక్తిని పెంచడానికి పాలు తీసుకోవడం పెంచండి.  డైరీ మిల్క్ అనేది అధికంగా పోషకాలు ఉండే ఒక ఆహారం, అది రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు మరియు జింక్, విటమిన్ డి, విటమిన్ ఎ మరియు ప్రోటీన్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది.

పాలు చర్మానికి మేలు చేస్తాయి

పాల ఉత్పత్తులలో ఉండే ప్రొటీన్ వయసు పెరిగే కొద్దీ చర్మం మృదువుగా ఉండడానికి మద్దతుని ఇస్తాయి. రెటినోల్ అనబడే వృద్ధాప్యంతో పోరాడే మరియు చర్మాన్ని పునరుద్ధరించే ఒక ప్రసిద్ధ యాంటీ ఆక్సిడెంట్, పాలలో కూడా కనిపిస్తుంది.

పాల నుండి వచ్చే విటమిన్ డి దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు UV రక్షణ కారణంగా యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది.

డైరీకి మొటిమలతో ముడిపడి ఉన్న సుదీర్ఘ చరిత్ర ఉంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ అఫ్ డెర్మటాలజీ మొటిమలు మరియు పాలపై అధ్యయనాల సమీక్షను విడుదల చేసింది, ఇది చక్కెర మరియు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్న పాశ్చాత్య ఆహారం, మోటిమలు వెనుక ఉన్న దోషాలకు కారణంగా ఉండవచ్చు అని సూచనా చేసింది.

పాలు తాగడం ఎల్లప్పుడూ చర్మానికి మంచి ఆలోచన కానప్పటికీ, చర్మానికి మెరుపును ఇచ్చే అనేక ఇంట్లో తయారు చేసిన బ్యూటీ మాస్క్‌లలో ఇది తరచుగా కలపబడే  పదార్ధంగా ఉపయోగించ బడుతుంది.

పాలు సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు శుద్ధి చేసే ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. పాలను ఉపయోగించడం వల్ల చర్మం కూడా ప్రకాశవంతంగా మారవచ్చు.

జుట్టు కోసం ప్రయోజనాలు

 Casein మరియు whey, అనేవి పాలలోని రెండు ప్రొటీన్లు జుట్టును బలోపేతం చేయడంలో సహాయం చేస్తాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. పాలలోని విటమిన్ డి అనేది కొత్త హెయిర్ ఫోలికల్స్ అభివృద్ధిలో సహాయం చేస్తుంది.

బోలు ఎముకల వ్యాధి

మెనోపాజ్‌కు ముందు 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులలో మహిళలు ఇప్పటికీ ఎముక ద్రవ్య రాశిని పొందుతూ ఉంటారు. మెనోపాజ్‌తో వచ్చే ఎముకల క్షీణతకు సిద్ధంగా ఉండటానికి, ఆహారంలో తగినంత కాల్షియం పొందడం చాలా అవసరం. తగినంత కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకల నష్టాన్ని నివారించవచ్చు, ఎముకలను బలోపేతం చేయవచ్చు మరియు బోలు ఎముకల వ్యాధి మరియు పగుళ్లను కూడా నివారించవచ్చు.

హృదయ నాళ ఆరోగ్యం

పాలు తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. హార్ట్ ఫౌండేషన్ ప్రకారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విధానంలో భాగంగా వినియోగించినప్పుడు, పూర్తి కొవ్వు పాలు, పెరుగు మరియు చీజ్‌లు ఒక వ్యక్తికి ఇప్పటికే కరోనరీ హార్ట్ డిసీజ్ లేదా పెరిగిన కొలెస్ట్రాల్ ఉంటే తప్ప గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అవకాశం లేదు.

దంతాలను ఆరోగ్యవంతం చేస్తుంది

ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణకు మరియు పగుళ్లను నివారించడానికి కాల్షియం కీలకం అయినది. డైరీ మిల్క్‌ను ఎక్కువగా తాగడం మరియు జున్ను, పెరుగు మరియు ఇతర పాల ఉత్పత్తులను ఎక్కువగా తినడం అనేవి ఆహారంలో కాల్షియం తీసుకోవడం పెంచడానికి మార్గాలుగా ఉంటాయి.

