ది హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్

ప్రసూతి ఆరోగ్య బీమా (మెటర్నిటీ హెల్త్ ఇన్సురెన్స్)

మీ డెలివరీ ఖర్చులు ఇందులో చేర్చబడుతాయి

... Read More

*By providing my details, I consent to receive assistance from Star Health regarding my purchases and services through any valid communication channel.

 

భారతదేశంలో ప్రసూతి ఆరోగ్య బీమా (మెటర్నిటీ హెల్త్ ఇన్సురెన్స్)

 

కొత్త తల్లితండ్రులుగా మారడం మరియు ప్రపంచంలోకి కొత్త జీవితాన్ని తీసుకురావడం అనేది ఆనందం, ఉల్లాసం మరియు ఉత్సాహంగా ఉంటుంది. "గొప్ప శక్తితో, గొప్ప బాధ్యత వస్తుంది" అనే ఉల్లేఖనం చెప్పినట్లే, తల్లిదండ్రులుగా మారడం కొత్త జీవితాన్ని చూసుకునే బాధ్యతను తెస్తుంది. ఇది జీవితంలో ఉత్తేజకరమైన దశ అయినప్పటికీ, అనిశ్చితులు ఏర్పడవచ్చు మరియు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం మంచిది.

 

పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం మరియు అమాంతం పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులు దంపతుల ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయని  గమనించాము. ఫలితంగా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రసూతి ఆరోగ్య బీమా (మెటర్నిటీ హెల్త్ ఇన్సురెన్స్) పాలసీలను అందిస్తుంది, కాబట్టి మీరు ఇకపై పెరుగుతున్న వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 

IRDAI ప్రకారంగా ఆసుపత్రిలో జరిగే సాధారణ లేదా సిజేరియన్ సెక్షన్‌తో సహా ప్రసూతి ఖర్చులు అనేవి గుర్తించదగిన వైద్య చికిత్స ఖర్చులు. పాలసీ వ్యవధిలో చట్టబద్ధంగా గర్భం తొలగించుకోవలనుకుంటే దానికి సంబంధించిన ఖర్చులు ఇందులో ఉంటాయి. 

 

పెరుగుతున్న ఖర్చులకు అనుకూలంగా ప్రసూతి ప్రయోజనాలు వైద్య పాలసీలో ఇమిడి ఉండటం అనేది అవసరం, ముఖ్యంగా ప్రసవానికి ముందు, వైద్యుల సందర్శన, ప్రసూతి, ప్రసవానంతర సంరక్షణ సమయాలలో.

 

ప్రసవ ప్రయోజనాలతో కూడిన వైద్య విధానం ప్రసవ సమయంలో తల్లి మరియు బిడ్డ రక్షించబడుతారని నిర్ధారిస్తుంది, ప్రత్యేకించి డెలివరీ సమయంలో మరియు పిల్లల జీవితం యొక్క ప్రారంభ రోజులలో ఏవైనా సమస్యలు తలెత్తితే.

 

మీ సాధారణ హెల్త్ ఇన్సూరెన్సులో భాగంగా ప్రసవ ఖర్చులు కలిగి ఉండటం ఎందుకు అవసరం?

 

ఐదేళ్ల వయస్సులోపు ఉన్న మొత్తం మరణాలలో దాదాపు 41% అప్పుడే పుట్టిన శిశువులు, మొదటి 28 రోజులలోపు శిశువులలో సంభవిస్తాయి అని WHO తను వెల్లడించిన నవజాత మరణం మరియు అనారోగ్య నివేదికలో పేర్కొంది.

 

సాధారణ మరియు C-సెక్షన్ ప్రసవాల సగటు ఖర్చు పెరుగుతుంది మరియు భారతదేశలలోని చాలా నగరాల్లో ₹ 2 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ అవుతుంది.

 

భారతదేశంలో ప్రసూతి ఆరోగ్య బీమా (మెటర్నిటీ హెల్త్ ఇన్సురెన్స్) పాలసీలు పరిమితంగా ఉన్నప్పటికీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క వ్యక్తిగత మరియు సహా-కుటుంబ పాలసీల యొక్క ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి, అవి ప్రసవ సమయంలో మరియు నవజాత శిశువు కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తాయి.

 

మీ భాగస్వామి లేదా మీ కుటుంబంలోని వారికి అయ్యే ప్రసవ ఖర్చులను కవర్ చేస్తూ మెడిక్లెయిమ్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక గోప్ప ఫీచర్. మీ హెల్త్ ఇన్సూరెన్సులో భాగంగా అందించబడిన ప్రసూతి కవర్ సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ ప్రసవం మరియు/లేదా ఏదైనా వైద్యపరమైన సమస్యల కారణంగా శిశువు ఆసుపత్రిలో చేరినపుడు వచ్చే ఖర్చులను కవర్ చేస్తుంది.

 

మీరు ప్రసవ ప్రయోజనాలతో కూడిన మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటున్న లేదా కుటుంబ పాలసీకి మారాలని చూస్తున్నా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ త్వరలో కాబోయే తల్లిదండ్రులకు సరైన మెడికల్ ఇన్సూరెన్స్‌ను అందజేస్తుంది మరియు వారికి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన గర్భాలను కలిగి ఉండటానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.

 

మనకు తెలిసినట్లుగా, బిడ్డను పొందడం అనేది సంతోషాలతో పాటుగా ఖర్చుతో కూడుకున్న విషయం. అలాగే, ఈ ఖర్చులు కొత్త తల్లిదండ్రుల ఆర్థిక మరియు శ్రేయస్సుపై అడ్డుగా ఏర్పడవచ్చు. 

 

అందువల్ల, గర్భధారణకు ముందే ప్రసూతి సంబంధిత ఖర్చులను కవర్ చేసే మెడికల్ ఇన్సూరెన్సు పాలసీని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం.

 

డెలివరీ ఖర్చులను కవర్ చేసే స్టార్ హెల్త్ పాలసీలు?

 

పాలసీ పేరుస్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సు పాలసీయంగ్ స్టార్ ఇన్సూరెన్సు పాలసీ (గోల్డ్ ప్లాన్)స్టార్ విమెన్ కేర్ ఇన్సూరెన్సు పాలసీసూపర్ సర్‌ప్లస్ ఇన్సూరెన్సు పాలసీ (గోల్డ్ ప్లాన్)స్టార్ సూపర్ సర్‌ప్లస్(ఫ్లోటర్) ఇన్సూరెన్సు పాలసీ (గోల్డ్ ప్లాన్)
ప్రవేశ వయస్సువయోజనులు18- 65 సంవత్సరాలు18- 40 సంవత్సరాలు18 - 75 సంవత్సరాలు18 - 65 సంవత్సరాలు18 - 65 సంవత్సరాలు
వ్యక్తిగతంగా ఆధారపడి ఉన్న సంతానం91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు91 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు
కుమార్తె 30 సంవత్సరాల వరకు అవివాహిత/సంపాదించకపోతే.
ఉత్పత్తి రకంవ్యక్తిగత / సహా-కుటుంబ (ఫ్లోటర్)వ్యక్తిగత / సహా-కుటుంబ (ఫ్లోటర్)వ్యక్తిగత / సహా-కుటుంబ (ఫ్లోటర్)వ్యక్తిగతసహా-కుటుంబ (ఫ్లోటర్)
పాలసీ కాల వ్యవధి1/2/3 - సంవత్సరాలు1/2/3 - సంవత్సరాలు1/2/3 - సంవత్సరాలు1 / 2 -  సంవత్సరాలు1 / 2 -  సంవత్సరాలు
బీమా మొత్తం (S.I.) రూ. (లక్షలు)5 / 7.5/ 10/ 15 / 20/ 25 / 50 / 75 / 100 లక్షలువ్యక్తిగతం - 3 లక్షలు5 / 10 / 15 / 20 / 25 / 50 / 100 లక్షలుSI: 5 / 7 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 లక్షలుSI: 5 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 లక్షలు
నిర్వచించిన పరిమితి: 3 లక్షలునిర్వచించిన పరిమితి: 3 / 5 / 10 / 15 / 20 / 25 లక్షలు
వ్యక్తిగతం & సహా-కుటుంబ(ఫ్లోటర్) - 5 /10 / 15 /20 /25 / 50 / 75 / 100 లక్షలుSI: 5 / 10 / 15 / 20 / 25 / 50 / 75 / 100 లక్షలు 
నిర్వచించిన పరిమితి: 5 / 10 / 15 / 20 / 25 లక్షలు 
క్లెయిమ్ చేయకుండా ఉన్న ప్రతి సంవత్సరానికి సంచిత బోనస్S.I. లో 100% వరకు S.I. లో 100% వరకు S.I. లో 100% వరకు న కించిత్ (శూన్యం)న కించిత్ (శూన్యం)
ప్రసూతి కవరేజ్ & నిరీక్షణ కాలంఅవును & 24 నెలలుఅవును & 36 నెలలుఅవును,అవును & 12 నెలలుఅవును & 12 నెలలు
5/10 లక్షలకు 24 నెలలు S.I.
15 లక్షలకు 12 నెలలు మరియు అంతకంటే ఎక్కువ S.I.
మధ్య-కాల చేరికఅందుబాటులో ఉందిఅందుబాటులో ఉందిఅందుబాటులో ఉందిఅందుబాటులో లేదుఅందుబాటులో లేదు