నిరాశను ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది

సెరోటోనిన్, మానసిక స్థితి, ఆకలి మరియు నిద్రతో ముడిపడి ఉన్న రకమైన హార్మోన్, విటమిన్ డి స్థాయిలు తగినంతగా ఉన్నప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. శరీరంలో విటమిన్ డి లేకపోవడం అప్పుడప్పుడూ డిప్రెషన్‌లో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. పాలలో విటమిన్ డి సప్లిమెంట్లను జోడించడం వల్ల ఒకరి మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.

విటమిన్ డి మరియు సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి ఉదయం పూట సూర్యరశ్మిని పొందడం ఉత్తమ మార్గం. చేపలు, పాలు మరియు టోఫు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాల వినియోగాన్ని పెంచండి.

జీర్ణ క్రియకు తోడ్పడుతుంది

ఆహారం యొక్క ప్రయోజనాలను పెంచడానికి ఒక గొప్ప మార్గం గట్ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం. ప్రారంభం చేయడానికి ప్రతిరోజూ మూడు సేర్విన్గ్స్ డైరీని శ్వీకరించండి. డైరీలో జీర్ణ క్రియకు సహాయం చేసే  అనేక పోషకాలు ఉన్నాయి, వీటిలో జీవ క్రియను స్థిరీకరించడానికి సెలీనియం, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయం చేసే B విటమిన్లు మరియు కాల్షియం శోషణకు విటమిన్ D కూడా ఉన్నాయి.

గుండెల్లో మంటను నివారిస్తుంది

మన ఆహారంలో మనకు అలవాటు పడిన అనేక రకాల ప్రాథమికంగా ఆమ్ల మరియు మసాలా ఆహారాలు ఉంటాయి. ఇవి ఎసిడిటీ మరియు  ఉదర  సమస్యలకు కారణం అవుతాయి. ఇలాంటి పరిస్థితులకు గురి కాకుండా ఉండాలి అంటే కారంగా ఉండే భోజనం తర్వాత ఒక గ్లాసు పాలు తాగండి. అధ్యయనాల ప్రకారం, పాలు కడుపు లైనింగ్‌ను చల్ల బరుస్తుంది మరియు అన్నవాహికకు  గుండెల్లో మంట నుండి రక్షణ కల్పిస్తుంది.  

వ్యాయామం తర్వాత రికవరీ

పోస్ట్ – వర్కౌట్ రికవరీ కోసం, తక్కువ కొవ్వు గల చాక్లెట్ పాలు ఒక గొప్ప ఎంపిక. ఇది లీన్ కండరాన్ని అభివృద్ధి చేయడంలో సహాయం చేసే  అధిక – నాణ్యత గల  ప్రోటీన్ యొక్క సహజ మూలం, కండరాలను తిరిగి నింపడానికి ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటుంది మరియు శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సహాయం చేసే  ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్‌లను కూడా అందిస్తుంది.

శక్తిని పెంచుతుంది

డైరీ మిల్క్‌లో లాక్టోస్ ఉంటుంది, ఇది మనకు శక్తిని ఇచ్చే సహజంగా లభించే ఒక చక్కెర. మరొక అంశం ప్రోటీన్ కావచ్చు. ప్రొటీన్‌లు మనకు సంతృప్తిని కలిగిస్తాయి. ఇది షుగర్ క్రాష్‌లను నివారిస్తుంది, ఇది నేరుగా శక్తిని సరఫరా చేయడానికి సంబంధం లేదు.

గర్భం

డైరీ మిల్క్ యొక్క ప్రయోజనాలు పుట్టుకకు ముందే ప్రారంభం అవుతాయి. గర్భ ధారణ మరియు బాల్యంలో ఎముక మరియు మెదడు అభివృద్ధికి తోడ్పడే అయోడిన్, పాలలో లభించే 13 ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలలో ఒకటి. ఇది పిల్లల అభిజ్ఞా వికాసానికి కూడా సంబంధం కలిగి ఉంటుంది.

రుచి గల పాలు

చిన్న పిల్లలకు పాలు చాలా ముఖ్యమైన పోషక ఆహారం. శీతల పానీయాలు, రుచి గల నీరు మరియు పండ్ల పానీయాలతో సహా ఇతర చక్కెర – తీపి పానీయాల కంటే ఇది ఆరోగ్య కరమైన ఎంపిక.

ఒక టీ స్పూన్ చాక్లెట్ పౌడర్ వంటి తేలికపాటి సువాసనను ఇచ్చే పదార్థాలను  పాలలో చేర్చవచ్చు.