 

డెలివరీ కవర్‌తో స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సు పాలసీ

 

పేరులో చెప్పిన విధంగానే, స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సు పాలసీ మీ అన్ని వైద్య ఖర్చులకు సమగ్రమైన మరియు పూర్తి కవర్‌ని అందించడానికి రూపొందించబడింది. వాస్తవానికి, భార్యాభర్తలిద్దరూ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సు పాలసీ కింద కవర్ చేయబడినప్పుడు ప్లాన్ అనేక ప్రత్యేకమైన ప్రసవ సంబంధిత కవరేజ్ ప్రయోజనాలను అందిస్తుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొత్తగా పెళ్లయిన జీవిత భాగస్వామి లేదా కొత్తగా జన్మించిన శిశువును మధ్య కాలంలో చేర్చడానికి అనుమతించబడుతుంది. ప్రీమియం చెల్లించిన తేదీ నుండి కవరేజ్ ప్రారంభమవుతుంది. ఆశించే తల్లిదండ్రులు ఆసుపత్రిలో ప్రసవం అయినపుడు మరియు కొత్తగా పుట్టిన సంతానం ఖర్చుల కవరేజీని 24 నెలల నిరీక్షణ కాలం తర్వాత పొందవచ్చు.

 

గమనిక: డెలివరీ క్లెయిమ్ తర్వాత రెండవ డెలివరీకి 24 నెలల నిరీక్షన కాల వ్యవధి మళ్లీ వర్తిస్తుంది.

 

కింది డెలివరీ మరియు నవజాత శిశువు ఖర్చులు స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సు పాలసీ కింద కవర్ చేయబడతాయి.

 

  • పాలసీ సక్రియంగా ఉన్నప్పుడు బీమా చేసిన వ్యక్తి జీవితకాలంలో సిజేరియన్‌ సెక్షన్ తో సహా ప్రసవం సమయంలో అయ్యే ఖర్చులు గరిష్టంగా రెండు డెలివరీల వరకు లభిస్తుంది.
  • పేర్కొన్న పరిమితుల వరకు సిజేరియన్‌తో సహా డెలివరీకి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులు.
  • ఏదైనా వ్యాధి, ఏదైనా పుట్టుకతో వచ్చే రుగ్మతలతో సహా అనారోగ్యం మరియు ప్రమాదవశాత్తూ పేర్కొన్న పరిమితులలో గాయపడిన వారికి చికిత్స కోసం ఆసుపత్రి/నర్సింగ్ హోమ్‌లో అయ్యే ఖర్చులు.
  • శిశువుకు ఒక సంవత్సరం వయస్సు వచ్చే వరకు టీకా ఖర్చులు పేర్కొన్న పరిమితులకు లోబడి కవర్ చేయబడతాయి.
     

 

యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ (గోల్డ్ ప్లాన్)

 

ఆరోగ్యకరమైన యువకుడిగా, హెల్త్ ఇన్సూరెన్స్‌ను  కొనుగోలు చేయడం అనవసరంగా కనిపించవచ్చు. అయినప్పటికీ, ఇన్సూరెన్సు కలిగి ఉండటం చాలా అవసరం, కాబట్టి, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఊహించని వైద్య ఖర్చులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

 

యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది 18 మరియు 40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులకు వారి నిర్దిష్ట ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి ఒక మంచి ఎంపిక. ఈ ప్లాన్ ఇన్సెంటివ్-లెడ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు, తక్కువ నిరీక్షణ కాల వ్యవధులు, ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు చేరిన తర్వాత ఖర్చుల కవరేజీ, సంచిత బోనస్, వార్షిక ఆరోగ్య తనిఖీలు మరియు బీమా మొత్తాన్ని స్వయంచాలకంగా పునరుద్ధరించడం వంటి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

 

యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ప్రసవ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉంది. భార్యాభర్తలిద్దరూ ఈ పాలసీ గోల్డ్ ప్లాన్ కింద 36 నెలల నిరంతర కాలానికి కవర్ చేయబడినప్పుడు, ప్రసూతి మరియు ప్రసవ-సంబంధిత కవర్ వంటి అనేక ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీ ప్రారంభ తేదీ నుండి 36 నెలల నిరీక్షణ కాలం తర్వాత ప్రసవం మరియు కొత్తగా పుట్టిన సంతానం ఖర్చుల కవరేజ్ ప్రారంభమవుతుంది.

 

గమనిక: రెండవ డెలివరీ క్లెయిమ్ కోసం కొత్తగా 24 నెలల నిరీక్షన కాలం వర్తిస్తుంది.

 

కింది డెలివరీ ఖర్చులు యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాలసీ (గోల్డ్ ప్లాన్) కింద కవర్ చేయబడతాయి

 

  • సాధారణ డెలివరీతో సహా సిజేరియన్‌ సమయంలో అయ్యే ఖర్చులలో ప్రతి డెలివరీకి గరిష్టంగా ₹ 30000 వరకు మరియు పాలసీ సక్రియంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్సు చేసిన వ్యక్తి జీవితకాలంలో గరిష్టంగా రెండు డెలివరీల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
  • ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులు, సిజేరియన్‌తో సహా రూ. 30,000/- వరకు.
  • ముందస్తు సమాచారం అందించి పాలసీ కింద నవజాత శిశువును చేర్చిన తర్వాత వారు పుట్టిన 91వ రోజు నుండి కవరేజ్ ప్రారంభమవుతుంది.
     

 

స్టార్ విమెన్ కేర్ ఇన్సూరెన్సు పాలసీ

 

స్త్రీలు మరియు బాలికలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ మరియు వారి సామర్థ్యాన్ని సాధించినప్పుడు, మొత్తం సమాజం ప్రయోజనం పొందుతుంది. మహిళల ఆరోగ్యం కేవలం మహిళల సమస్య కాదు. స్త్రీలు సాధారణ సంరక్షకులు మరియు గృహిణుల పాత్రలను పోషించిన ఆ రోజులు పోయాయి. కాలక్రమేణా, మహిళలు ప్రపంచ నాయకులుగా ఉద్భవించారు మరియు సాధికారత పొందారు. ఇటీవలి కాలంలో, మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు తమ పనిని అప్రయత్నంగా సాగించడానికి చాలా కష్టపడుతున్నారు. ఎక్కువ మంది మహిళలు కెరీర్-ఆధారితంగా మరియు నిర్ణయాధికారులుగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళల ఆరోగ్య విషయానికి వస్తే, వారు భద్రత మరియు రక్షణను విస్మరిస్తారు. తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు, వారు తమ ఆర్థిక స్వేచ్ఛ మరియు వృత్తిని వదులుకోవాల్సిన బాధ్యత ఉంది.

 

స్టార్ విమెన్ కేర్ ఇన్సూరెన్సు పాలసీ అనేది పిల్లలు మరియు జీవిత భాగస్వాములతో సహా మహిళల అవసరాలను తీర్చడానికి మహిళల-కేంద్రీకృత పాలసీ. ఈ పాలసీ 18 - 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీ ప్రసూతి, నవజాత శిశువులకు రక్షణ కల్పించడం, గర్భాశయంలోని పిండం శస్త్రచికిత్సలు, సహాయక పునరుత్పత్తి చికిత్సలు మరియు మరెన్నో, స్త్రీల అభివృద్ధి సంబంధిత సమస్యలలో ఒక భాగంగా ఏర్పడే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రసూతి కోసం నిరీక్షణ కాల వ్యవధులు మరియు ఆడ పిల్లల కోసం ఇతర పునరుద్ధరణ ప్రయోజనాలు ఉన్నాయి.

 

కింది ప్రసూతి ఖర్చులు స్టార్ విమెన్ కేర్ ఇన్సూరెన్సు పాలసీ కింద చెల్లించబడతాయి.