పాలు నుండి అలెర్జీ

50 మంది శిశువులలో ఒకరికి పాలు నుండి అలెర్జీ ఉంటుంది, ఇది లాక్టోస్ అసహనం నుండి భిన్నంగా ఉంటుంది మరియు ఇతర పాల ఉత్పత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. పెద్దలకు ఆవు పాలు అలెర్జీలు ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. మేకలు, గొర్రెలు మరియు గేదెలు వంటి ఇతర జంతువుల నుండి వచ్చే పాలు, ఆవు పాలకు అలెర్జీ ఉన్నవారిలో అలెర్జీ ప్రతి చర్యలకు కారణం అవుతాయి.

సాధారణంగా, పాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు ఒక వ్యక్తిలో అలెర్జీ సున్నితత్వాన్ని కలిగిస్తాయి. మేక పాలలోని ప్రోటీన్లు మరియు ఆవు పాలలోని ప్రోటీన్లు చాలా వరకు ఒకే పోలిక కలిగి ఉంటాయి కాబట్టి ఇది సాధారణంగా ఒక రకమైన పాల నుండి మరొక రకానికి మారడానికి సహాయం చేయదు.

పాలు అలెర్జీలు ఉన్న చాలా మంది పిల్లలు వయస్సు పెరిగేకొద్దీ వాటిని అధిగమించడం లేదా సహనం పెంచుకోవడం జరుగుతుంది. చాలా చిన్న వయస్సు పిల్లలలో పాలు అలెర్జీలు సాధారణంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

ఏ రకమైన పాలు ఉత్తమం?

మనం స్కిమ్, 1%, 2%, లేదా పూర్తి పాలు తీసుకోవాలా అనే విషయాన్ని కొన్ని కారకాలు నిర్ధారణ చేస్తాయి.

పాల కొవ్వు శాతం రుచి మరియు వ్యక్తిగత పోషక అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

పాల రుచిని ఆస్వాదించే వారికి పాలు తాగడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పాలలో ఎంత కొవ్వు ఉన్నా, అన్ని పాల ఉత్పత్తులు ఒకే విటమిన్ కూర్పును కలిగి ఉంటాయి. వారి రుచి ప్రాధాన్యతలకు సరిపోయే అత్యల్ప కొవ్వు ప్రత్యామ్నాయం తరచుగా మంచి ఎంపిక.

పాలు త్రాగడం కోసం ఉత్తమమైన సమయం

పెద్దలు పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు పాలు తాగాలి.

రాత్రి పూట పాల వినియోగం ‘ ఓజస్ ‘ను ప్రోత్సహిస్తుంది. మనకు మంచి జీర్ణ శక్తి ఉన్నప్పుడు, ఈ స్థితిని ఓజస్ అని అంటారు. పాలు నిద్రను ప్రోత్సహిస్తుంది మరియు ప్రశాంతమైన రాత్రి నిద్రలో సహాయం చేస్తుంది. చర్యలు తగ్గిపోవడం వల్ల శరీరం రాత్రి పూట చాలా కాల్షియంను పాల నుండి గ్రహిస్తుంది.

ఎంత పాలు తాగాలి?

మనం రోజూ 2 – 3 కప్పుల పాలను సులభంగా తాగగలిగినప్పటికీ, ఏదైనా అధికంగా తీసుకుంటే అది అనారోగ్య కరమని గుర్తు పెట్టుకోవాలి. పూర్తి క్రీమ్ కల పాలు  అయితే, దానిని 1 – 2 కప్పులకు పరిమితం చేయండి, దీని ఫలితంగా బరువు పెరుగుతారు.

మనం తక్కువ కొవ్వు గల పాలు త్రాగవచ్చు, కానీ మితంగా మాత్రమే.

పాలు తీసుకోవడానికి సరైన మార్గం

మనం పగటి పూట తీసుకుంటే వేడి లేదా చల్లటి పాలను పొందవచ్చు. రాత్రికి ముందు త్రాగేటప్పుడు ఎల్లప్పుడూ వెచ్చని లేదా గోరు వెచ్చని పాలు త్రాగాలని నిర్ధారణ చేసుకోండి. రాత్రి పూట చల్లటి పాలు తాగడం వల్ల కడుపులో ఇబ్బంది మరియు నిద్ర షెడ్యూల్ చెదిరిపోతుంది.

పాలను రుచిగా చేయడం ఎలా?