 

  • సాధారణ లేదా సిజేరియన్ ద్వారా ప్రసవం కోసం కవర్ చేయబడిన డెలివరీ ఖర్చులు రూ. 25,000/- నుండి రూ. 1,00,000/- వరకు ఉంటుంది.
  • సంతానోత్పత్తికి సహాయక పునరుత్పత్తి చికిత్స కవర్ చేయబడింది.
  • గర్భాశయంలోని పిండం శస్త్రచికిత్సలకు బీమా మొత్తం వరకు చెల్లించబడతాయి
  • కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బీమా మొత్తం వరకు చెల్లించబడతాయి
  • శిశువుకు 12 సంవత్సరాల వయస్సు వరకు సంవత్సరానికి నాలుగు పీడియాట్రిక్ కన్సల్టేషన్లు సంప్రదింపులకు రూ.500/- చొప్పున చెల్లించాలి.
  • నవజాత శిశువుకు మెటబాలిక్ స్క్రీనింగ్ ఒకసారి 3500/- వరకు చెల్లించబడుతుంది
  • ఆసుపత్రిలో కాకుండా బయట గర్భ నిర్ధారణ అయిన వారి సంప్రదింపుల కొరకు ప్రసూతి పూర్వ సంరక్షణ అందుబాటులో ఉన్నాయి.
     

 

 

సూపర్ సర్‌ప్లస్ ఇన్సూరెన్సు పాలసీ (గోల్డ్ ప్లాన్)

 

సూపర్ సర్‌ప్లస్ ఇన్సూరెన్సు పాలసీ అనేది టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ, ఇది మీ డిఫాల్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువగా ఉన్నప్పుడు మీ హాస్పిటల్ ఖర్చులను కవర్ చేయడానికి సహాయపడుతుంది. గోల్డ్ ప్లాన్ కింద పాలసీ వ్యవధి 1 సంవత్సరం మరియు 2 సంవత్సరాలు మరియు జీవితకాల పునరుద్ధరణ అందుబాటులో ఉంటుంది. ఈ టాప్-అప్ ప్లాన్‌లోని ప్రధాన ప్రయోజనాలలో అన్ని డేకేర్ విధానాలు, ప్రసూతి సమయంలో ఆసుపత్రిలో చేరడం, డెలివరీ ఖర్చులు, అవయవ దాతల ఖర్చులు మరియు ఎయిర్ అంబులెన్స్ కవర్ ఖర్చుల కవరేజీ ఉన్నాయి.

 

సూపర్ సర్‌ప్లస్ ఇన్సూరెన్సు పాలసీ (గోల్డ్ ప్లాన్) డెలివరీకి సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది మరియు డెలివరీ సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పాలసీ 18 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. ఎక్కువ ప్రీమియం చెల్లించకుండానే తమ బీమా మొత్తాన్ని పెంచుకోవాలనుకునే వ్యక్తులకు ఈ ప్లాన్ మంచి ఎంపిక.

 

ఈ పాలసీ కింద క్రింది ప్రసూతి ఖర్చులు కవర్ చేయబడుతాయి

 

  • సాధారణ డెలివరీతో సహా సిజేరియన్‌ సెక్షన్‌ సమయంలో అయ్యే ఖర్చులు యొక్క ప్రతీ పాలసీ వ్యవధికి ₹ 50000 వరకు మరియు పాలసీ సక్రియంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్సు చేసిన వ్యక్తి జీవితకాలంలో గరిష్టంగా రెండు డెలివరీల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
  • ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులు, సిజేరియన్‌తో సహా రూ. 50,000/- వరకు
  • చట్టబద్ధంగా గర్భం తొలగించుకోవాలనుకునే వారికి అయ్యే ఖర్చులు.
     

 

స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీలలో ఏమి చేర్చబడ్డాయి:

 

  • పాలసీలో పేర్కొన్న పరిమితుల మేరకు సి-సెక్షన్‌తో సహా డెలివరీ మరియు నవజాత శిశువు ఖర్చులు.
  • ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులు.
  • ఏదైనా వైద్యపరమైన సమస్యల కారణంగా నవజాత శిశువు ఆసుపత్రిలో చేరే ఛార్జీలను కవర్ చేస్తుంది
  • పాలసీలో పేర్కొన్న పరిమితుల వరకు ఒక సంవత్సరం వరకు నవజాత శిశువుకు టీకాలు వేయబడతాయి.
  • చట్టబద్ధంగా గర్భం తొలగించుకోవాలనుకునే వారికి అయ్యే ఖర్చులు.
     

 

స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీలలో ఏమి చేర్చబడి లేవు:

 

  • విశ్రాంతి చికిత్స, పునరావాసం మరియు విశ్రాంతి సంరక్షణ
  • ఊబకాయం యొక్క శస్త్రచికిత్సకు సంబంధించిన ఖర్చులు
  • లింగ మార్పు చికిత్సలు
  • కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీ
  • ప్రమాదకర లేదా సాహస క్రీడలు
  • ఏదైనా ఆసుపత్రిలో లేదా ఏదైనా వైద్య నిపుణుడు లేదా ఇన్సూరెన్సు సంస్థ ద్వారా ప్రత్యేకంగా మినహాయించబడిన మరియు దాని వెబ్‌సైట్‌లో వెల్లడించిన ఏదైనా ఇతర విధానం ద్వారా చికిత్స కోసం అయ్యే ఖర్చులు
  • మద్యపానం, మాదకద్రవ్యాలు లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా ఏదైనా వ్యసనపరుడైన పరిస్థితి మరియు దాని పర్యవసానాలకు చికిత్స
     

 

అర్హత ప్రమాణం

 

ప్రసూతి ప్రయోజనాలతో కూడిన వైద్య పాలసీ నిరీక్షణ కాలానికి లోబడి డెలివరీ సంబంధిత ఖర్చులను కవర్ చేస్తుంది. మేము ముందుగానే కుటుంబ ప్రణాళికను మరియు ప్రసూతి కవర్‌ను కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నాము. చాలా ఇన్సూరెన్సు పాలసీలు డెలివరీ ఖర్చులను కవర్ చేయడానికి 12-36 నెలల వరకు నిరీక్షణ వ్యవధిని కలిగి ఉంటాయి.

 

 

ప్రసూతి ప్రయోజనాలతో కూడిన వైద్య విధానం ఎందుకు ముఖ్యమైనది?

 

గర్భం మరియు ప్రసవం అనేది స్త్రీ జీవితంలో ముఖ్యమైన దశలు. తల్లిదండ్రులు కావడానికి ఖచ్చితంగా ఆనందం ఉన్నప్పటికీ, చాలామంది మహిళలు దానితో పాటు ఆందోళనను కూడా అనుభవిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆసుపత్రి ఖర్చుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వద్ద ప్రసూతి ఖర్చులను కవర్ చేసే ఇన్సూరెన్సు పాలసీ ఉంటె, అవి ఖర్చులు చూసుకోబడుతాయని తెలిసి మీ చింతలను ప్రక్కన పెట్టి హాయిగా మీ గర్భధారణము ఆనందించవచ్చు

 

దేశవ్యాప్తంగా పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో డెలివరీ ఖర్చులు పెరగడంతో, ప్రసూతి ఇన్సూరెన్సు కవర్ మరియు కుటుంబ వైద్య ఇన్సూరెన్సును ఎంచుకోవడం ఖర్చులను పరిష్కరించడానికి ఉత్తమ విధానం.

 

డెలివరీ ప్రయోజనంతో మధ్యస్థ పాలసీని కొనుగోలు చేయడం వల్ల పొందే ప్రయోజనాలు

 

ఆర్థిక బ్యాకప్

 

ప్రసూతి ఇన్సూరెన్సు సాధారణ లేదా సిజేరియన్ డెలివరీ సమయంలో అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. మీకు ఎలాంటి వైద్య చికిత్స అవసరం అయినప్పటికీ, మీరు ఒత్తిడి లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, మెటర్నిటీ ప్లాన్‌లతో కూడిన పాలసీలు ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులను కవర్ చేస్తాయి.

 

నవజాత శిశువును కవర్ చేస్తుంది

 

స్టార్ కాంప్రహెన్సివ్, యంగ్ స్టార్ (గోల్డ్) మరియు సూపర్ సర్‌ప్లస్ గోల్డ్ ప్లాన్ అనే మా ప్లాన్‌లు నవజాత శిశువులకు మొదటి రోజు నుండి కవరేజీని అందిస్తాయి. ఇందులో మెడికల్ ఎమర్జెన్సీలు మరియు టీకాలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉన్నాయి.

 

ప్రసూతి ఖర్చులను కవర్ చేస్తుంది

 

ప్రసూతి ప్రయోజనాలతో కూడిన మెడిక్లెయిమ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం గర్భధారణ సమయంలో ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది సాధారణ లేదా సిజేరియన్ డెలివరీతో సంబంధం లేకుండా ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు, డెలివరీ ఖర్చులను చూసుకుంటుంది.