మామిడి పండ్లు, అరటి పండ్లు, సీతా ఫలాలు మరియు ఇతర పుల్లని పండ్లను పాలు లేదా పెరుగుతో కలపడం నిషేధించబడింది. ఇటువంటి పండ్లు పాలతో కలిపి జీర్ణశయాంతర పనితీరును తగ్గిస్తాయి, సైనస్, జలుబు, దగ్గు మరియు అలెర్జీ లక్షణాలకు దారితీసే టాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తాయి.

మనం కొన్ని సహజ రుచులు, స్వీటెనర్లు మరియు పసుపును జోడించవచ్చు. పిల్లలలో పిక్కీ తినేవారి కోసం పాలు రుచిని మెరుగు పరచడానికి చాక్లెట్ గ్రాన్యూల్స్ ఎంచుకోండి.

పాలకు ఉత్తమ ప్రత్యామ్నాయాలు

లాక్టోస్ అసహనం లేదా డైరీ అలెర్జీ ప్రజలను ప్రత్యామ్నాయ పాలకు అలవాటు పడేలా మారుస్తుంది. కొందరు పాల ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనదని వారు భావిస్తారు.

ప్రత్యామ్నాయ పాలలో బియ్యం, సోయా, బాదం మరియు వోట్ పాలు ఉన్నాయి. కాల్షియం మరియు విటమిన్ డి స్థాయిలు డైరీ మిల్క్ కంటే చాలా తక్కువగా కలిగి ఉంటాయి.

అదే మొత్తంలో ప్రోటీన్ కలిగి ఉన్న పాల ప్రత్యామ్నాయాలు సోయా మరియు బఠానీ పాలు మాత్రమే. అయితే, ఉత్తమ పాల ప్రత్యామ్నాయాలను ఎన్నుకునేటప్పుడు రుచి పరంగా ప్రాధాన్యత అమలులోకి వస్తుంది.

ముగింపు

పాలు అనేది మనల్ని ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లు భావింపచేసే ఒక ఆరోగ్యకరమైన ద్రవం. పాడి – రహిత మరియు ప్రత్యామ్నాయ ఎంపికల ప్రాశస్త్యం కారణంగా ఇటీవల పాలు యొక్క ప్రజాదరణ నాశనం అయింది. అయినప్పటికీ, పాలు పోషకాలు అధికంగా ఉండే ఒక ఆహారం, ఇది మొత్తం ఆరోగ్యాన్ని మరియు ఆహారాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

తొమ్మిది ముఖ్యమైన అంశాలు ఫాస్ఫరస్, B12, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ D, రిబోఫ్లావిన్, నియాసిన్ మరియు ప్రోటీన్లు పాలలో లభించే కొన్ని పోషకాలు, ఇది రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి అద్భుతమైన మార్గం.

తరచుగా అడిగే ప్రశ్నలు

పాలలో ఉండే 7 ప్రధాన పోషకాలు ఏమిటి ?

పాలలోని ప్రధాన పోషకాలు ఇలా ఉన్నాయి ,
1 · కాల్షియం
2· రిబోఫ్లావిన్
3 · ఫాస్ఫరస్.
4· విటమిన్ B12 మరియు A.
5 · పొటాషియం
6 · మెగ్నీషియం
7· జింక్.

పాలు యొక్క  ప్రధాన ప్రయోజనం ఏమిటి ?

పాలు విటమిన్లు మరియు ఖనిజాల యొక్క  అద్భుతమైన ఒక మూలం, ముఖ్యంగా కాల్షియం. ఎముకల ఆరోగ్యానికి ఇది  చాలా కీలకం.

పాలు ఎంత ప్రయోజనకరంగా ఉంటాయి ?

పాలు పొదుపుగా తీసుకోవాలి. రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం ఉత్తమ ఎంపిక. అధ్యయనం ప్రకారం, ప్రతి రోజూ రెండు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

పాలలో ఏ విటమిన్ లోపిస్తుంది ? 

పాలలో విటమిన్ సి ఉండదు, ఇది శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన విటమిన్.


DISCLAIMER: THIS BLOG/WEBSITE DOES NOT PROVIDE MEDICAL ADVICE

The Information including but not limited to text, graphics, images and other material contained on this blog are intended for education and awareness only. No material on this blog is intended to be a substitute for professional medical help including diagnosis or treatment. It is always advisable to consult medical professional before relying on the content. Neither the Author nor Star Health and Allied Insurance Co. Ltd accepts any responsibility for any potential risk to any visitor/reader.

Scroll to Top