 

ప్రసూతి ప్రయోజనాలతో కూడిన మెడిక్లెయిమ్ ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు మీరు ఏమి పరిగణించాలి?

 

డెలివరీ ఖర్చులను కవర్ చేయడానికి ప్రతి పేరెంట్ ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీకి అర్హులు. వైద్య బీమా లేకుండా అధిక ప్రసూతి సంరక్షణ ఖర్చులను నిర్వహించడం తల్లిదండ్రులిద్దరికీ కష్టంగా ఉండవచ్చు. ఫలితంగా, మీ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి ఉత్తమమైన పద్ధతి ప్రసూతి హెల్త్ ఇన్సూరెన్సు పాలసీని కొనుగోలు చేయడం, ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన పేరెంట్‌హుడ్‌ను నిర్ధారించడం.

 

ప్రసూతి ప్రయోజనాలతో కూడిన మెడికల్ పాలసీని ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి

 

  • ఆసుపత్రిలో చేరే ఖర్చులే కాకుండా వివిధ వైద్య బిల్లుల నుండి మిమ్మల్ని రక్షించే అత్యుత్తమ ప్రసూతి ఇన్సూరెన్సు ప్లాన్‌ను ఎంచుకోండి.
  • ప్రతి ఇళ్ళు డబ్బు ఆదా చేయాలి. ఫలితంగా, మీరు ప్రయోజనం పొందగల ప్రీమియం పొదుపు కోసం వెతకండి.
  • వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మీరు నగదు రహిత సౌకర్యాన్ని సులభంగా పొందగలరని నిర్ధారించుకోవడానికి క్యాష్‌లెస్ నెట్‌వర్క్ హాస్పిటల్‌ల జాబితాను వెతకండి.
  • పాలసీ పత్రాలను చదవడం ద్వారా పాలసీ యొక్క చేరికలు, మినహాయింపులు, ఉప-పరిమితులు మరియు నిరీక్షణ వ్యవధిని అర్థం చేసుకోండి.

 

గరిష్ట కవరేజ్ మరియు ఫీచర్లతో సరైన పాలసీని జాగ్రత్తగా సరిపోల్చడం మరియు ఎంచుకోవడం ద్వారా, మీరు సరసమైన ధరతో ప్రసూతి కవరేజీని పొందవచ్చు.

 

స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు నుండి పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?

 

పూర్వ మరియు ప్రసవానంతర సంరక్షణ

 

అన్ని హెల్త్ ఇన్సూరెన్సు సంస్థలు ప్రసవానికి ముందు మరియు ప్రసవానంతర ఖర్చులను కవర్ చేయడానికి ఆఫర్ చేయవు. ఇది నిజంగా మీ పూర్వ మరియు ప్రసవానంతర ఖర్చుల కోసం స్టార్ హెల్త్ ఆఫర్ కవరేజ్ యొక్క ప్రయోజనం.

 

నగదు రహిత సౌకర్యం

 

దేశంలోని 14,000+ కంటే ఎక్కువ ఆసుపత్రుల నెట్‌వర్క్ నుండి కాబోయే తల్లులు నగదు రహిత సౌకర్యాన్ని పొందవచ్చు.

 

వేగవంతమైన మరియు అంతరాయాలు లేని క్లెయిమ్‌ల పరిష్కారం

 

స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు పాలసీదారులు 14000+ నెట్‌వర్క్ ఆసుపత్రులలో  క్లెయిమ్ సూచనతో పరిష్కారం పొందవచ్చు, ఇది ప్రసవ సమయంలో మీ ప్రియమైన వారిని వైద్యం చేయడానికి మరియు శ్రద్ధ వహించడానికి సమయాన్ని వెచ్చించడానికి కీలక ప్రయోజనం. స్టార్ హెల్త్‌లో మీరు పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం TPA (థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్) ప్రమేయం లేకుండా మీ క్లెయిమ్‌లను అవాంతరాలు లేని పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు.

సహాయ కేంద్రం

అయోమయంగా ఉందా? మావద్ద సమాధానాలు ఉన్నాయి

మీ హెల్త్ ఇన్సురెన్స్ సంబంధిత సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి.

Disclaimer:
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in